రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సదరన్ నావల్ కమాండ్‌లో ఫ్లోట్/సీ శిక్షణ పొందుతున్న రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ ( ఆర్ఎస్ఎన్ఎఫ్ ) క్యాడెట్‌ల మొదటి బ్యాచ్‌ను కలుసుకున్న సీఎన్ఎస్ అడ్మిరల్ ఆర్ హరి కుమారు

Posted On: 02 JUN 2023 9:44AM by PIB Hyderabad

సీఎన్ఎస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ ప్రాంతంలో సముద్ర శిక్షణ పొందుతున్న సౌదీ అరేబియాకు చెందిన కింగ్ ఫహద్ నావల్ అకాడమీ క్యాడెట్‌లతో ముచ్చటించారు.  రాయల్ సౌదీ నావల్ ఫోర్స్ (ఆర్ఎస్ఎన్ఎఫ్)కు చెందిన 55 మంది క్యాడెట్‌లతో పాటు ఐదుగురు డైరెక్టింగ్ స్టాఫ్‌లు.. ఇండియన్ నేవీతో ఫ్లోట్ ట్రైనింగ్‌లో ఉన్నారు. శిక్షణలో భాగంగా ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ షిప్‌లు, ఐఎన్ఎస్ ట్రై మరియు ఐఎన్ఎస్ సుజాతతో జతచేయబడ్డారు. సీఎన్‌ఎస్‌కు ప్రస్తుతం జరుగుతున్న నౌకాశ్రయం, సముద్రంలో శిక్షణా కార్యకలాపాలు గురించి వివరించడం జరిగింది. శిక్షణ వ్యవధిలో శిక్షణార్థులు సాధించిన ప్రగతిని కూడా ఆయనకు వివరించారు. శిక్షణా పాఠ్యాంశాల్లో భాగంగా, సముద్ర శిక్షణా దశను ప్రారంభించే ముందు క్యాడెట్‌లకు సిమ్యులేటర్ శిక్షణను చేపట్టారు. ఇండియన్ నేవల్ షిప్స్‌లో క్యాడెట్లు సముద్రంలో 10 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. సముద్ర సోర్టీల సమయంలో, పైలటేజీ జలాల్లో నావిగేషన్, యాంకరింగ్, కోస్టల్ నావిగేషన్, సముద్రంలో ఇంధనం తిరిగి నింపడం, సముద్రపు పడవలు, అగ్నిమాపక చర్యలు, అత్యవసర కసరత్తులు వంటి వాటిపై దృష్టి సారిస్తూ నావిగేషన్ మరియు సీమాన్‌షిప్ యొక్క ఆచరణాత్మక అంశాలపై వారు కఠినమైన శిక్షణను పొందారు. సెయిల్ ట్రైనింగ్ షిప్ ఐఎన్ఎస్ సుదర్శినిపై రెండు రోజుల నౌకాశ్రయ శిక్షణ కూడా వారికి సెయిల్ షిప్‌లోని జీవితంలోని కఠినతతో పరిచయం చేయడానికి ప్రణాళిక చేయబడింది. క్యాడెట్‌లు తమ శిక్షణ అనుభవాలను సీఎన్ఎస్తో పంచుకున్నారు - ఏదైనా యుద్ధనౌకలో ప్రయాణించిన వారి మొట్టమొదటిసారి. చర్చల సందర్భంగా, ఐఎన్ షిప్‌లలో తమకు లభించిన అధిక-నాణ్యత శిక్షణ, దర్శకత్వ పట్ల  సిబ్బంది తమ ప్రశంసలను వ్యక్తం చేశారు. తన ప్రసంగంలో, సీఎన్ఎస్ భారతదేశంలోని ఆర్ఎస్ఎన్ఎఫ్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. సౌదీ అరేబియా మరియు భారతదేశాల రెండు నావికాదళాల మధ్య పెరుగుతున్న స్నేహానికి నిదర్శనంగా.. భారత నావికాదళం సౌదీ క్యాడెట్‌లకు తొలిసారిగా శిక్షణ ఇస్తున్నట్టుగా తెలిపారు. ఇటీవల సుడాన్ నుండి భారతీయ పౌరులను తరలించే సమయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి అందిన సహాయాన్ని ఆయన అంగీకరించారు. రెండు నౌకాదళాల మధ్య సన్నిహిత సంబంధాలు మరియు సహకారాన్ని నొక్కి చెబుతూ, ఆర్‌ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఉమ్మడి విన్యాసాలు, సిబ్బంది చర్చలు మరియు శిక్షణ మార్పిడి సంవత్సరాలుగా బాగా పురోగమించాయన్నారు. ఇది రెండు నౌకాదళాల మధ్య బలమైన బంధాన్ని సూచిస్తుందని సీఎన్ఎస్ పునరుద్ఘాటించారు.  సముద్ర భద్రతకు సంబంధించి ఇరు దేశాలు ఒకే విధమైన అభిప్రాయాలను పంచుకుంటున్నాయని మరియు ఈ ప్రాంతంలో సురక్షితమైన, సుంరక్షితమైన సముద్రాలను నిర్ధారించడానికి ఒకదానితో ఒకటి సన్నిహితంగా పని చేస్తాయని కూడా ఆయన వెల్లడించారు. 

***


(Release ID: 1929604) Visitor Counter : 154