వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఎఫ్ సి ఐ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యువతను నియమించడం ద్వారా ఇటీవలి సంవత్సరాలలో ప్రముఖ రిక్రూటర్‌గా నిలిచింది.
ఎఫ్ సి ఐ 2020లో 3,687 కేటగిరీ III అధికారులను మరియు 2021లో 307 కేటగిరీ II మరియు 87 కేటగిరీ I అధికారులను నియమించింది
ఎఫ్ సి ఐ 2022లో 5159 కేటగిరీ II మరియు III ఆఫీసర్ల పోస్టులను ప్రకటించింది. నియామక ప్రక్రియ చివరి దశలో ఉంది మరియు త్వరలో ముగుస్తుంది
प्रविष्टि तिथि:
01 JUN 2023 2:01PM by PIB Hyderabad
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ ), దేశ ఆహార భద్రతను నిర్ధారించడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి. ఇటీవలి సంవత్సరాలలో ప్రతి సంవత్సరం యువతనుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించింది.
ఎఫ్ సి ఐ యొక్క రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కేవలం ఆన్‌లైన్ పరీక్షా విధానం ద్వారా నిర్వహించబడుతుంది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌తో పాటు ప్రముఖ జాతీయ/స్థానిక వార్తాపత్రికలలో విస్తృతంగా ప్రచారం చేయబడుతుంది. ఎంపిక బహిరంగ పోటీ ద్వారా జరుగుతుంది మరియు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. కార్పొరేషన్ భారత ప్రభుత్వం యొక్క నియమాలు మరియు నిబంధనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం ద్వారా ఎఫ్ సి ఐ అత్యంత పారదర్శకత మరియు వాస్తవికతను నిర్ధారిస్తుంది.
వివిధ కేటగిరీల (కేటగిరీ I, II, III మరియు IV) కింద పోస్ట్‌లు క్రమం తప్పకుండా ప్రచారం చేయబడుతున్నాయి. ఎఫ్ సి ఐ 2020 సంవత్సరంలో 3687 కేటగిరీ III అధికారులను, 2021 సంవత్సరంలో 307 కేటగిరీ II మరియు 87 కేటగిరీ I అధికారులను విజయవంతంగా నియమించుకుంది.
ప్రస్తుతం, ఎఫ్ సి ఐ 2022 సంవత్సరంలో 5159 కేటగిరీ II మరియూ III పోస్ట్‌లను ప్రకటించింది. 11.70 లక్షల మంది అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇప్పటికే రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చివరి దశలో ఉంది మరియు త్వరలో ముగిసే అవకాశం ఉంది.
సమర్థవంతమైన కార్యకలాపాల కోసం మరియు మానవ వనరుల కొరతను తీర్చడానికి కార్పొరేషన్‌లో ఉన్న ఖాళీలను తగ్గించడానికి బదులుగా ఎఫ్ సి ఐ భర్తీ చేస్తూ ఉపాధ. కల్పిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1929128)
आगंतुक पटल : 251