నీతి ఆయోగ్
ఏటీఎల్ టింకర్‌ప్రెన్యూర్ 2023: పేరు నమోదు కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రకటన
Posted On:
01 JUN 2023 4:33PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎయిమ్), ‘ఏటీఎల్ టింకర్‌ప్రెన్యూర్ 2023’ కోసం పేరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది, ఎయిమ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రోగ్రాం కింద ఏర్పాటు చేస్తున్న కీలక వేసవి శిక్షణ కార్యక్రమం.
ఏటీఎల్ టింకర్‌ప్రెన్యూర్ కోసం జూన్, జూలైలో 7 వారాల వర్చువల్ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. శిబిరం ముగిసే సమయానికి, కీలక డిజిటల్ నైపుణ్యాలు, విధానాలతో సొంతంగా ఆన్‌లైన్ ఆవిష్కరణ రూపొందించేలా విద్యార్థులను ఇది సన్నద్ధం చేస్తుంది. గత శిక్షణ శిబిరంలో 5000కు పైగా బృంద ఆవిష్కరణలు వచ్చాయి. వారిలో తొలి 100 మంది విద్యార్థులు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఇంటర్న్‌షిప్, ఆర్థిక సాయం అవకాశాలను పొందారు.
శిక్షణ శిబిరం అన్ని పాఠశాలల (ఏటీఎల్ ఉన్నా, లేకపోయినా) విద్యార్థుల కోసం తెరిచి ఉంటుంది. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ధృవపత్రాలు, ఇంటర్న్‌షిప్‌లు, ఇతర ఆకర్షణీయమైన అవకాశాలను అందుకుంటారు. పేరు నమోదు కోసం చివరి తేదీ 5 జూన్ 2023.
నీతి ఆయోగ్ మెంటార్స్ ఆఫ్ చేంజ్ నుంచి ప్రతి నమోదిత విద్యార్థి బృందానికి మార్గదర్శకత్వం అందుతుంది. ఈ శిబిరం జూన్ 8న ప్రారంభమై జులై 24 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 6వ తేదీలోగా సమర్పించవచ్చు.
ప్రతి వారం, డిజిటల్ నైపుణ్యాలు, ఉత్పత్తి అభివృద్ధి, వ్యవస్థాపకత నైపుణ్యాలపై విద్యార్థుల కోసం నిపుణుల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. ఆవిష్కరణలపై దృష్టిని కేంద్రీకరించేలా మద్దతు ఇచ్చే కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు.
ఈ సంవత్సరం, ప్రాంతీయ భాషల్లో ప్రత్యేక పాడ్‌క్యాస్ట్‌లు, వారపు సవాళ్లు, వివిధ రకాల అభ్యాస పద్ధతులు ఉంటాయి.
సవాల్‌ను ఆవిష్కరించిన ఎయిమ్ మిషన్ డైరెక్టర్ డా.చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ “ఇది మనందరికీ ఉద్వేగభరిత క్షణం. మనం గత రెండు దఫాల్లో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చూశాం. ఈ సంవత్సరం కూడా కొన్ని ఉత్తేజకరమైన ఆవిష్కరణలను చూస్తాం. ఆలోచన నుంచి ఆవిష్కరణ వైపు ప్రయాణం చేసేందుకు, విద్యార్థులకు ఏటీఎల్ టింకర్‌ప్రెన్యూర్ ఒక గొప్ప వేదిక" అని చెప్పారు.
విద్యార్థులు ఈ లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు: https://kid-ex.com/champions/atltnkr2023
మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి: https://kid-ex.com/pdf/ATL_Tinkerpreneur_2023_Brochure.pdf
*****
(Release ID: 1929075)
Visitor Counter : 279