రక్షణ మంత్రిత్వ శాఖ
నావికాదళ ఆర్మమెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పి ఉపాధ్యాయ ఐఎన్ఎఎస్
Posted On:
01 JUN 2023 12:15PM by PIB Hyderabad
మే 31, 2023న పదవీవిరమణ చేసిన శ్రీ కెఎస్‌సి అయ్యర్ నుంచి ఐహెచ్‌క్యూ ఎంఒడి (రక్షణ మంత్రిత్వ శాఖలోని ఏకీకృత కేంద్ర కార్యాలయం) (నావికాదళం)లో నావల్ ఆర్మమెంట్ (నావికదళ యుద్ధసామాగ్రి) (డిజిఒఎన్ఎ) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ పి. ఉపాధ్యాయ ఇండియన్ నేవల్ ఆర్మమెంట్ సర్వీస్ (భారతీయ నావికాదళ యుద్ధసామాగ్రి సేవ)కు చెందిన 1987 బ్యాచ్ అధికారి. ఆయన 12 జులై 1989న ఆయన భారతీయ నావికాదళానికి చెందిన నావల్ ఆర్మమెంట్ (యుద్ధ సామగ్రి) ఆర్గనైజేషన్‌లో చేరారు. ఎస్‌జిఎస్ఐటిఎస్ ఇండోర్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆయన దేవీ అహల్య యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిజిటల్ టెక్నిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అన్న అంశంపై 1988లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, 1995లో గైడెడ్ క్షిపణులు ప్రత్యేక విషయాంశంగా యూనివర్సిటీ ఆఫ్ పూణె నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టాను పొందారు. తన 34 సంవత్సరాల వృత్తిపరమైన జీవితంలో ఆయన ఎన్ఎడి (విశాఖపట్నం), ఎన్ఎడి (కరంజా) ఎన్ఎడి (ట్రాంబే), ఎన్ఎడి (అల్వే)గా, ఐహెచ్‌క్యూ, ఎంఒడి (ఎన్)లో పలు కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఎన్‌డిసి- 53కి చెందిన నావల్ డిఫెన్స్ కాలేజ్ పూర్వ విద్యార్ధి.
మందుగుండు సామాగ్రి వినియోగ, విసర్జనలపై విస్త్రత పరిజ్ఞానాన్ని కలిగి ఉండటంతో పాటు క్షిపణి, టార్పెడో (నౌకల విధ్వంసకారి)ల నిర్వహణలో ప్రత్యేక జ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్నారు.
ఆయన నావల్ ఆర్మమెంట్ డైరెక్టర్ జనరల్‌గా 01 జూన్ 2023న బాధ్యతలు స్వీకరించారు.
(Release ID: 1929032)
Visitor Counter : 194