హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మణిపూర్ పర్యటనలో తన మూడవ రోజున కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా మోరే మరియు కాంగ్‌పోక్పిలను సందర్శించారు. పౌర సమాజ సంస్థలతో విస్తృత చర్చలు జరిపారు.

రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రతినిధులు గట్టి మద్దతు తెలిపారు

కొండ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా, చురచంద్‌పూర్, మోరే, కాంగ్‌పోక్పిలలో అత్యవసర అవసరాల కోసం హెలికాప్టర్ సేవలు అందేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.

హోంమంత్రి కాంగ్‌పోక్పిలోని సహాయ శిబిరాన్ని కూడా సందర్శించి కుకీ కమ్యూనిటీ సభ్యులను కలిశారు. మణిపూర్‌లో వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పేందుకు మరియు వారి స్వస్థలాలకు తిరిగి వచ్చేలా తాము కట్టుబడి ఉన్నామని శ్రీ అమిత్ షా అన్నారు.

శ్రీ అమిత్ షా ఇంఫాల్‌లోని మెయిటీ కమ్యూనిటీ సభ్యులు నివసించే రిలీఫ్ క్యాంపును సందర్శించారు. మణిపూర్‌ను మరోసారి శాంతి మరియు సామరస్య పథంలోకి నడిపించడంపై తమ సంకల్పం అని వారు త్వరగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లడంపై కృషి చేస్తున్నామని హోం మంత్రి చెప్పారు.

హోం మంత్రి ఇంఫాల్‌లో ఉన్నతాధికారులతో భద్రతా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హింసను నిరోధించడానికి సాయుధ దుండగులకు వ్యతిరేకంగా మరియు దోపిడి చేసిన ఆయుధాలను తిరిగి పొందేందుకు కఠినమైన మరియు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Posted On: 31 MAY 2023 7:54PM by PIB Hyderabad

మణిపూర్ పర్యటనలో తన మూడవ రోజున కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా మోరే మరియు కాంగ్‌పోక్పిలను సందర్శించారు. పౌర సమాజ సంస్థలతో విస్తృత చర్చలు జరిపారు. మోరేలో హిల్ ట్రైబల్ కౌన్సిల్, కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, కుకీ చీఫ్స్ అసోసియేషన్, తమిళ్ సంగం, గూర్ఖా సమాజ్ మరియు మణిపురి ముస్లిం కౌన్సిల్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతినిధులు గట్టి మద్దతు తెలిపారు. కేంద్ర హోం మంత్రి కూడా సీనియర్ అధికారుల నుండి భద్రతా పరిస్థితిపై వివరణ తీసుకున్నారు.

 

image.png


కాంగ్‌పోక్పిలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గిరిజన ఐక్యత కమిటీ, కుకీ ఇన్పి మణిపూర్, కుకీ విద్యార్థి సంస్థ, థాడౌ ఇన్పి వంటి పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు ప్రముఖ వ్యక్తులు మరియు మేధావులతో సమావేశమయ్యారు. కొండ ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరా మరియు చురచంద్‌పూర్, మోరే మరియు కాంగ్‌పోక్పిలలో అత్యవసర అవసరాల కోసం హెలికాప్టర్ సేవలు అందేలా చూస్తామని శ్రీ అమిత్ షా హామీ ఇచ్చారు.

హోంమంత్రి కాంగ్‌పోక్పిలోని సహాయ శిబిరాన్ని కూడా  సందర్శించి కుకీ సంఘం సభ్యులను కలిశారు. మణిపూర్‌లో వీలైనంత త్వరగా శాంతిని నెలకొల్పేందుకు మరియు వారి స్వస్థలాలకు తిరిగి వచ్చేలా చూడడానికి తాము కట్టుబడి ఉన్నామని శ్రీ అమిత్ షా అన్నారు.

 

image.png

image.png


తర్వాత శ్రీ అమిత్ షా ఇంఫాల్‌లోని మెయిటీ కమ్యూనిటీ సభ్యులు నివసిస్తున్న సహాయక శిబిరాన్ని సందర్శించారు. మణిపూర్‌ని మరోసారి శాంతి, సామరస్య పథంలోకి నడిపించడంపైనే మా సంకల్పం కేంద్రీకృతమై ఉందని, వీలైనంత త్వరగా తమ స్వస్థలాలకు తిరిగి రావాలని ఆయన అన్నారు

.

image.png

image.png



కేంద్ర హోంమంత్రి ఇంఫాల్‌లో ఉన్నతాధికారులతో భద్రతా సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. హింసను నిరోధించడానికి, సాయుధ దుండగులకు వ్యతిరేకంగా మరియు దోచుకున్న ఆయుధాలను తిరిగి పొందడానికి వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి కఠినమైన మరియు సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన వారిని ఆదేశించారు.

 

*****


(Release ID: 1928943) Visitor Counter : 146