ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్ధిక సంవత్సరం 2023-24లో ఏప్రిల్ 2023కు కేంద్ర ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష
Posted On:
31 MAY 2023 4:08PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ తాలూకు నెలవారీ ఖాతాను ఏప్రిల్ 2023లో ఏకీకృతం చేసి, నివేదికలను ప్రచురించారు. దిగువన ముఖ్యాంశాలను ఇవ్వడం జరిగిందిః -
భారత ప్రభుత్వం రూ. 1,70, 501 కోట్లను ( మొత్తం రసీదులలో బిఇ 2022-24 లో 6.3%)ను ఏప్రిల్ 2023లో అందుకోగా, అందులో రూ. 1,58, 901 కోట్ల పను్న ఆదాయం (కేంద్రానికి నికరంగా), రూ. 10, 958 పన్నేతర ఆదాయం, రూ. 642 రుణ రహిత మూలధన రసీదులు ఉన్నాయి. రుణ రహిత మూలధన రశీదులలో, రూ. 592 కోట్ల రుణాల వసూలు కాగా, రూ. 9 కోట్లు ఇతర మూలధన రశీదులు ఉన్నాయి. భారత ప్రభుత్వం ద్వారా పన్నుల వాటి పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 59,140 కోట్లను ఇప్పటివరకూ బదిలీచేయడం జరిగింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో బదిలీ చేసిన మొత్తంతో పోలిస్తే రూ. 11, 548 కోట్లు ఎక్కువ.
భారతప్రభుత్వం వెచ్చించిన మొత్తం వ్యయం రూ. 3,04, 096 కోట్లు (బిఇ 2023-24లో 6.8%). ఇందులో రూ. 2,25, 639 కోట్లు ఆదాయపు ఖాతాపై కాగా, రూ. 78,457 కోట్లు మూలధన ఖాతాపై వెచ్చించింది. మొత్తం రెవిన్యూ వ్యయం రూ. 47, 929 కోట్లు వడ్డీ చెల్లింపుల కారణంగా కాగా, రూ. 25, 161 కోట్లు ప్రధాన సబ్సిడీల కారణంగా ఖర్చు అయ్యాయి.
***
(Release ID: 1928783)
Visitor Counter : 170