రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలో నావికాదళ ఇన్వెస్టిట్యూర్ వేడుక సందర్భంగా సాహస& విశిష్ట సేవా పతకాలను అందించనున్న నావికాదళాధిపతి
Posted On:
30 MAY 2023 2:31PM by PIB Hyderabad
సాహస చర్యలను, నాయకత్వం, వృత్తిపరమైన విజయాలను, ఉన్నత స్థాయి సేవలను అందించిన నావికాదళ సిబ్బందిని సత్కరించేందుకు 31 మే 2023న విశాఖపట్నం నావల్ బేస్‌లో నావికాదళ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ -2023ను నిర్వహించనున్నారు. చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ (సిఎన్ఎస్- నావికాదళాధిపతి) అడ్మిరల్ ఆర్. హరికుమార్ భారత రాష్ట్రపతి తరఫున అవార్డు గ్రహీతలకు సాహస, విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ఈ నావల్ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీని సాయంత్రంపూట నిర్వహించడం ఇదే తొలిసారి.
ఈ వేడుక సందర్భంగా రెండు నవ్ సేనా పతకాలను (సాహసం), 13 నవ సేవా పతకాలను (విధి పట్ల అంకితభావం), 16 విశిష్ట సేవా పతాకలను, రెండు జీవన రక్షక్ పదక్ సహా 33 అవార్డులను అందచేయనున్నారు.
(https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1893744)
ఆయుధాల మెరుగదల, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రంగాలలో అగ్రగామి పరిశోధన చేసిన వారికి లెఫ్టనెంట్ వికె జైన్ మెమొరియల్ స్వర్ణ పతకం, విమాన భద్రతను ప్రోత్సహించినందుకు కెప్టెన్ రవి ధర్ మెమొరియల్ స్వర్ణ పతకాన్ని కూడా సిఎన్ఎస్ అందచేస్తారు.
కార్యాచరణ యూనిట్లకు, తీర యూనిట్లకు యూనిట్ సైటేషన్లను (ఉల్లేఖనాలను) కూడా అందచేస్తారు.
వేడుక ప్రత్యేక కవాతుతో ప్రారంభం అవుతుంది. ఈ కవాతును భారతీయ నావికాదళానికి చెందిన పలువురు సీనియర్ అధికారులతో కలిసి అవార్డు గ్రహీత జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులు వీక్షిస్తారు.
ఎన్ఐసిని ‘IN Youtube’ ఛానెల్ (భారతీయ నావికాదళ ఛానెల్) ద్వారా 31 మే 2023న సాయంత్రం 5.00 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
1D6W.jpg)
(Release ID: 1928343)
Visitor Counter : 195