ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022-23 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 4.02 లక్షల టన్నుల మాంగనీస్ ఖనిజం ఉత్పత్తి చేసిన మొయిల్‌; గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7% వృద్ధి


సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఎఫ్‌వై23లో రెండో అత్యధిక ఉత్పత్తి నమోదు

ఎఫ్‌వై24లో రెండంకెల ఉత్పత్తి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న మొయిల్‌

Posted On: 29 MAY 2023 4:45PM by PIB Hyderabad

2023 మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికం, ఆర్థిక సంవత్సరం ఫలితాలను మొయిల్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో, మొయిల్‌ 4.02 లక్షల టన్నుల మాంగనీస్ ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ‍‌(సీపీఎల్‌వై) ఈసారి 7% వృద్ధిని సాధించింది. నాలుగో త్రైమాసికంలో అమ్మకాలు కూడా సీపీఎల్‌వైతో పోలిస్తే 3% పెరిగి 3.91 లక్షల టన్నులకు చేరాయి. ఎలక్ట్రోలైట్ మాంగనీస్ డయాక్సైడ్ (ఈఎండీ) అమ్మకాల ఆదాయం CPLYతో పోలిస్తే 48% మెరుగుపడింది.

సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే, ఎఫ్‌వై23లో రెండో అత్యధిక ఉత్పత్తిని మొయిల్‌ నమోదు చేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో మాంగనీస్ ఖనిజం అమ్మకాలు 11.78 లక్షల టన్నులుగా నమోదయ్యాయి, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఎఫ్‌వై22 కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎఫ్‌వై23 సమయంలో ఈఎండీ అమ్మకాల టర్నోవర్ కూడా కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది, సీపీఎల్‌వైతో పోలిస్తే 100% పైగా వృద్ధిని నమోదు చేసింది.

   

 

ఎఫ్‌వై23లో రికార్డు స్థాయిలో రూ.245 కోట్ల మూలధన వ్యయం (క్యాపెక్స్‌) చేసింది. ఇది దాదాపు సంవత్సరం నికర లాభానికి (ప్యాట్‌) సమానం. మొయిల్‌, ఎఫ్‌వై23లో అత్యుత్తమంగా 41,762 మీటర్ల అన్వేషణ సాగించింది, గత 5 సంవత్సరాల సగటు కంటే ఇది 2.7 రెట్లు ఎక్కువ. ఇది, ప్రస్తుతం ఉన్న గనుల నుంచి మెరుగైన ఉత్పత్తిని సాధించడం మాత్రమే కాకుండా, దేశంలో కొత్త మాంగనీస్ గనుల ప్రారంభానికి పునాదిగా కూడా పనిచేస్తుంది.

ఎఫ్‌వై23లో, కంపెనీ పన్నుకు ముందు లాభం (పీబీటీ), పన్ను తర్వాతి లాభం (ప్యాట్‌) వరుసగా రూ.334.45 కోట్లు, రూ.250.59 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆర్థిక సంవత్సరానికి వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.3.69 (ఒక్కో షేరుకు రూ. 3.00 మధ్యంతర డివిడెండ్‌ సహా) ప్రకటించింది.

గరిష్ట వృద్ధిని సాధించడానికి మొయిల్‌ కట్టుబడి ఉందని, దాని కోసం నిర్దిష్ట ప్రణాళికలను ఇప్పటికే రూపొందించామని మొయిల్‌ సీఎండీ శ్రీ అజిత్ కుమార్ సక్సేనా స్పష్టం చేశారు. ఎఫ్‌వై24లో రెండంకెల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంగా, ఇదే వేగాన్ని కొనసాగించగలమని సంస్థ యాజమాన్యం నమ్మకంగా ఉంది.

మొయిల్‌ గురించి: కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియంత్రణలో పని చేసే షెడ్యూల్-ఎ, మినీరత్న విభాగం కేటగిరీ-1 సీపీఎస్‌ఈ మొయిల్‌ లిమిటెడ్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 11 గనులను నిర్వహిస్తూ, 45% మార్కెట్ వాటాతో దేశంలోనే అత్యధికంగా మాంగనీస్‌ ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2030 నాటికి దాదాపు ఉత్పత్తిని రెట్టింపు చేసి 3 మిలియన్ టన్నులకు చేర్చాలన్న లక్ష్యంతో ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలతో పాటు గుజరాత్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లోనూ కొత్త వ్యాపార అవకాశాలను మొయిల్‌ అన్వేషిస్తోంది.

*****



(Release ID: 1928285) Visitor Counter : 180