సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తొమ్మిదేళ్ల మోడీ ప్రభుత్వ పాలన యువత కేంద్రకంగా పనిచేస్తోంది ఎన్నో అవకాశాలు వారి తలుపు తడుతున్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్


2023 యువత ఇండియా@2047ను నిర్వచిస్తారు:డాక్టర్ జితేంద్ర సింగ్

మార్పుకు ఉత్ప్రేరకాలు యువత మరియు ఇండియా భవిష్యత్తును యువశక్తి నడిపిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు

నవ ప్రగతి, అభివృద్ధి దిశగా జమ్మూ & కాశ్మీర్ సాగుతోంది. శ్రీనగర్ లో జి 20 సమావేశం విజయవంతంగా పరిసమాప్తి కావడం ఇందుకు సాక్ష్యం: డాక్టర్ జితేంద్ర సింగ్

గత ప్రభుత్వాలు చేయని రీతిలో ప్రభుత్వం యువత వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని, సరైన దిశను ప్రభుత్వం సమకూరుస్తున్నది : డాక్టర్ జితేంద్ర సింగ్

ఆకర్షణీయ, లాభదాయక ఉపాధికి దోహదం చేసే ఇండియాలో వృద్ధి చెందుతున్న అంకుర పర్యావరణ వ్యవస్థ వంటి మార్గాలను/సాధనాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి భావనలో మార్పు రావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ప్రపంచంలో అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థలో ఇండియా మూడవ స్థానానికి చేరిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో భారత యువతకు మాత్రమే అది సాధ్యమైందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు

భారతీయ యువత ఆకాంక్షాపూరితులు, అయితే ఇప్పుడు ప్రధానమంత్రి సమకూర్చిన విధంగా సరైన జీవన వాతావరణం, ఆకాంక్షలు నెరవేరడానికి అనువైన పర్

Posted On: 27 MAY 2023 6:55PM by PIB Hyderabad

గత తొమ్మిదేళ్లలో ఏర్పడిన అంకుర మార్గాలు మన భావనలో మార్పులను కోరుతున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి  (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం,  సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణు శక్తి మరియు రోదసీ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శనివారం అన్నారు.  

నరేంద్ర మోడీ నేతృత్వంలో గత తొమ్మిదేళ్ల  ప్రభుత్వ పాలన యువత కేంద్రకంగా పనిచేస్తోందనే దానిలో ఎలాంటి అనుమానాలకు తావు లేదు. అయితే దేశ యువతకు అందుబాటులో ఉన్న వివిధ  అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి భావనలో మార్పు రావాలని కేంద్ర మంత్రి  అన్నారు.  
 
జమ్మూలోని కథువా వద్ద నెహ్రూ యువ కేంద్ర 2047లో ఇండియా అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన వై20 (యువ ఉత్సవ్)లో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.  

ఎన్నో అవకాశాలు దేశంలోని యువత  తలుపు తడుతున్నాయని భారీ స్థాయిలో యువత హాజరైన సమావేశంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  యువతకు వివిధ స్థాయిలలో సమాన అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం స్థిరచిత్తంతో అంకితమై పనిచేస్తోందని ఆయన అన్నారు.   నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేయడం అందుకు మంచి ఉదాహరణ అని,  ఈ దేశ యువత వృద్ధిచెందడానికి అడ్డుగా ఉన్న 2000కు పైగా నియమాలను తొలగించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో  ఇండియా ప్రపంచంలో అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థలో 100కు పైగా యూనికార్న్ సంస్థలతో  మూడవ స్థానానికి చేరిందని భారత యువతవల్ల మాత్రమే అది సాధ్యమైందని,  ఈ దేశ యువత ఆకాంక్షాపూరితులు, అభిలాషాపరులు అయినప్పటికినీ ఇప్పుడు ప్రధానమంత్రి సమకూర్చిన విధంగా  సరైన జీవన వాతావరణం, ఆకాంక్షలు నెరవేరడానికి అనువైన పర్యావరణ వ్యవస్థ  గతంలో వారికి అందుబాటులో లేవని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ఆరోమా మిషన్ అంకుర సంస్థలను ఆకర్షిస్తోందని, ఇప్పటివరకు వేలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని,  జమ్మూ & కాశ్మీర్ ఊదా విప్లవం ఆకర్షణీయమై  అంకుర సంస్థల ఏర్పాటును రాష్ట్ర యువతకు  మంచి అవకాశాలను ఏర్పరుస్తోందని మంత్రి అన్నారు.  

దేశ యువత మార్పుకు  ఉత్ప్రేరకాలు  మరియు ఇండియా భవిష్యత్తును యువశక్తి నడిపించగలదని, ఎందుకంటే దేశ జనాభాలో ఎక్కువ మంది యువత ఉన్నందువల్ల ఇండియా యవ్వన తేజంతో తొణికిసలాడుతున్న దేశం.  దాని బలం యువశక్తిలో ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ధైర్యవంతమైన నాయకత్వం వల్ల ఇండియా ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని,  ప్రపంచంలోనే ఉన్నత నాయకుడుగా ప్రధాని  ఎదిగాడని,  సుస్థిరమైన ప్రభుత్వం మరియు పాలనవల్ల ఎలాంటి సవాలునైన ఎదుర్కొనే సామర్ధ్యం సమకూరిందని మంత్రి అన్నారు.

దేశంలో 2014కు ముందు 145 వైద్య కళాశాలలు ఉండేవని,  గడచిన తొమ్మిదేళ్లలో కొత్తగా మరో 265 ఏర్పాటయ్యాయని,  అదే విధంగా దేశంలో యూనివర్సిటీల సంఖ్య 725 ఉండగా,  ఇప్పుడు వాటి సంఖ్య 1025కు పెరిగిందని అన్నారు.  ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గత తొమ్మిదేళ్లలో ఏడు లక్షల కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం జరిగిందని,  ముద్ర రుణ పథకం కింద గత తొమ్మిదేళ్లలో రూ. 23 లక్షల కోట్ల ముద్ర రుణాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  

నవ ప్రగతి, అభివృద్ధి దిశగా జమ్మూ & కాశ్మీర్  సాగుతోంది.  శ్రీనగర్ లో జి 20 సమావేశం విజయవంతంగా పరిసమాప్తి కావడం ఇందుకు ప్రబల సాక్ష్యం, జమ్మూ & కాశ్మీర్ లో పరివర్తన తేవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ సింగ్ అన్నారు.



 

 <><><><><>


(Release ID: 1928045) Visitor Counter : 184