నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం


కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు టీమిండియాగా కలసి పనిచేసి వీక్షిత్ భారత్ @2047 దిశగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి: ప్రధాన మంత్రి

అమృత కాల లక్ష్యాన్ని నెరవేర్చటానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీతి ఆయోగ్ తో కలసి పనిచేసి దేశాన్ని ముందుకు నడపాలని కోరిన ప్రధాన మంత్రి

వైవిధ్యభరిత అభివృద్ధి అంశాలైన , ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, జల సంరక్షణ గురించి మాట్లాడిన ప్రధాన మంత్రి

విధానపరమైన అంశాలమీద సూచనలిచ్చిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు; కేంద్ర-రాష్ట్ర సహకారానికి సంబంధించిన అంశాల ప్రస్తావన

సమావేశానికి హాజరైన 19 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు

Posted On: 27 MAY 2023 7:33PM by PIB Hyderabad

ఈ రోజు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్  న్యూ కన్వెన్షన్ సెంటర్ లో  జరిగిన  నీతి  ఆయోగ్ 8 వ పాలకమండలి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.   19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు టీమిండియాగా కలసి పనిచేసి వీక్షిత్ భారత్ @2047 దిశగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలసిన అవసరముందని ప్రధాని నొక్కి చెప్పారు. జాతీయ అభివృద్ధి ఏజెండాతో  సమన్వయం సాధిస్తూ రాష్ట్రాలు కూడా వచ్చే 25 ఏళ్ళకు తమ ప్రణాళికలు రూపొందించుకోవటానికి నీతి ఆయోగ్ సహాయపడుతుందని ప్రధాని చెప్పారు. అమృత కాలంలో సాధించటానికి పెట్టుకున్న లక్ష్యాల సాధనలో నీతి ఆయోగ తో కలసి పనిచేలాని సూచించారు.

ఆకాంక్షా పూరిత జిల్లాలు, ఆకాంక్షా పూరిత సమితుల వంటి కార్యక్రమాలతో సహకార సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయటానికి నీతి ఆయోగ్  అనేక చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని గుర్తు చేశారు.   ఈ రెండు కార్యక్రమాలూ కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేయటం వలన కలిగే ప్రయోజనాలకు అద్దం పడతాయన్నారు. సమాచార ఆధారిత పాలన ద్వారా క్షేత్ర స్థాయిలో సామాన్య  ప్రజలకు మేలు చేయటానికి వీలవుతుందన్నారు.

అమతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం పాటిస్తున్న ప్రస్తుత సమయంలో రాష్ట్రాలు, కేంద్రం శ్రీ అన్న ను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు.

రాష్ట్రాల స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. రాష్ట్రాలు చురుగ్గా గతిశక్తి పోర్టల్ వాడుకోవాలని కోరారు. అది కేవలం మౌలిక సదుపాయాలు, రవాణాకు మాత్రమే పరిమితం కాదని, స్థానిక ప్రాంత అభివృద్ధికిమ్ సామాజిక మౌలిక వసతుల సృష్టికి పనికొస్తుందన్నారు.  

దేశంలో జరుగుతున్న జి 20 సమావేశాల గురించి చెబుతూ, జి 20 అంతర్జాతీయంగా భారత్ దేశానికి ఎంతో ప్రతిష్ఠ తెచ్చిపెట్టగా, రాష్ట్రాలు అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళ్ళటానికి కూడా  ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.

అంతర్జాతీయ అవసరాలకు తగినట్టుగా ప్రజలకు నైపుణ్యాలు అందించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ఎంఎస్ ఎంఈలకు అండగా ఉండటం, దేశ పర్యాటకరంగ సామర్థ్యాన్ని పెంచటం, పాటించాల్సిన నియమ నిబంధనలు సరళతరం చేయటం,  వ్యాపార సంబంధమైన చిన్న చిన్న  నేరాల విషయంలో తీవ్రమైన శిక్షలు తగ్గించటం, ఏక్తా మాల్స్ అందుబాటులోకి తీసుకురావటం వంటి విషయాలు ప్రధాని ప్రస్తావించారు.  నారీశక్తి గురించి మాట్లాడుతూ, మహిళల సారధ్యంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. 2025 నాటికి క్షయ వ్యాధిని సంపూర్ణంగా  రూపుమాపుతామన్నారు.

ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు విధాన సంబంధమైన సూచనలిచ్చారు. కేంద్ర-రాష్ట్ర సహకారానికి సంబంధించిన కొన్ని నిర్దిష్టమైన అంశాలను వారు ప్రస్తావించారు. వాటిలో హరిత వ్యూహాలు, జోన్ వారీ ప్రణాళికా, పర్యాటకం, వ్యవసాయం, రవాణా తదితర అంశాలునానాయి.  

సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు, అనుభవాలు తెలియజేసిన  ముఖ్యమంత్రులకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రాలు ప్రస్తావించిన సమస్యలను, సవాళ్లను, ఉత్తమ ఆచరణ విధానాలను  నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు..

 

****


(Release ID: 1927804) Visitor Counter : 408