గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రపంచ బ్యాంక్ బృందంతో రివార్డ్ ప్రోగ్రామ్‌ అమలు తీరును సమీక్షించిన భూ వనరుల శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ

Posted On: 27 MAY 2023 12:42PM by PIB Hyderabad

ప్రపంచ బ్యాంకు సహకారంతో సుస్థిర వ్యవసాయం కోసం వినూత్న విధానాలతో  నది పరీవాహక ప్రాంతాల  పునరుద్ధరణ కోసం  అమలు జరుగుతున్న కార్యక్రమం ( రివార్డ్) అమలు తీరును కేంద్ర భూ వనరుల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ టిర్కీ  సమీక్షించారు.

నదీ పరీవాహక ప్రాంతాల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంకు సహకారంతో  రివార్డ్ కార్యక్రమం అమలు జరుగుతోంది.  2021లో ప్రారంభమైన కార్యక్రమం 2026 వరకు అమలు జరుగుతుంది. “రైతులకు స్థైర్యాన్ని కల్పించి గుర్తించిన నది పరీవాహక ప్రాంతాలలో రాష్ట్రాల సహకారంతో జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థల సామర్ధ్యాన్ని పెంపొందించడానికి రివార్డ్ కార్యక్రమం అమలు జరుగుతోంది. . గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని భూ వనరుల శాఖ, కర్ణాటక మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఆధునిక వాటర్‌షెడ్ పద్ధతులను అమలు చేయడం లక్ష్యంగా  ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది.  4.5 సంవత్సరాల పాటు అమలు జరిగే కార్యక్రమం కోసం $ 167.71 మిలియన్లు ఖర్చు చేస్తారు. మొత్తం వ్యయంలో  ప్రపంచ బ్యాంక్ $ 115 మిలియన్లు [కర్ణాటక ($ 60 మిలియన్లు), ఒడిశా ($49 మిలియన్లు), కేంద్ర భూ వనరుల శాఖ   (USD 6 మిలియన్లు)] , రెండు భాగస్వామ్య రాష్ట్రాలు కర్ణాటక ($ 25.71 మిలియన్ ), ఒడిశా ($ 21.0 మిలియన్లు) సమకూర్చాయి. నిధుల నిష్పత్తి   ప్రపంచ బ్యాంకు, రాష్ట్రాల మధ్య 70:30, ప్రపంచ బ్యాంకు,కేంద్ర భూ వనరుల శాఖ మధ్య 50:50 గా ఉంటుంది. 

కేంద్ర స్థాయిలో  కేంద్ర భూ వనరుల శాఖ కార్యక్రమం అమలు,పర్యవేక్షణ, సమాచారం, నైపుణ్య అభివృద్ధి బాధ్యతలు నిర్వర్తిస్తుంది.WDC-PMKSY 2.0కి అనుబంధంగా రివార్డ్ కార్యక్రమం అమలు జరుగుతుంది.  భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో WDC-PMKSY 2.0 ని అమలు చేయడానికి అవసరమైన శాస్త్రీయ  కార్యకలాపాలు, ప్రదర్శనల అమలుకు అవసరమైన సహకారం అందిస్తుంది. 

రివార్డ్ కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును సమీక్షించడానికి, వచ్చే ఆరు నెలల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాలను చర్చించడానికి శ్రీమతి ప్రీతి కుమార్  నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు బృందం కేంద్ర భూ వనరుల శాఖ ను, కార్యక్రమం అమలు జరుగుతున్న రాష్ట్రాలను సందర్శించింది. పర్యటన అనంతరం కార్యక్రమం అమలు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. లక్ష్యాల మేరకు కార్యక్రమం అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్న కేంద్ర భూ వనరుల శాఖ అధికారులను అభినందించిన ప్రపంచ బ్యాంకు బృదం, లక్ష్యాల మేరకు కార్యక్రమం పూర్తిగా అమలు జరిగేలా సహకరించాలని కోరింది.  

రివార్డ్ కార్యక్రమం  కింద బెంగళూరులో ఏర్పాటు చేసిన వాటర్‌షెడ్ కాంపోనెంట్‌పై సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను బలోపేతం చేయడం, సైన్స్ ఆధారిత వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్‌పై జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించడం, ల్యాండ్ రిసోర్స్ ఇన్వెంటరీ (ఎల్‌ఆర్‌ఐ) విస్తరణకు సంబంధించిన ప్రోటోకాల్‌ల అభివృద్ధి చేయడం లాంటి అంశాలపై కేంద్ర భూ వనరుల శాఖ కార్యదర్శితో బృందం సభ్యులు చర్చించారు.   

 కేంద్ర భూ వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి (WM) శ్రీ నితిన్ ఖాడే, సీనియర్ అదనపు కమీషనర్, డాక్టర్ సి.పి. రెడ్డి,  ప్రపంచ బ్యాంకు  సభ్యులు, రివార్డ్ కార్యక్రమం నిపుణులు, కేంద్ర భూ వనరుల శాఖ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

***



(Release ID: 1927802) Visitor Counter : 164