రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల సీఈఓలు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


ప్రపంచ చిత్ర పటంలో స్థానం సాధించడానికి పోటీతత్వాన్ని పెంపొందించుకుని వృద్ధి సాధించడానికి కృషి చేయాలి. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

' ప్రపంచ ఫార్మసీ' గా కొనసాగడానికి ' పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ అందుబాటులో ఉండే విధంగా నాణ్యతతో ఉత్పత్తి సాగించాలి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 27 MAY 2023 1:20PM by PIB Hyderabad

ఫార్మా, వైద్య పరికరాలపై  ఢిల్లీలో  జరుగుతున్న 8వ అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఈరోజు కేంద్ర రసాయనాలు,ఎరువులు,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ    ప్రముఖ  ఫార్మాస్యూటికల్ సంస్థల  సీఈఓలు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో  ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి శ్రీమతి ఎస్ అపర్ణ పాల్గొన్నారు.

ఫార్మాస్యూటికల్స్ రంగం సాధించిన అభివృద్ధి పట్ల డాక్టర్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. 

 “పరిశ్రమ వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. అభివృద్ధి వేగాన్ని కొనసాగించి ' ప్రపంచ ఫార్మా' గా సాధించిన స్థానాన్ని  నిలబెట్టుకోవడానికి, పరిశోధనపై ఎక్కువ దృష్టి పెట్టి నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి సాగించే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణపై దృష్టి సారించాలి" అని డాక్టర్ మాండవీయ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఉపయోగించుకుని అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని పరిశ్రమ వర్గాలకు సూచించిన డాక్టర్ మాండవీయ  "ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పధకం, కొత్తగా ఏర్పాటవుతున్న డ్రగ్ పార్కులు అభివృద్ధి సాధించడానికి సహకరిస్తాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి." అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. వృద్ధి రేటు కొనసాగించడానికి , ప్రపంచంలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి  కొంత పోటీతత్వాన్ని అలవరచు కోవాలని సూచించారు. .

ఫార్మా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు. " పరిశ్రమకు ప్రయోజనం కలిగించే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. దేశాభివృద్ధిలో ప్రభుత్వం, పరిశ్రమ కీలకంగా ఉంటాయి. సమగ్ర సంపూర్ణ అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సి ఉంటుంది." అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

ఫార్మా రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేసిన డాక్టర్ మాండవీయ  ధర, నియంత్రణ, విధానం మరియు వ్యూహం వంటి అంశాలకు సంబంధించిన  సూచనలను అందించాలని కోరారు. సూచనలు, సలహాలను పరిశీలించి అభివృద్ధి సాధనకు అవసరమైన విధానాన్ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు.  

భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉన్నాయని  ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్. అపర్ణ,అన్నారు. అభివృద్ధి సాధించడానికి అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. 

 రౌండ్‌టేబుల్‌లో సమావేశానికి 60 ఫార్మా సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు హాజరయ్యారు.  జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఫార్మాస్యూటికల్స్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ ఎన్ యువరాజ్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ ఆర్ధిక సలహాదారు  శ్రీ అవధేష్ కుమార్ చౌదరి, శ్రీమతి. వినోద్ కొత్వాల్ , నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, డాక్టర్ రాజీవ్ రఘువంశీ, ఎన్ పీపీ ఏ  చైర్మన్  శ్రీ కమలేష్ పంత్, వివిధ పరిశ్రమలలు, వాటాదారులు  విద్యాసంస్థలు ,సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

ఫార్మా మరియు వైద్య పరికరాల రంగంపై అంతర్జాతీయ సమావేశం గురించి:

ఫార్మా మరియు వైద్య పరికరాల రంగం వార్షిక సమావేశం రెండు రోజుల పాటు జరుగుతుంది. 2023 మే 26న వైద్య పరికరాల రంగం కోసం  "సస్టైనబుల్ మెడ్‌టెక్ 5.0: స్కేలింగ్ అండ్ ఇన్నోవేటింగ్ ఇండియన్ మెడ్‌టెక్" అనే అంశంపై జరిగింది.  మే 27న ఫార్మాస్యూటికల్ సెక్టార్ కోసం " ఆవిష్కరణ ద్వారా విలువ అందిస్తున్న ఇండియన్ ఫార్మా" అనే అంశంపై సమావేశం జరిగింది.  

 

****


(Release ID: 1927800) Visitor Counter : 157