సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జీ20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం ముగింపు, మే 25-27, రిషికేశ్ (తెహ్రీ), ఉత్తరాఖండ్

Posted On: 27 MAY 2023 2:25PM by PIB Hyderabad

మే 25న కేంద్ర రక్షణ & పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ప్రారంభించిన జీ20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం ఈరోజు రిషికేశ్ (తెహ్రీ)లో ముగిసింది.

ఈ సమావేశానికి 20 సభ్య దేశాలు, 10 ఆహ్వానిత దేశాలు మరియు యుఎన్‌ఓడిసి,ఓఈసిడి,ఈజీమోన్ట్ గ్రూప్, ఇంటర్‌పోల్ మరియు ఐఎంఎఫ్‌లతో సహా 9 అంతర్జాతీయ సంస్థల నుండి 90 మంది ప్రతినిధులు విస్తృతంగా పాల్గొన్నారు. దీనికి డిఓపిటి & చైర్, జీ20 ఎసిడబ్ల్యుజి అడిషనల్ సెక్రటరీ శ్రీ రాహుల్ సింగ్ అధ్యక్షత వహించారు. ఇటలీలోని జి20 ఎసిడబ్ల్యుజి కో-ఛైర్ అయిన మిస్టర్ జియోవన్నీ టార్టాగ్లియా పోల్సిని, టాస్క్ ఫోర్స్ హెడ్ మరియు ఇటలీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అంతర్జాతీయ సహకారం మిస్టర్ ఫాబ్రిజియో మార్సెల్లి, మినిస్టర్ ప్లీనిపోటెన్షియరీ సహ అధ్యక్షత వహించారు.

గత మూడు రోజులుగా ఆస్తుల స్వాధీనం, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు, సమాచార భాగస్వామ్యం కోసం అధికారిక మరియు అనధికారిక సహకార మార్గాలు, అవినీతిని ఎదుర్కోవడానికి సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌లు మరియు పరస్పర న్యాయ సహాయం మొదలైన వాటికి సంబంధించిన అనేక కీలక అంశాలపై కీలకమైన మరియు ఉత్పాదక చర్చలు జరిగాయి.'అవినీతిని నిరోధించడానికి మరియు ఎదుర్కోవడానికి బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థలు మరియు అధికారాల సమగ్రతను మరియు ప్రభావాన్ని ప్రోత్సహించడం'పై మూడు ఉన్నత స్థాయి సూత్రాలపై ప్రతినిధులు అంగీకరించారు; అవి ‘అవినీతిని ఎదుర్కోవడానికి చట్ట అమలుకు సంబంధించిన అంతర్జాతీయ సహకారం మరియు 'సమాచార భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం’ మరియు ‘అవినీతికి సంబంధించిన ఆస్తుల రికవరీ మెకానిజమ్‌లను బలోపేతం చేయడం’ మొదలైనవి.

ఏసిడబ్ల్యూజి మొదటి రోజు 'జెండర్ మరియు అవినీతి'పై ఒక ప్రత్యేకమైన సైడ్ ఈవెంట్ జరిగింది. గౌరవనీయులైన విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీమతి. మీనాక్షి లేఖి ఇందులో కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు మరియు అభ్యాసకులు అవినీతికి సంబంధించిన లింగపరమైన అంశాలు, అవినీతి నిరోధక కార్యక్రమాలతో మహిళా సాధికారత అంతర్గతంగా ముడిపడి ఉన్న మార్గాలు మరియు లింగ సున్నిత పాలన మరియు విధాన రూపకల్పన యొక్క ఆవశ్యకతపై చర్చించారు.

ప్రతినిధులు రిషికేశ్‌లో ఉన్న సమయంలో భారతదేశ గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు వంటకాల రుచిని ఆస్వాదించారు. ఆగస్టు 9 నుండి 11 వరకు కోల్‌కతాలో జరిగే మూడవ ఏసిడబ్ల్యూజీ సమావేశానికి  మళ్లీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటాన్ని ఉధృతం చేసే జీ20 ఎజెండాకు మరింత ఊతమిచ్చేందుకు భారతదేశం తొలిసారిగా వ్యక్తిగతంగా అవినీతి నిరోధక మంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహించనుంది.


 

******



(Release ID: 1927799) Visitor Counter : 174