భారత పోటీ ప్రోత్సాహక సంఘం
మల్టిపుల్స్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ III మరియు సిపిపి ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ ప్రైవేట్ హోల్డింగ్స్ (4) సంస్థ ద్వారా అకో టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అదనపు సిరీస్ ఈ నిర్బంధంగా కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ వాటిక కొనుగోలును ఆమోదించిన సీఐఐ
Posted On:
26 MAY 2023 11:22AM by PIB Hyderabad
మల్టిపుల్స్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ III మరియు సిపిపి ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ ప్రైవేట్ హోల్డింగ్స్ (4) సంస్థ ద్వారా అకో టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన అదనపు సిరీస్ ఈ నిర్బంధంగా కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ వాటిక కొనుగోలును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీఐఐ) ఆమోదం తెలిపింది.
అకో టెక్నాలజీ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎకో /టార్గెట్)కు చెందిన ప్రిఫరెన్స్ వాటాలను, అదనపు సిరీస్ E కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్‌లను (CCPS) మల్టిపుల్స్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ III (మల్టిపుల్స్ ఫండ్ III) సీపిపి ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (4) ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కొనుగోలు చేయడానికి ప్రతిపాదన వచ్చింది.
మల్టిపుల్స్ ఫండ్ III: మల్టిపుల్స్ ఫండ్ III అనేది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో నమోదు అయిన కేటగిరీ II ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంస్థగా నమోదు అయ్యింది. సంస్థను మల్టిపుల్స్ గ్రూప్‌కి చెందిన మల్టీపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. మల్టిపుల్స్ గ్రూప్ స్వయంగా లేదా . అనుబంధ సంస్థల ద్వారా భారతదేశంలో.ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఫిల్మ్ ఎగ్జిబిషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ మొదలైన రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
సీపీహెచ్ఐ -4: సీపీహెచ్ఐ -4 అనేది కెనడా దేశానికి చెందిన కార్పొరేషన్. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPPIB) పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా సీపీహెచ్ఐ -4 పనిచేస్తున్నది. సీపీపిఐబీ గ్రూప్ దాని అనుబంధ సంస్థల ద్వారా, పబ్లిక్ ఈక్విటీలు, ప్రైవేట్ ఈక్విటీలు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, స్థిర ఆదాయ సాధనాలు మొదలైన అనేక రంగాలలో పెట్టుబడి పెడుతుంది.
ఎకో : ఎకో అనేది ప్రాథమికంగా సాంకేతికత, అవుట్‌సోర్స్ సేవలను అందించడం, సాంకేతిక ఉత్పత్తుల అభివృద్ధి, అమలు కోసం డేటా ప్రాసెసింగ్ కంప్యూటర్ సెంటర్‌లను స్థాపించడం, అమలు చేయడం ,నిర్వహించడం,సమాచారం ద్వారా ప్రారంభమైన డేటా కమ్యూనికేషన్ సిస్టమ్‌ల ప్రక్రియ వంటి రబీగలాలో కార్యక్రలాపాలు సాగిస్తోంది. దీనితో పాటు టార్గెట్ సంస్థ క్రింది సేవలను అందిస్తుంది (ఎ) మొబైల్ ఫోన్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కోసం నష్ట నివారణ సీసేవలు అందించడం (బి) 'అకో డ్రైవ్' ద్వారా కొత్త మరియు ఉపయోగించిన వాహనాల అమ్మకం, కొనుగోలు సులభతరం చేయడం, టార్గెట్ (దాని అనుబంధ సంస్థల ద్వారా) భారతదేశంలో సాధారణ బీమా (నాన్-లైఫ్) సేవలను అందించే వ్యాపారంలో కూడా నిమగ్నమై ఉంది.
సీఐఐ వివరణాత్మక ఉత్తర్వులు వెలువడతాయి.
****
(Release ID: 1927618)
Visitor Counter : 151