మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎంఆర్‌బిపి)కి నామినేష‌న్ల‌ను ఆహ్వానిస్తున్న మ‌హిళా& శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌


నామినేష‌న్ల‌ను ఆన్‌లైన్ ప‌ద్ద‌తిలో https://awards.gov.in. పోర్ట‌ల్ ద్వారా మాత్ర‌మే 31.07.2023 వ‌ర‌కు దాఖ‌లు చేసేందుకు అనుమ‌తి

Posted On: 25 MAY 2023 1:20PM by PIB Hyderabad

సాహ‌సం, క్రీడ‌లు, సామాజిక సేవ‌, శాస్త్ర సాంకేతిక‌త‌, ప‌ర్యావ‌ర‌ణం, క‌ళ‌లు & సంస్కృతి, ఆవిష్క‌ర‌ణ‌ రంగాల‌లో అసాధార‌ణ సామ‌ర్ధ్యాలు క‌లిగి విశిష్ట గుర్తింపును తెచ్చుకుని,  జాతీయ స్థాయిలో కూడా గుర్తింపుకు అర్హులైన‌  బాల‌బాలిక‌ల‌కు త‌గిన గుర్తింపునిచ్చేందుకు  భార‌త మ‌హిళా& శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్ర‌తి ఏడాదీ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ (పిఎంఆర్‌బిపి)ని నిర్వ‌హిస్తుంది. 
ఈ అవార్డుల‌ను గౌర‌వ‌నీయ భార‌త రాష్ట్ర‌ప‌తి న్యూఢిల్లీలో ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో నిర్వ‌హించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో అందిచేస్తారు. ఈ అవార్డుల‌తో పాటుగా రూ. 1,00,000/- న‌గ‌దు బ‌హుమ‌తి, ప‌త‌కం, స‌ర్టిఫికెట్ త‌దిత‌రాల‌ను ఇస్తారు. 
భారతీయ పౌరులై ఉండి, భార‌త‌దేశంలో నివ‌సిస్తున్న 18 ఏళ్ళు నిండ‌ని (ద‌ర‌ఖాస్తు/  నామినేష‌న్ అందుకున్న చివ‌రి తేదీనాటికి) బాల‌బాలిక‌లు ఈ అవార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పిఎంఆర్‌బిపికి ద‌ర‌ఖాస్తుల‌ను ఇందుకోసం రూపొందించిన ఆన్‌లైన్ పోర్ట‌ల్ https://awards.gov.in  ద్వారా మాత్ర‌మే అందుకుంటారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులను స‌మ‌ర్పించేందుకు ఆఖ‌రు తేదీ 31.07.2023. 
నామినేష‌న్ల‌ను ఆన్‌లైన్ ప‌ద్ద‌తిలో https://awards.gov.in. పోర్ట‌ల్ ద్వారా మాత్ర‌మే 31.07.2023 వ‌ర‌కు దాఖ‌లు చేసేందుకు అనుమ‌తిస్తారు. 
మ‌రిన్ని మార్గ‌ద‌ర్శ‌కాల గురించి https://wcd.nic.in/sites/default/files/PMRBP%20Guidelines.pdf అన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చు.

***


(Release ID: 1927406) Visitor Counter : 182