కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వేగవంతమైన 5జీ సేవలు ప్రారంభం
గంగోత్రిలో 2,00,000వ 5జీ సైట్ ప్రారంభం
8 నెలల్లో 700 జిల్లాల పరిధిలో 2,00,000 సైట్ల ఏర్పాటు
దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన 5జీ నెట్ వర్క్
ఫైబర్ సౌకర్యంతో చార్ ధామ్ అనుసంధానం
చార్ ధామ్ ని సందర్శించే వారికి అంతరాయం లేని అధిక ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ సేవలు
చార్ధామ్ (బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి) లకు 5G మొబైల్ సౌకర్యం, ఫైబర్ సేవలు
భారత 4జీ/5జీ టెక్నాలజీ వ్యవస్థపై ఆసక్తి కనబరిచిన అమెరికా
Posted On:
24 MAY 2023 10:27PM by PIB Hyderabad
"21 వ శతాబ్దపు అభివృద్ధి చెందిన భారత దేశానికి రెండు ప్రధాన వ్యవస్థలు అవసరం. మొదటి వ్యవస్థ ఘనమైన మన వారసత్వం. రెండవది, అభివృద్ధి కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయడం. ఉత్తరాఖండ్ ఈ రెండు వ్యవస్థలను బలోపేతం చేస్తుంది"" ఇవి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని మ న లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.
అభివృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేసేందుకు సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజు ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామితో కలిసి కేంద్ర కమ్యూనికేషన్స్ , రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో గంగోత్రి వద్ద 2,00,000 వ 5జీ సైట్ ను, చార్ ధామ్ లో ఫైబర్ కనెక్టివిటీని జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు వ్యక్తిగతంగా, వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
దేశంలో 2022 అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రారంభించిన 8 నెలల్లోనే 700 జిల్లాలలో 2,00,000 సైట్లను ఏర్పాటు చేశారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5జీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ప్రారంభమైన 5జీ ఆవిష్కరణలో ఇది ఒకటి.
చార్ధామ్ (బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి)లకు ఇప్పుడు 5జి మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. చార్ధామ్ యాత్ర మార్గంలో ఏర్పాటు చేసిన టవర్లను కూడా ఇప్పుడు 5జి కి అనుసంధానం చేశారు.
అత్యంత వేగంగా అధిక బ్యాండ్ విడ్త్ తో పనిచేసే ఫైబర్ సౌకర్యం ఈ ప్రదేశాలను సందర్శించే యాత్రికులకు అంతరాయం లేని అధిక ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ సౌకర్యం అందిస్తుంది. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేసిన ఈ చర్య వల్ల ప్రజలకు జీవన సౌలభ్యం కలుగుతుంది. దేవాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలు, యాత్ర జరిగే మార్గంలో వాయిస్, వీడియో కాల్ నాణ్యత ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సేవలకు ఎటువంటి అంతరాయం కలగదు. ఘంగారియా నుంచి హేమకుండ్ సాహిబ్ వరకు సాగే నడక మార్గంలో (6 కిలోమీటర్లు) కూడా మొబైల్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత టెలికాం రంగం ప్రగతి పథంలో నడుస్తున్నదని అన్నారు.
నిమిషానికి ఒక సైట్ ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీ సౌకర్యం అందుబాటులోకి తెచ్చిన దేశంగా భారతదేశం గుర్తింపు పొందిందన్నారు. . గంగోత్రి, చార్ ధామ్ లో 2,00,000వ 5జీ సైట్ ను ప్రారంభించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 6జీ టెక్నాలజీ అభివృద్ధి లో అగ్రగామిగా ఉండాలన్న ప్రధానమంత్రి దార్శనికత కు అనుగుణంగా 6జీ టెక్నాలజీలో భారతదేశం 100కు పైగా పేటెంట్లు పొందిందని మంత్రి వివరించారు. ఇది దేశంలోని ప్రతిభావంతులైన ఇంజినీర్లు, ఆవిష్కర్తల శక్తి సామర్ధ్యాలను తెలియజేస్తుందని ఆయన అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు భారత 4జీ/5జీ టెక్నాలజీ పై ఆసక్తి చేస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్ లో టెలికాం సేవలు అత్యంత వేగంగా ఏర్పాటు చేయడానికి సహకారం అందించి, వేగంగా అనుమతులు మంజూరు చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో టెలికాం సేవలు ప్రారంభించడానికి సహకరించిన సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి కృతజ్ఞతలు తెలిపారు. చార్ధామ్ లో కల్పించిన సౌకర్యాల వల్ల యాత్రకు వచ్చిన వారు వారి బంధువులు, ప్రపంచంతో సంబంధాలు కలిగి ఉంటారని ఆయన అన్నారు. సంచార్ క్రాంతి పథకంలో భాగంగా మారుమూల గ్రామాలకు కూడా టెలికాం సేవలు అందిస్తున్నామన్నారు. 21వ శతాబ్దంలోని మూడవ దశాబ్దం ఉత్తరాఖండ్ దశాబ్దంగా ఉంటుందని ప్రధాన మంత్రి చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. టెక్నాలజీలో భారత్ ముందంజలో ఉందన్నారు. విపత్తుల నిర్వహణ, రియల్ టైమ్ ప్రాతిపదికన నిఘాకు కూడా పర్వతాల్లో హైస్పీడ్ నెట్ వర్క్ దోహదపడుతుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం భారత్ లోనే జరుగుతున్నాయన్నారు. 5జీ లో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పుతోందని, మొబైల్ తయారీలో భారత్ అగ్రగామిగా నిలిచిందన్నారు.
డివైజ్, డిజిటల్ కనెక్టివిటీ, డేటా రేట్, డిజిటల్ ఫస్ట్ వంటి కీలక అంశాలపై ఆయన ప్రసంగించారు. అంత్యోదయ లక్ష్యాన్ని సాధించడానికి చివరి స్థాయి వరకు ప్రయోజనం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి వ్యక్తికి ప్రపంచ స్థాయి టెలికాం సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
ఉత్తరాఖండ్ లో టెలికాంసౌకర్యం కల్పించడానికి చేపట్టిన వివిధ కార్యక్రమాలు
కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన కమ్యూనికేషన్ సేవల పరిధిని వేగంగా విస్తరించడానికి బహుళ కార్యక్రమాలు అమలు చేసి నూతన సాంకేతికత సేవలు ఏర్పాటు చేసింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోఅమలు జరుగుతున్న టెలికాం సేవలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
*గ్రామీణ జనాభాలో 92.5 శాతం మందికి 4జి మొబైల్ సిగ్నల్ (30.04.2023 నాటికి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1.4 కోట్ల మొబైల్ చందాదారులు,3.2 లక్షల వైర్ లైన్ చందాదారులు ఉన్నారు)
* 33,000 బిటిఎస్ కలిగిన 9,000 టవర్లు ఏర్పాటు అయ్యాయి.
* ఉత్తరాఖండ్ లోని పలు టవర్లను 5జీ కెపాసిటీకి అప్ గ్రేడ్ చేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ క్రింది ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయబడ్డాయి:
ఎ ). ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 354 యూఎస్ఓఎఫ్ పథకం కింద 56 టవర్లు ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. వీటిలో 41 సైట్లు పనిచేస్తున్నాయి. మిగిలిన సైట్లలో పనులు పురోగతిలో ఉన్నాయి.
* 4జీ సాచ్యురేషన్ పథకం పరిధిలో మొత్తం 1236 గ్రామాలను తీసుకురావాలని నిర్ణయించారు. 360 గ్రామీణ ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేస్తారు. పథకం పరిధిలోకి అదనంగా 382 గ్రామాలను తీసుకురావాలని ప్రతిపాదించారు. 77 చోట్ల ఉన్న టవర్లను 4జీ నెట్వర్క్ కు అప్ గ్రేడ్ చేస్తారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 4జీ మొబైల్ సేవలు అందించేందుకు సర్వే కొనసాగుతోంది.
* భారత్ నెట్ ప్రాజెక్టు: ప్రాజెక్టు ఫేజ్-1 లో భాగంగా మొత్తం 1849 గ్రామ పంచాయతీలను (బీహెచ్ క్యూ లతో కలిపి) అనుసంధానం చేయాలని నిర్ణయించారు. వీటిలో 1816 గ్రామాలు/గ్రామపంచాయతీలు ఇప్పటికే (22/05/2023 నాటికి) అనుసంధానం అయ్యాయి. మిగిలిన 33 జీపీలను 2023 జూన్ నాటికి అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
***
(Release ID: 1927149)
Visitor Counter : 214