యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ లో మంగళవారం నుంచి కబడ్డీ పోటీతో మొదలైన ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు, 2022
Posted On:
24 MAY 2023 1:00PM by PIB Hyderabad
అట్టహాసంగా మొదలైన పోటీల మొదటి రోజు ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు, 2022 ఉత్తరప్రదేశ్ (KIUG22UP) మంగళవారం గౌతం బుద్ధ నగర్ లోని ఎస్ వి ఎస్ పి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కబడ్డీ ఆటతో మొదలైంది.
ఖేలో ఇండియా KIUG22UP పోటీల అధికార ప్రారంభోత్సవం గురువారం జరుగుతుంది. ఈ పోటీలలో 200 యూనివర్సిటీలకు చెందిన 4000 మంది క్రీడాకారులు 21 ఆటలలో పోటీపడుతారు.
మొదటి రోజు కబడ్డీ పోటీకి ముందు చిన్న సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన పాఠశాలల విద్యార్థులు తమ అభినయం, నటనతో ఆహుతులను, క్రీడాకారులను ఆకట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ విజేత బబితా నాగర్, అంతర్జాతీయ కుస్తీ సహాయ మంత్రి శ్రీ బ్రిజేష్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రారంభోత్సవ కబడ్డీ పోటీకి హాజరైన ప్రముఖులలో గౌతం బుద్ధ నగర్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మహేశ్ శర్మ, రాజ్య సభ సభ్యుడు శ్రీ సురేంద్ర నాగర్, గౌతంబుద్ధ నగర్ జిల్లా పంచాయత్ చైర్మన్ శ్రీ అమిత్ చౌధరి , శాసనమండలి సభ్యుడు శ్రీ శ్రీచంద్ శర్మ , గౌతంబుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ మనీష్ కుమార్ వర్మ మరియు గౌతంబుద్ధ నగర్ పోలీసు కమిషనర్ శ్రీమతి లక్ష్మీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో పేరొందిన క్రీడాకారులు, పారా ఒలింపిక్స్ పతక విజేత శ్రీ వరుణ్ భాటి, మల్లయోధురాలు బబితా నాగర్, ఉత్తర ప్రదేశ్ యోద్ధాస్ కు చెందిన కబడ్డీ ఆటగాళ్లు శ్రీ ఆశిష్ నాగర్ & శ్రీ ఆశు సింగ్ పాల్గొన్నారు.
ఆసక్తికరంగా సాగిన నాలుగు కబడ్డీ పోటీలలో మహిళా విభాగంలో జరిగిన మొదటి పోటీలో జింద్ కు చెందిన చౌధరి రణబీర్ సింగ్ యూనివర్సిటీ జట్టు బిలాస్ పూర్ వాజపేయి యూనివర్సిటీ జట్టును 41-28 పాయింట్లతో ఓడించింది. బిలాస్ పూర్ జట్టులో సంజూ దేవి
అసాధారణ ప్రతిభ కనబరచినప్పటికినీ జట్టులోని ఇతర ఆటగాళ్లు ఆమెకు కలసిరాకపోవడంతో చివరి క్షణాల్లో మ్యాచ్ చేజారిపోయింది.
చివర మూడు నిమిషాల సమయం మిగిలి ఉన్నంత వరకు మ్యాచ్ పోటాపోటీగా సాగింది.
మహిళా విభాగంలోని రెండవ మ్యాచ్ లో షిమ్లాకు చెందిన హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ దుర్గ్ కు చెందిన హెచ్ సి వై యూనివర్సిటీని 51-29 పాయింట్లతో ఓడించింది. షిమ్లా యూనివర్సిటీ మొదటి నుంచి దూకుడుగా ఆడి ప్రథమార్ధంలో 29-11
పాయింట్ల ఆధిక్యత సాధించింది. ద్వితీయార్ధంలో కూడా అదే జోరు కొనసాగించి మరో 22 పాయింట్లను సంపాదించింది. పాయింట్ల తేడాను తగ్గించడానికి దుర్గ్ జట్టు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఓటమి చవిచూశారు.
పురుషుల విభాగంలో కోల్కతాకు చెందిన ఆడమాస్ యూనివర్సిటీ ఎంత ప్రయత్నించినప్పటికీ గురు కాశీ యూనివర్సిటీపై విజయం సాధించలేక పోయింది. ప్రథమార్ధం ముగిసే లోపలే ఆడమాస్ ఆటగాళ్లు ఇద్దరు గాయాలపాలయ్యారు. ఫలితంగా కోల్కతా జట్టు 29-35 పాయింట్లతో పరాజయాన్ని చవిచూసింది. సాయంత్రం జరిగిన మ్యాచ్ లో చెన్నైకి చెందిన ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ పై కోటా యూనివర్సిటీ 28-23 పాయింట్లతో గెలిచింది.
ఉత్తరప్రదేశ్ ఖేలో ఇండియా పోటీల రెండవ రోజున గౌతంబుద్ధ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్ బాల్ పోటీలు మొదలవుతాయి. గౌతంబుద్ధ నగర్ ఎస్ వి ఎస్ పి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రెండవ రోజు కబడ్డీ పోటీలు కొనసాగుతాయి. మరొకవైపు లక్నోలో మాల్ కాంబ్, వాలీ బాల్ , టేబుల్ టెన్నిస్, రగ్బీ, ఫుట్ బాల్ (బాలురు & బాలికలు) మరియు టెన్నిస్ పోటీలు జరుగుతాయి.
****
(Release ID: 1927066)
Visitor Counter : 159