గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

76వ ప్రపంచ ఆరోగ్య సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


వైద్య రంగంలో అమలు జరుగుతున్న చర్యలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే విధంగా సురక్షిత వైద్య సౌకర్యాలు ప్రపంచంలో అందరికీ అందుతాయి.. డాక్టర్ మాండవీయ

'' డిజిటల్ వైద్య సేవలు అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న చర్యల వల్ల తక్కువ, మధ్య ఆదాయం కలిగిన దేశాల్లో వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి"

Posted On: 24 MAY 2023 2:01PM by PIB Hyderabad

76వ ప్రపంచ ఆరోగ్య సర్వసభ్య సమావేశంలో  'అందరికీ ఆరోగ్యం' అనే అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్,వివిధ  దేశాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు  కార్యక్రమంలో పాల్గొన్నారు, 

ఆరోగ్య రంగానికి జీ -20, భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలు, డిజిటల్ ఆరోగ్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత అంశాలను తన ప్రసంగంలో డాక్టర్ మాండవీయ వివరించారు. 

“కోవిడ్ -19 మహమ్మారి రూపంలో ఎదురైన అసాధారణ  పరిస్థితులు ఆరోగ్య సంరక్షణ రంగంలో  పని చేయడానికి ప్రపంచ దేశాలు కలిసి ముందుకు సాగాయి. దీనివల్ల భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి అవకాశం ఏపడింది"  అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.  ప్రాంతీయ నెట్‌వర్క్‌ల ద్వారా పరిశోధన, అభివృద్ధి , తయారీ రంగాలను అనుసంధానం చేసి ప్రపంచ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ కోసం ఒక అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేయాలని  డాక్టర్ మాండవీయ సూచించారు.  " ప్రపంచ వ్యాప్తంగా అమలు జరిగే ఆరోగ్య వ్యవస్థ వల్ల అన్ని దేశాలకు   సురక్షితమైన, అధిక-నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య విధానాలు అందుబాటులోకి వస్తాయి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కృషి జరగాలి" అని ఆయన పేర్కొన్నారు.

ఆరోగ్య రంగంలో వ్యత్యాసాలను తగ్గించాల్సిన అవసరం ఉందని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు. "డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల  ప్రపంచానికి  ముఖ్యంగా తక్కువ మరియు మధ్య-ఆదాయం కలిగిన దేశాలకు  ప్రయోజనం కలుగుతుంది.  డిజిటల్ సాధనాల వినియోగంపై ఏకాభిప్రాయాన్ని సాధించాల్సి ఉంటుంది" అని డాక్టర్ మాండవీయ అన్నారు.  " డిజిటల్ ఆరోగ్య వ్యవస్థపై అంతర్జాతీయంగా సాగుతున్న ప్రయత్నాల ద్వారా ఒక  సంస్థాగత వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.  దీనివల్ల  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం,  అవసరాలకు సరిపోయే  డిజిటల్ పరిష్కారాలను అందించడం సాధ్యం అవుతుంది " అని ఆయన అన్నారు.  భారతదేశం అమలు చేస్తున్న'ని-క్షయ్' విధానాన్ని ప్రస్తావించిన   డాక్టర్ మాండవీయ దీని ద్వారా  ఆవిష్కరణ , పెట్టుబడికి ని-క్షయ్ ఒక నిదర్శనం అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.క్షయ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించడం, చికిత్స అందుతున్న తీరును పర్యవేక్షించడం, చికిత్స వల్ల కలుగుతున్న ప్రయోజనాలు తదితర అంశాలను డిజిటల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నామని డాక్టర్ మాండవీయ వివరించారు. 

ప్రశంసించారు. "అందరికీ ఆరోగ్యం" అనే అంశానికి  ప్రాధాన్యత ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థను డాక్టర్ మాండవీయ ప్రశంసించారు." భారతదేశం అధ్యక్షతన జీ-20 దేశాలు అమలు చేస్తున్న   'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే అంశంతో పాటు "అంత్యోదయ భావనకు అనుగుణంగా  "అందరికీ ఆరోగ్యం" కార్యక్రమం రూపొందింది" అని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంపై కోవిడ్-19 ప్రభావాన్నితన ప్రసంగంలో వివరించిన డాక్టర్ మాండవీయ  మహమ్మారి మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ప్రభావం చూపినప్పటికీ  'అందరికీ ఆరోగ్యం' అనే  నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి సహకరించిందని అన్నారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రసంగం  పూర్తి పాఠం:

ప్రజలందరికి ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో "అందరికీ ఆరోగ్యం" అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారతదేశం అభినందనలు తెలుపుతోంది. సమిష్టి ప్రయత్నాల వల్ల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా అమలు జరుగుతుంది. భారతదేశం అమలు చేస్తున్న “అంత్యోదయ” కార్యక్రమానికి అనుగుణంగా "అందరికీ ఆరోగ్యం" కార్యక్రమం రూపొందింది. అట్టడుగు స్థాయిలో ఉన్న వారిని చేరుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరగాలి. 

ఊహించని విధంగా ఏర్పడిన కోవిడ్-19 సంక్షోభం ప్రపంచం ఐకమత్యంతో కలిసి పనిచేయాలి అన్న భారతదేశం విధానానికి బలం చేకూర్చింది.  త ప్రపంచం యొక్క మా ఎజెండాను మరింత బలోపేతం చేసింది. భారతదేశం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే నినాదాన్ని జీ-20 అధ్యక్ష హోదాలో అమలు చేస్తుందని ప్రకటించారు. ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణ అందించడానికి, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి , డిజిటల్ ఆరోగ్య వ్యవస్థకు భారతదేశం ప్రాధాన్యత ఇస్తోంది.  క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి  క్రియాశీలక చర్యలు తీసుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  క్షయ వ్యాధి నివారణ కోసం  భారతదేశం  నమూనాలను అభివృద్ధి చేసింది. వాస్తవికమైన అంశాల ప్రాతిపదికపై రూపొందిన ప్రణాళిక అమలు జరుగుతోంది.  

ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం చర్యలు అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా అమలు చేస్తున్న  'ని-క్షయ్' విధానంలో వ్యాధి సోకిన వారికి చికిత్స అందించడం, చికిత్స అందుతున్న తీరును పర్యవేక్షించడం, చికిత్స వల్ల కలుగుతున్న ప్రయోజనాలు డిజిటల్ విధానంలో పర్యవేక్షణలో ఉన్నాయి.  

డిజిటల్ ఆరోగ్య వ్యవస్థపై అంతర్జాతీయంగా సాగుతున్న ప్రయత్నాల ద్వారా ఒక  సంస్థాగత వ్యవస్థ అభివృద్ధి చెందాలని భారతదేశం  భావిస్తోంది. దీనివల్ల  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం,  అవసరాలకు సరిపోయే  కోసం సరిపోయే డిజిటల్ పరిష్కారాలను అందించడం సాధ్యం అవుతుంది. 

దీనివల్ల  అన్ని దేశాలకు సురక్షితమైన, అధిక-నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ  ఒక సంస్థాగత వ్యవస్థగా పని చేస్తుంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ వల్ల  ప్రపంచానికి ముఖ్యంగా తక్కువ, మధ్య-ఆదాయ దేశాలకు   డిజిటల్ సాధనాలు అందుబాటులోకి వస్తాయి. దీనిపై ఏకాబ్రిప్రాయ సాధన కోసం భారతదేశం కృషి చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై  కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ లక్ష్య సాధన కోసం ప్రపంచ దేశాలు కలిగి ముందుకు సాగాలి.  అందరికీ ఆరోగ్యం అనేది ఒక గొప్ప ఆకాంక్ష మాత్రమే కాదు, కీలకమైన ఆవశ్యకత.

ప్రతిపాదనలను కార్యరూపం లోకి తీసుకు రావాలని  రేపటి కోసం సమాన ప్రపంచం వైపు కలిసి పని చేయాలని కోరుతున్నాను. . ధన్యవాదాలు!

 

డా. మాండవ్య ప్రసంగాన్ని  ఈ లింక్‌లలో చూడవచ్చు:

 

https://www.youtube.com/watch?v=gdjySw1_IAo

 

https://www.youtube.com/watch?v=52lYgc326eg

 

 

 

డాక్టర్ మాండవ్య ప్రసంగం కోసం ట్విట్టర్ లింక్‌లు

 

https://twitter.com/mansukhmandviya/status/1660995459945750529

 

https://twitter.com/mansukhmandviya/status/1661027076533813249

 

https://twitter.com/mansukhmandviya/status/1661034966736830467

 

***


(Release ID: 1926922) Visitor Counter : 257