ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్ఐఎన్ఎల్- వినియోగదారుల సమావేశం- 2023

Posted On: 23 MAY 2023 11:48AM by PIB Hyderabad

ఆర్ఐఎన్ఎల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాఖ ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో సోమవారం "కస్టమర్ మీట్" నిర్వహించింది. ఎగుమతి వినియోగదారులతో పాటు దేశం నలుమూలల నుండి దాదాపు 100 మంది వినియోగదారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆర్ఐఎన్ఎల్ అత్యధికంగా నియోగదారులను కలిగి ఉంది. భారతదేశ వ్యాప్తంగా 23 శాఖలతో అత్యాధిక  వినియోగదారులను కలిగి ఉంది.  ఈ సందర్భంగా ఆర్ఐఎన్ఎల్ సీఎండీ శ్రీ అతుల్ భట్ కస్టమర్‌లను ఉద్దేశించి మాట్లాడారు. సంస్థ తన  కస్టమర్‌లతో అందమైన సంబంధాన్ని కలిగి ఉందని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మేటి సంబంధం కేంద్రంగానే ఇరువురి ఒకదానితో ఒకటి ముడిపడి ముందుకు సాగుతోందని వివరించారు. ఇకపై కూడా కంపెనీ వృద్ధి బాటలో భాగస్వాములు కావాలని, ఆర్‌ఐఎన్‌ఎల్ మార్కెట్ వాటాను పెంచుకోవడంలో సహకరించాలని ఆయన కస్టమర్లను అభ్యర్థించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం "ముఖ్యమైన సంవత్సరం"గా ఉండబోతోందని, ప్లాంట్ ఆగస్ట్'23 నుండి ఉత్పత్తిని పెంచడానికి సిద్ధంగా ఉందని. మెరుగైన ఉత్పత్తి స్థాయిల నుండి కస్టమర్ల అవసరాలను పూర్తిగా తీర్చగలమని ఆయన హామీ ఇచ్చారు. సంస్థ  డైరెక్టర్ (కమర్షియల్) శ్రీ డి.కె. మొహంతి తన ప్రసంగంలో గ్లోబల్ & దేశీయ మార్కెట్ దృష్టాంతాన్ని వివరించారు. దీర్ఘకాలంలో తమ విలువైన కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్ ఎల్లప్పుడూ కృషి చేస్తుంటుందని ఆయన హామీ ఇచ్చారు. కస్టమర్లు చూపిన విధేయతను ఆయన మెచ్చుకున్నారు. ఆర్ఐఎన్ఎల్,మరియు దాని ఉత్పత్తులకు వారి నిరంతర ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. తరువాత, వినియోగదారులు ఆర్ఐఎన్ఎల్  సీనియర్ అధికారులతో  ముచ్చటించారు. ఇది ఫలవంతంగా ముందుకు సాగింది. ఇందులో వారు మార్కెటింగ్ యొక్క వివిధ సమస్యలకు సంబంధించిన ఆయ సమస్యలను పరిష్కరిస్తారని అధికారులు హామీ ఇచ్చారు. సమావేశం తర్వాత, కొంతమంది కస్టమర్లను ఆర్ఐఎన్ఎల్ అధికారులు యొక్క వివిధ ఉత్పత్తి యూనిట్లు & సెంట్రల్ డిస్పాచ్ యార్డ్ ఆఫ్ మార్కెటింగ్‌కి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు, సీనియర్‌ అధికారులు, స్టీల్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌, వివిధ కార్మిక సంఘాలు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

*****


(Release ID: 1926807) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Hindi , Punjabi