యు పి ఎస్ సి
ఈ రోజు విడుదల అయిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE), 2022 తుది ఫలితాలు
Posted On:
23 MAY 2023 2:32PM by PIB Hyderabad
2022 జూన్ 22న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష ఫలితాలు ఈరోజు (2023 మే 23) విడుదల అయ్యాయి. ముఖ్య అంశాలు కింది విధంగా ఉన్నాయి.
* 2022 జూన్ 22న పరీక్ష నిర్వహించారు. పరీక్షకు మొత్తం 11,35,697 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, వీరిలో 5,73,735 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
* 2022 సెప్టెంబర్ లో జరిగిన రాత (మెయిన్) పరీక్షకు 13,090 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
* మొత్తం 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హత సాధించారు.
* మొత్తం 933 మంది అభ్యర్థులను (613 మంది పురుషులు, 320 మంది మహిళలు) వివిధ సర్వీసులలో నియామకం కోసం కమిషన్ సిఫార్సు చేసింది.
* అర్హత సాధించిన అభ్యర్థుల్లో మొదటి నలుగురు మహిళా అభ్యర్థులే.
* ఇషితా కిషోర్ (రోల్ నెం. 5809986) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2022 లో మొదటి స్థానం సంపాదించారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఎంచుకుని పరీక్షలో అర్హత సాధించింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ లోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్ (ఆనర్స్)లో పట్టభద్రురాలు.
* గరిమా లోహియా (రోల్ నం. 1506175), ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరిమల్ కళాశాల నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేట్, కామర్స్, అకౌంటెన్సీని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఎంచుకుని రెండవ ర్యాంక్ సాధించారు.
* , హైదరాబాద్‌లోని ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ (బి టెక్.) అయిన ఉమా హారతి ఎన్ (రోల్ నెం.1019872) ఆంత్రోపాలజీ ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ర్యాంక్‌లో మూడవ స్థానంలో నిలిచింది.
* స్మృతి మిశ్రా (రోల్ నెం. 0858695), మిరాండా హౌస్ కళాశాల (ఢిల్లీ విశ్వవిద్యాలయం) లో డిగ్రీ పూర్తి చేసి (బి.ఎస్సీ) జువాలజీని ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా తీసుకుని నాల్గవ స్థానంలో నిలిచింది.
* మొదటి 25 మంది ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు.
* మొదటి 25 ర్యాంకులు సాధించిన వారు ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, సైన్స్,ఐఐటీ,ఎన్ఐటీ, గౌహతి మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్శిటీ, జివాజీ యూనివర్శిటీ మొదలైన దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి డిగ్రీ పూర్తి చేశారు.
* మొదటి 25 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు రాత (మెయిన్) పరీక్షలో తమ ఐచ్ఛిక అంశంగా ఆంత్రోపాలజీ, కామర్స్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లా, హిస్టరీ, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ మరియు జువాలజీ వంటి సబ్జెక్టులను ఎంచుకున్నారు.
* సిఫార్సు చేసిన అభ్యర్థులలో అంగ వైకల్యం ఉన్న 41 మంది (14 ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్, 07 విజువల్లీ ఛాలెంజ్డ్, 12 వినికిడి లోపం,08 బహుళ వైకల్యం) ఉన్నారు.
***
(Release ID: 1926658)
Visitor Counter : 317