ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాపువా న్యూ గినీ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం

Posted On: 22 MAY 2023 8:39AM by PIB Hyderabad

ఫొరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22 వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో పాపువా న్యూ గినీ (పిఎన్ జి) ప్రధాని శ్రీ జేమ్స్ మారాపే తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం లో పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన కు సాదరంగా స్వాగతం పలికినందుకు మరియు మూడో ఎఫ్ఐపిఐసి శిఖర సమ్మేళనాని కి సహ ఆతిథేయి గా వ్యవహరిస్తున్నందుకు ప్రధాని శ్రీ మారాపే కు ధన్యవాదాల ను తెలియ జేశారు. ఇద్దరు నేత లు వారి ద్వైపాక్షిక సంబంధాల ను అవలోకించారు. అంతేకాకుండా వ్యాపారం మరియు పెట్టుబడి, ఆరోగ్యం, సామర్థ్య నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి, ఇంకా ఇన్ ఫర్ మేశన్ టెక్ నాలజీ లు సహా, వివిధ రంగాల లో భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచుకోవడాని కి గల మార్గాలు మరియు ఉపాయాలపై చర్చించారు. జలవాయు సంబంధి కార్యాచరణ తో ముడిపడ్డ అంశాలు మరియు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను ప్రోత్సహించడానికి సంబంధించినటువంటి అంశాల పైన కూడా వారు చర్చించారు. పసిఫిక్ ప్రాంత దేశాల యొక్క ప్రాధాన్యాల ను మరియు ఆకాంక్షల కు భారతదేశం యొక్క సమర్థన ను, సమ్మానాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో మరో మారు వ్యక్తం చేశారు.

 

తమిళ భాష లో అతి ఉత్తమమైన గ్రంథం ‘తిరుక్కురల్’ ను పాపువా న్యూ గినీ కి చెందినటువంటి టోక్ పిసిన్ భాష లో అనువాదం చేసిన పుస్తకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు పావువా న్యూ గినీ ప్రధాని శ్రీ మారాపే లు ఆవిష్కరించారు. ఈ అనువాద గ్రంథాన్ని భాషా కోవిదురాలు శ్రీమతి సుభా శశీంద్రన్ మరియు పాపువా న్యూ గినీ లోని వెస్ట్ న్యూ బ్రిటెన్ ప్రాంత గవర్నరు శ్రీ శశీంద్రన్ ముత్తు వేల్ కలసి రచించారు. పుస్తకం లో ప్రధాన మంత్రి శ్రీ మారాపే ముందుమాట కూడా ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రచయితల కు అభినందనల ను తెలియజేశారు; పాపువా న్యూ గినీ లో భారతదేశం భావ ధార మరియు సంస్కృతి యొక్క సిద్ధాంతాల ను సంరక్షించడం లో తోడ్పాటు ను అందించినందుకు గాను వారిని ఆయన ప్రశంసించారు.

 

***


(Release ID: 1926287) Visitor Counter : 191