ప్రధాన మంత్రి కార్యాలయం
స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 76వ సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
Posted On:
21 MAY 2023 7:04PM by PIB Hyderabad
గౌరవనీయులు,ప్రముఖులు, ప్రతినిధులు, నమస్కారాలు!
జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 76వ సమావేశాలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతాభినందనలు. 75 ఏళ్ల పాటు ప్రపంచానికి సేవలందించిన చారిత్రాత్మక మైలురాయిని పూర్తి చేసినందుకు డబ్ల్యూహెచ్ ఒ ను అభినందిస్తున్నాను. 100 ఏళ్ల సర్వీసుకు చేరుకోబోయే వచ్చే 25 ఏళ్ల కాలానికి డబ్ల్యూహెచ్ లక్ష్యాలను నిర్దేశించుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
కోవిడ్-19 మహమ్మారి ఆరోగ్య సంరక్షణలో మరింత సహకారం అవసరాన్ని మనకు చూపించింది. ఈ మహమ్మారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలోని అనేక లోపాలను ఎత్తిచూపింది. ప్రపంచ వ్యవస్థల్లో స్థితిస్థాపకతను పెంపొందించడానికి సమిష్టి కృషి అవసరం.
మిత్రులారా,
ప్రపంచ ఆరోగ్య వాటా (ఈక్విటీ) ని పెంచాల్సిన అవసరాన్ని కూడా మహమ్మారి తెలియచేసింది. సంక్షోభ సమయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ తన నిబద్ధతను చాటుకుంది. దాదాపు 300 మిలియన్ వాక్సిన్ డోసులను 100 దేశాలకు పంపించాం.
వీటిలో చాలా దేశాలు గ్లోబల్ సౌత్ కు చెందినవి. రాబోయే సంవత్సరాల్లో వనరుల సమాన లభ్యతకు మద్దతు ఇవ్వడం డబ్ల్యూహెచ్ఓకు మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
మిత్రులారా,
అనారోగ్యం లేకపోవడం మంచి ఆరోగ్యంతో సమానం కాదని భారతదేశ సాంప్రదాయ విజ్ఞానం చెబుతుంది. అనారోగ్యం నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యం దిశగా మరో అడుగు ముందుకు వేయాలి. యోగా, ఆయుర్వేదం , ధ్యానం వంటి సాంప్రదాయ పద్ధతులు ఆరోగ్య సంబంధిత శారీరక, మానసిక ,సామాజిక అంశాలను పరిష్కరిస్తాయి.
డబ్ల్యూహెచ్ ఒ మొట్టమొదటి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను భారత్ లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ద్వారా చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించడం కూడా సంతోషంగా ఉంది.
మిత్రులారా,
ప్రపంచాన్ని ఒకే కుటుంబం - వసుధైక కుటుంబం - గా చూడాలని భారతదేశ ప్రాచీన గ్రంథాలు బోధిస్తాయి. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే నినాదంతో ఈ ఏడాది జీ20 సదస్సు సందర్భంగా పనిచేస్తున్నాం. మంచి ఆరోగ్యం కోసం మన విజన్ 'వన్ ఎర్త్ వన్ హెల్త్'. మన పర్యావరణ వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి, మన దృష్టి కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాదు. ఇది జంతువులు, మొక్కలు ,పర్యావరణంతో సహా మొత్తం పర్యావరణ వ్యవస్థకు విస్తరిస్తుంది.
మిత్రులారా,
గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ లభ్యత, ప్రాప్యత పై పనిచేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేదా ఆరోగ్య మౌలిక సదుపాయాలను భారీగా పెంచడం కావచ్చు, లేదా లక్షలాది కుటుంబాలకు పారిశుధ్యం మరియు తాగునీరు అందించే డ్రైవ్ కావచ్చు; చివరి మైలు వరకు ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మన అనేక ప్రయత్నాలు ఉన్నాయి. భారతదేశ వైవిధ్యం స్థాయితో పనిచేసే విధానం ఇతరులకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ కావచ్చు. అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో ఇలాంటి ప్రయత్నాలలోడబ్ల్యూహెచ్ ఒ కు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాం.
మిత్రులారా,
అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో 75 ఏళ్లుగా డబ్ల్యూహెచ్ ఒ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. డబ్ల్యూహెచ్ ఒ వంటి ప్రపంచ సంస్థల పాత్ర గతంలో చాలా ముఖ్యమైనది. కానీ సవాళ్లతో నిండిన భవిష్యత్తులో ఇది మరింత ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రతి ప్రయత్నానికి సహాయం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు!
*****
(Release ID: 1926279)
Visitor Counter : 186
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam