ప్రధాన మంత్రి కార్యాలయం
హిరోషిమాలో మహాత్మాగాంధీ బస్ట్ సైజు కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,
Posted On:
20 MAY 2023 8:12AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్లోని హిరోషిమాలో 2023 మే 20 వ తేదీన మహాత్మాగాంధీ ఛాతీ సైజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జపాన్ ప్రధానమంత్రి సలహాదారు, జపాన్ పార్లమెంటు సభ్యుడు హిజ్ ఎక్సలెన్సి,
నకతాని జెన్, హిరోషిమా సిటీ మేయర్ కజుమి మత్సుయి. హిరోషిమా సిటీ అసెంబ్లీ స్పీకర్ తాత్సునోరి మొతాని, హిరోషిమా నుంచి పార్లమెంటు సభ్యులు,
సీనియర్ ప్రభుత్వ అధికారులు, భారత కమ్యూనిటీ, జపాన్లోని మహాత్మాగాంధీ అనుచరులు పాల్గొన్నారు.
ఇండియా , జపాన్ ల మధ్య స్నేహానికి ,గుర్తుగా 2023 మే 19–21 మధ్య ప్రధానమంత్రి జి–7 శిఖరాగ్ర సమ్మేళనానికి జపాన్లో పర్యటిస్తున్న సందర్భంగా
మహాత్మాగాంధీ ఛాతీ సైజు కాంస్య విగ్రహాన్ని హిరోషిమా సిటీ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం బహుకరించింది.
42 ఇంచుల ఎత్తు ఉన్న ఈ కాంస్య విగ్రహాన్ని పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ రామ్ వంజి సుతార్ రూపొందించారు.
ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలానికి పక్కనే మొతోయాసు నది ప్రవహిస్తుంటుంది. అలాగే ప్రతిరోజూ వేలాది మంది స్థానికులు , పర్యాటకులు సందర్శించే బాంబ్ డోమ్
కు దగ్గరలోనే ఈ ప్రాంతం ఉంటుంది.
శాంతి,అహింసకు సంఘీభావంగా ఈ ప్రాంతాన్ని ఎంపికచేశారు. శాంతి, అహింసలకు మహాత్మాగాంధీ తమ జీవితాన్ని అంకితం చేశారు.
ఈ ప్రాంతం మహాత్మాగాంధీ జీవితం, ఆయన ఆదర్శాలను వాస్తవంగా ప్రతిధ్వనింపచేసేదిగా ,ప్రపంచాన్ని , ప్రపంచ నాయకులకు నిరంతరం ప్రేరణనిచ్చేదిగా ఉంది.
***
(Release ID: 1926067)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam