రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ముగిసిన సముద్ర శక్తి-23 విన్యాసాలు

Posted On: 20 MAY 2023 10:44AM by PIB Hyderabad

ఇండో-ఇండోనేషియా ద్వైపాక్షిక సముద్ర శక్తి-23 4వ దఫా విన్యాసాలు దక్షిణ చైనా సముద్రంలో ముగిశాయి.

ఈ నెల 17-19 తేదీల్లో జరిగిన సముద్ర దశ విన్యాసాల్లో, చేతక్ ఇంటెగ్రల్‌ హెలికాప్టర్, సముద్ర నిఘా డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కూడిన ఏఎస్‌డబ్ల్యూ కార్వెట్ ఐఎన్‌ఎస్‌ కవరత్తి నౌక విన్యాసాల్లో పాల్గొంది. ఇండోనేషియా తరపున ఇంటెగ్రల్‌ హెలికాప్టర్ పాంథర్, సీఎన్‌ 235 పాట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో కూడిన కేఆర్‌ఐ సుల్తాన్ ఇస్కందర్ ముడా పాల్గొంది. వ్యూహాత్మక ఉపాయాలు, ఆయుధ కాల్పులు, హెలికాప్టర్‌ కార్యకలాపాలు, వైమానిక రక్షణ, జలాంతర్గామి వ్యతిరేక పోరాటాలు సహా క్లిష్టమైన విన్యాసాలను రెండు నౌకాదళాలు ప్రదర్శించాయి. ఈ కార్యక్రమం రెండు పక్షాల పరస్పర బంధాన్ని మెరుగుపరిచింది.

సముద్ర దశ విన్యాసాలకు ముందు నౌకాశ్రయంలో పరస్పర చర్చలు, విన్యాసాలు, క్రీడా పోటీలు జరిగాయి.

సముద్ర శక్తి-23 విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేయడం భారత్‌-ఇండోనేషియా మధ్య బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. పరస్పర సహకారం ద్వారా ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో రెండు నౌకాదళాల నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.

 

***



(Release ID: 1925951) Visitor Counter : 181