మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2021-22లో దేశంలో చేపల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 162.48 లక్షల టన్నులకు చేరుకుంది: పురుషోత్తం రూపాల


ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారతదేశం మూడవ అతిపెద్ద చేపల ఉత్పత్తి దేశంగా ఉంది: శ్రీ పురుషోత్తం రూపాల

ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది; ప్రపంచంలోనే అత్యధికంగా రొయ్యలను ఉత్పత్తి చేసే దేశాలలో భారత్ ఒకటి: పురుషోత్తం రూపాల

మూడు రోజుల సాగర్ పరిక్రమ యాత్ర - గోవాలో ముగిసిన ఐదో దశ

Posted On: 19 MAY 2023 4:36PM by PIB Hyderabad

భారతదేశం సుసంపన్నమైన , వైవిధ్యమైన మత్స్య వనరులతో నిండి ఉందని , వివిధ రకాల చేపలను ఉత్పత్తి చేస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల అన్నారు. భారతదేశంలో చేపలు ఆహారం, పోషణ, ఉపాధి ,ఆదాయానికి ముఖ్యమైన వనరు. చేపలు ఆరోగ్యకరమైన జంతు ప్రోటీన్ , ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వ్యయ భారం లేని , గొప్ప వనరు  కావడంతో ఆకలి ,పోషకాహార లోపాన్ని తగ్గించడానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రాథమిక స్థాయిలో 2.8 కోట్ల మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులకు జీవనోపాధి, ఉపాధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ఈ రంగం కల్పిస్తుందని, విలువ గొలుసు వెంట కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ఆన్నారు.

 

భారతదేశంలో మత్స్య రంగం సంవత్సరాలుగా క్రమంగా అభివృద్ధి చెంది దేశ సామాజిక-ఆర్థిక వృద్ధికి ఒక ముఖ్యమైన మూల స్తంభంగా మారిందని శ్రీ పురుషోత్తం రూపాల  తెలియజేశారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పూర్తిగా ఒక సంప్రదాయ కార్యకలాపంగా ప్రారంభమైన మత్స్య రంగం గత 75 సంవత్సరాలలో చేపల ఉత్పత్తిలో 22 రెట్లు పెరుగుదలతో వాణిజ్య సంస్థగా రూపాంతరం చెందింది. 1950-51లో కేవలం 7.5 లక్షల టన్నులుగా ఉన్న భారతదేశ మొత్తం చేపల ఉత్పత్తి 2021-22 నాటికి రికార్డు స్థాయిలో 162.48 లక్షల టన్నులకు చేరుకుంది, 2020-21తో పోలిస్తే 2021-22లో చేపల ఉత్పత్తిలో 10.34% వృద్ధి నమోదైంది. నేడు, భారతదేశం ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో మూడవ అతిపెద్ద చేపల ఉత్పత్తి దేశంగా ఉంది. ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ, ప్రపంచంలోనే అత్యధికంగా రొయ్యలను ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగానూ ఉందని

కేంద్ర మంత్రి అన్నారు.

 

ప్రధానంగా ఆక్వాకల్చర్ ద్వారా ప్రేరేపించబడిన ఇన్ లాండ్ చేపల ఉత్పత్తి పెరుగుదల మరింత అద్భుతంగా ఉంది. 2000-01లో ఏడాదికి కేవలం 28.23 లక్షల టన్ను ఉన్న ఇన్ లాండ్  చేపల ఉత్పత్తి  2021-22లో సంవత్సరానికి 21 లక్షల టన్నులు ఉంది. ఇది 400 శాతం పెరుగుదల. వాస్తవానికి, దేశంలో ఇన్ లాండ్ చేపల, ఆక్వాకల్చర్ ఉత్పత్తి 2014 నుండి దాదాపు రెట్టింపు అయింది.

 

వివిధ సంతానోత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో మన మత్స్య శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఐసీఏఆర్ సంస్థల కృషి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కష్టపడి పనిచేసే మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కృషి ఇందుకు కారణం.

75వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిగా సంబంధిత భాగస్వాములు మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, నావికులు , మత్స్యకారులకు వందనం చేస్తున్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్.వై ) కెసిసి వంటి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ మత్స్య పథకాలు , కార్యక్రమాల ద్వారా మత్స్యకారులు , ఇతర భాగస్వాముల సమస్యలను పరిష్కరించడం ,వారి ఆర్థిక అభ్యున్నతిని సులభతరం చేయడం లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సాగర్ పరిక్రమ.

 

17, మే 2023 న ముంబై, గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-5 ను  కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ప్రారంభించారు. డాక్టర్ అభిలాష్ లిఖీ, ఐఏఎస్, ఒ ఎస్ డి  (ఫిషరీస్), డాక్టర్ జుజ్జవరపు బాలాజీ,  జాయింట్ సెక్రటరీ (మెరైన్ ఫిషరీస్) , మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (ఫిషరీస్) డాక్టర్ అతుల్ పట్నే, ఐ ఎ ఎస్, సెక్రటరీ, (ఫిషరీస్) , మహారాష్ట్ర ప్రభుత్వం, డాక్టర్ ఎల్ఎన్ మూర్తి , నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది మహారాష్ట్ర తీర ప్రాంతం (కరంజా, జిల్లా రాయగఢ్) మీదుగా ప్రయాణించి, 2023 మే 18 న వెల్దూర్ (రత్నగిరి జిల్లా) చేరుకుని, (మిర్యా గ్రామం, మిర్కర్వాడ, జిల్లా రత్నగిరి, స్వాతంత్ర వీర్ సావర్కర్ నాట్యగ్రుహ, మారుతి మందిర్, జిల్లా రత్నగిరి) మీదుగా ఈ రోజు (19 మే )గోవా వద్ద ముగిసింది.

 

'సాగర్ పరిక్రమ' మొదటి దశ కార్యక్రమం గుజరాత్ లో నిర్వహించబడింది, 2022 మార్చి 5 న మాండ్వి నుండి ప్రారంభమైంది .6 మార్చి 2022 న గుజరాత్ లోని పోర్ బందర్ లో ముగిసింది. ఫేజ్ -2 కార్యక్రమంగా సాగర్ పరిక్రమ ప్రయాణం 2022 సెప్టెంబర్ 22 న మంగ్రోల్ నుండి వెరావల్ వరకు ప్రారంభమై 2022 సెప్టెంబర్ 23 న ముల్ ద్వారకా వద్ద ముగిసింది. 'సాగర్ పరిక్రమ' మూడవ దశ కార్యక్రమం 2023 ఫిబ్రవరి 19 న గుజరాత్ లోని సూరత్ నుండి ప్రారంభమైంది. 2023 ఫిబ్రవరి 21 న ముంబైలోని సాసన్ డాక్ వద్ద ముగిసింది. ఫేజ్-4 కార్యక్రమం 2023 మార్చి 17 న గోవాలోని మోర్ముగావ్ పోర్ట్ నుండి ప్రారంభమై 2023 మార్చి 19 న మంగళూరులో ముగిసింది.

 

సాగర్ పరిక్రమ ఫేజ్ 5 మొదటి రోజు కార్యక్రమం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల , ఇతర ప్రముఖులకు కరంజా (రాయ్గఢ్ జిల్లా) వద్ద దీపం వెలిగించి మత్స్యకారులు ,మహిళలు సాదర స్వాగతం పలకడంతో ప్రారంభమైంది.

చేపల ఉత్పత్తి, ఉత్పాదకత, దాని అనుబంధ కార్యకలాపాలు, ఇన్ ఫ్రా డెవలప్ మెంట్, మార్కెటింగ్, ఎగుమతులు, సంస్థాగత ఏర్పాట్లపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చేపల పెంపకందారులు, మత్స్యకారులు తదితర ప్రముఖులతో శ్రీ పురుషోత్తం రూపాల తదితరులు మాట్లాడారు. మత్స్యకారులు, చేపల పెంపకందార్లు, ఇతర భాగస్వాములను కిసాన్ క్రెడిట్ కార్డు, క్యూఆర్ కోడ్ ఆధార్ కార్డు/ఈ-శ్రమ్ కార్డుతో సత్కరించారు.కరంజా (రాయగఢ్ జిల్లా)లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 6000 మంది మత్స్యకారులు, చేపల రైతులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

సాగర్ పరిక్రమ ఫేజ్ 5 రెండవ రోజు కార్యక్రమం వెల్దూర్ (జిల్లా రత్నగిరి) నుండి ప్రారంభమైంది, ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (ఫిషరీస్) డాక్టర్ అతుల్ పట్నే సాగర్ పరిక్రమ ఫేజ్ 5 గురించి పాల్గొనేవారికి అవగాహన కల్పించారు. తీరప్రాంతంలో చేపల రైతులు , మత్స్యకారులు,  సంఘాలు,  పోషించే కీలక పాత్ర గురించి, మొత్తం సముద్ర పర్యావరణ వ్యవస్థ గురించి

వివరించారు.

 

వెల్దూరు (రత్నగిరి జిల్లా)లో ఉన్న లబ్ధిదారులు, చేపల పెంపకందారులు, మత్స్యకారులతో శ్రీ పురుషోత్తం రూపాల, ఇతర ప్రముఖులు ముచ్చటించారు. లబ్దిదారులలో 1) విఠల్ భలేకర్, 2) పి.ఎన్.చౌగాలే, 3) మక్బూల్ హుస్సేన్ జంబర్ఖర్ ఉన్నారు. ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా, చేపల పెంపకం దారులు తాము చేపలు పెంచే విధానం గురించి గురించి వివరించారు వారి సంబంధిత అనువర్తనాలను పంచుకున్నారు.

 

ఈ కార్యక్రమం  రత్నగిరి జిల్లా మిర్కార్వాడ వరకు కొనసాగింది . మత్స్యకారులు, చేపల పెంపకందారులు , ఇతర భాగస్వాములను కిసాన్ క్రెడిట్ కార్డు క్యూఆర్ కోడ్ ఆధార్ కార్డు / ఇ-శ్రమ్ కార్డుతో సత్కరించారు. మిర్కార్వాడ (జిల్లా రత్నగిరి) లో జరిగిన కార్యక్రమంలో సుమారు 8000 మంది మత్స్యకారులు, చేపల రైతులు ,ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

స్వాతంత్ర వీర్ సావర్కర్ నాట్యగృహ, మారుతీ మందిర్ (జిల్లా రత్నగిరి)లో సీనియర్ అధికార ప్రముఖులు, మత్స్యకారులు, చేపల రైతులు, ఇతర భాగస్వాముల సమక్షంలో స్టేజ్ కార్యక్రమాలు జరిగాయి.  మహారాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల మంత్రి  శ్రీ ఉదయ్ సామంత్, పార్లమెంటు సభ్యుడు, శాసనసభ సభ్యులు , ఇతర ప్రజా ప్రతినిధులు, భారత ప్రభుత్వ మత్స్య పశుసంవర్ధక , పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. వీరిలో భారత ప్రభుత్వ మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలోని ఫిషరీస్ డిపార్ట్ మెంట్

ఐఎఎస్, ఒ ఎస్ డి  డాక్టర్ అభిలాష్ లిఖీ, మహారాష్ట్ర పిషరీస్ సెక్రటరీ, కమిషనర్ డాక్టర్ అతుల్ పట్నే, భారత ప్రభుత్వ ఫిషరీస్ డిపార్ట్ మెంట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ జె. బాలాజీ తో పాటు

భారత ప్రభుత్వ ఫిషరీస్ డిపార్ట్ మెంట్, నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు, మహారాష్ట్ర ప్రభుత్వం, గోవా ప్రభుత్వ ఫిషరీస్ డైరెక్టర్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు సీనియర్ అధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు ఉన్నారు.

ఈ యాత్రలో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు, మత్స్యశాఖ ప్రతినిధులు, చేపల పెంపకందారులు, పారిశ్రామికవేత్తలు, భాగస్వాములు, వృత్తినిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

 

సాగర్ పరిక్రమ ఫేజ్-5 మూడో రోజు కార్యక్రమం వాస్కో ఫిషింగ్ జెట్టీ వరకు సాగింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గోవా ప్రభుత్వ మత్స్య శాఖ మంత్రి శ్రీ నీలకాంత్ హల్రాన్కర్, ఇతర ప్రముఖులు వాస్కో ఫిషింగ్ జెట్టీలో చేపల రైతులు, మత్స్యకారులు మొదలైన లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్ వై), కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) వంటి పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించిన ప్రముఖులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

మన మత్స్యకారులు, చేపల పెంపకందారులు కెసిసి ప్రయోజనాన్ని పొందడానికి ,వారి జీవితాలను మెరుగుపరచడంలో తమను తాము రక్షించుకోవడానికి మద్దతు ఇవ్వడానికి పథకాలపై అవగాహన కల్పించడానికి వాలంటీర్లు సహకరించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక ,పాడిపరిశ్రమ మంత్రి కోరారు.

 

బైనా, నానుతేల్ లో జరిగిన గ్రామ స్థాయి కార్యక్రమంలో శ్రీ పురుషోత్తం రూపాల, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గోవాలోని బైనాలో శ్రీ పురుషోత్తం రూపాల మత్స్యకారుల సంఘం నుండి దరఖాస్తులు స్వీకరించారు. దేశవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి మద్దతు ఇవ్వడానికి అధిక డిమాండ్ ఉన్నందున, ప్రధాన మంత్రి ప్రత్యేక మత్స్య శాఖను ఏర్పాటు చేశారని, 1950 నుండి 2014 వరకు మత్స్య రంగంలో సుమారు రూ .3,681 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2014 నుండి ప్రభుత్వం సుమారు బడ్జెట్ తో పిఎంఎంఎస్ వై వంటి పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని మత్స్యరంగ అభివృద్ధికి రూ.20,500 కోట్లు కేటాయించారు. అనంతరం మత్స్యకారులు, మత్స్యకార మహిళలతో మాట్లాడి వారి సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. మత్స్యకారులు, చేపల పెంపకందారులు ముందుకు వచ్చి తీరాలకు సమీపంలో ఉన్న నివాస కాలనీలు, మౌలిక సదుపాయాలు, మత్స్యకారుల హక్కులకు సంబంధించిన సవాళ్లను మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే, మత్స్యకారులు డీప్ సీ ఫిషింగ్ నౌకను అందించాలని కోరారు, ఫిషింగ్ పరికరాలు, నెట్ బైండింగ్, ఆయిల్ ఒలికిపోవడం, కోత మొదలైన వాటికి సంబంధించి బీమా కల్పించాలని కోరారు.

మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ, మత్స్యకారులు, చేపల పెంపకందారులు తమ క్షేత్రస్థాయి వాస్తవాలు ,అనుభవాలను పంచుకోవడానికి , తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలపడానికి ఇంటరాక్టివ్ సెషన్ సహాయపడిందని అన్నారు.

 

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల ఫిషరీస్ గోవా ఆన్ లైన్ సేవలకు సంబంధించిన పథకాన్ని ప్రారంభించారు. రాజ్ బాగ్ కానకోన (గోవా)లో జరిగిన కార్యక్రమంలో ప్రగతిశీల మత్స్యకారులు, ముఖ్యంగా సంప్రదాయ మత్స్యకారులు, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, యువ మత్స్య ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రధాన మంత్రి మత్స్యసంపద పథకానికి సంబంధించిన సర్టిఫికెట్లు/అనుమతులను ప్రదానం చేశారు.

 

మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర వాటాదారులు వంటి

లబ్దిదారులకు i) సంప్రదాయ మత్స్యకారులకు బోట్ (రీప్లేస్ మెంట్),  వలల కోసం (అబ్దుల్ హమీద్, రూ.1,15,500/-), తుకారాం బి.చందేకర్, రూ.1,80,000/-, కాన్స్టాసియో బారెటో మొత్తం రూ.1,30,682/-, అవినాశ్ కాబ్రాల్, రూ.73,500/-,  బాబు జి.టాండేల్, రూ.1,68,000/-, జోస్ బ్రగాంజా, మొత్తం రూ.1,40,000/-, సదానంద్ చంద్రు పగి, రూ.1,24,182/-, రామనాథ్ పిలు పగి, రూ.1,16,409/-, సంతోష్ హరిశ్చంద్ర ఠక్కర్, రూ.96,211/-, ప్రతాప్ చంద్రకాంత్ కంకోంకర్, రూ.1,26,112/-, సోకోరో బ్రగాంజా, రూ.97,382/-, మిలాగ్రిస్ ఫెర్నాండెజ్, రూ.1,14,210/-, ఫ్రాన్సిస్కో బ్రగాంజా, రూ.1,57,800, కాజెటన్ మైఖేల్ గుర్జా.రూ.1,36,500/-, మెహక్ ముకుంద్ పగి, రూ.1,42,200/-, ఉజ్వల శంకర్ పగి, రూ.1,62,000/- , అనా రీటా ఫెర్నాండెజ్, రూ.1,46,482/-), ii) లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్, 1 యూనిట్ కోసం

(మెసర్స్ జాష్ ఫామ్, కేరీ ఏరియాలో రూ.8,00,000), iii) ఇన్సులేటెడ్ వాహనాల కొనుగోలుకు (రూహినాజ్ ఐజాజ్ ఖాజ్, రూ.1,37,400/-), iv) కిసాన్ క్రెడిట్ కార్డు (శ్రీ. రామిడియోస్ డి మెల్లో, రూ. 1,60,000/-, శ్రీ. హెన్రిక్ డి మెల్లో, రూ.1,60,000/-), v) మార్కెట్,  ఇతర బహిరంగ ప్రదేశాల్లో చేపల అమ్మకం కేటగిరీకి ఫిష్ సెల్లర్ కార్డు ( ప్రతిమా హరిశ్చంద్ర పాగి, బేబీ రత్నాకర్ పగి, వత్సల పాండు పాగి, కవితా కాంతా పగి, సుమిత్రా ఆర్.పగి, శోభా బి.పగి, మాయావతి దత్తుపగుయి, ప్రియాంక ప్రదీప్ పగుయి, 30 అమిత అమృత్ పగుయి, సత్యవతిరాఘోబా పగి, ఉజ్వల శ్రీకాంత్ పగి, దీపా డెలిప్ పగి, శ్రీమతి రత్నాకర్ పగి, తేజ తైకుష్ పాగి, సవితా బాలచంద్ర పగి, సవితా బాలచంద్ర పగి.  అంకిత గురుదాస్ పగుయి, లతికా లక్ష్మణ్ పగి, సురేఖ రామ్ పాగి, రాజశ్రీ గణేశం పగి, సుష్మా ప్రదీప్ పగి, దీపా పగి, అశ్విని అశోక్ పగి, భాగీరథి భరత్ పగి), vi)

ఇన్సులేటెడ్ బాక్సుల కోసం (గురుదాస్ ఎల్.ధురి, 100 లీటర్లు, రూ.1,553/-, షోశాంత్ ఎస్.పగి, 220 లీటర్లు, రూ.4963/-, సంతోష్ విఠల్ పగి 220 లీటర్లు, రూ.4963/-, ఊర్మిళ ఉల్హాస్ పగి, 220 లీటర్లు, రూ.4963/-, మధుకర్ కంతా పగి 100 లీటర్లు, రూ.1553/-, సుధాకర్ డి. పగీ , 220 లీటర్లు, రూ.4963/-

vii) భద్రతా సామగ్రి కోసం (శ్రీ. ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ ఎకో సౌండర్ (ట్రాన్స్ పాండర్ మరియు లైఫ్ జాకెట్), రూ.31,200/-, శ్రీ.ఇర్ఫాన్ పోట్కర్ (ఎకో సౌండర్), రూ.34,000/-, శ్రీ.జోవో మరియానో గోస్ (ఎకో సౌండర్, ట్రాన్స్ డ్యూసర్), రూ.34,000/-, శ్రీ.కేటానో ఫెర్నాండెజ్ (ట్రాన్స్ డ్యూసర్, లైఫ్ జాకెట్ అండ్ లైఫ్ బోయ్), రూ.44,950/-,  శ్రీ సాన్ఫోర్డ్ రోడ్రిగస్ (పిష్ ఫైండర్, జి పి ఎస్ , ట్రాన్స్ డుసర్  రూ.1,00,000/-, శ్రీ.మైఖేల్ ఆర్.ఫెర్నాండెజ్ (డిజిటల్ సోనార్ మానిటర్), రూ.1,00,000/-, శ్రీ. కెటానో అగ్నెలో నికోలౌ రోడ్రిగ్స్ (ఫిష్ ఫైండర్ ఎఐఎస్), రూ.62,000/-, శ్రీ. మెనినో అఫోన్సో (ఫిష్ ఫైండర్ ఏఐఎస్), రూ.1,00,000 అందచేశారు.

 

వివిధ ప్రాంతాల నుంచి 20 వేల మందికి పైగా భౌతికంగా హాజరైన ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 15 వేల మంది వీక్షించారు. అందువల్ల, వాతావరణ మార్పులు , సుస్థిర అభివృద్ధితో సహా మత్స్యకారులు , మత్స్యకారుల జీవనోపాధి ,సమగ్ర అభివృద్ధిపై ఈ సాగర్ పరిక్రమ ప్రభావం విస్తృతంగా ఉంటుంది.

 

తీరప్రాంత ప్రజల, ముఖ్యంగా దేశంలోని సముద్ర మత్స్యకారుల జీవన ప్రమాణాలు, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి మెరుగైన విధానాలను రూపొందించడానికి ఇది ప్రభుత్వానికి సహాయపడుతుంది. దేశ ఆహార భద్రత కోసం సముద్ర మత్స్య వనరుల వినియోగం, తీరప్రాంత మత్స్యకార సమాజాల జీవనోపాధి (సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ), మత్స్యకార సమాజాల అంతరాలను పూడ్చడం ,వారి ఆకాంక్షలు, మత్స్యకార గ్రామాల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్ల వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సృష్టించడం ద్వారా సుస్థిరమైన, బాధ్యతాయుతమైన అభివృద్ధిని నిర్ధారించడంపై పర్యావరణ విధాన కోణం నుంచి .రాబోయే దశలలో  సాగర్ పరిక్రమ ప్రయాణం దృష్టి పెడుతుంది. 

 

సాగర్ ప్రారిక్రమ ఫేజ్-5  కార్యక్రమం గణనీయమైన ప్రభావంతో , అద్భుతమైన విజయంతో ముగింపునకు చేరుకుంది

***


(Release ID: 1925671) Visitor Counter : 226