మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొన‌సాగుతున్న 27 ఉన్నత‌ విద్యా సంస్థ‌ల (హెచ్ఇఐలు) మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల పురోగ‌తిని స‌మీక్షించిన శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌


నిర్ణ‌యించిన కాల గ‌డువులోప‌ల మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌వ‌ల‌సిందిగా హెచ్ఇఐలను ఆదేశించిన శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2023 4:32PM by PIB Hyderabad

కేంద్ర విశ్వ‌విద్యాల‌యాలు, ఐఐఎస్ఇఆర్‌లు, ఐఐఐటిలు, ఐఐఎంలు, ఐఐటిలు స‌హా 27 ఉన్న‌త విద్యాసంస్థ‌ల కొన‌సాగుతున్న మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల పురోగ‌తిని స‌మీక్షించేందుకు శుక్ర‌వారం జ‌రిగిన‌ ఉన్న‌త స్థాయి స‌మావేశానికి కేంద్ర విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి & వ్య‌వ‌స్థాప‌క‌త శాఖ‌ల మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఉన్న‌త విద్య కార్య‌ద‌ర్శి శ్రీ కె. సంజ‌య్ మూర్తి, ఉన్న‌త విద్యా సంస్థ‌ల అధిప‌తులు, విద్యా మంత్రిత్వ‌శాఖ‌, సిపిడ‌బ్ల్యుడి, ఎన్‌బిసిసి సీనియ‌ర్ అధికారులుఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. 
నిర్ణ‌యించిన కాల‌క్ర‌మం లోపుగా మౌలిక‌స‌దుపాయ ప్రాజెక్టుల ప‌నిని వేగ‌వంతం చేసి, పూర్తి చేయ‌వ‌ల‌సింది ఉన్న‌త విద్యా సంస్థ (హెచ్ఇఐ) అధిప‌తుల‌ను శ్రీ ప్ర‌ధాన్ స‌మావేశంలో ఆదేశించారు. ఆధునిక మౌలిక స‌దుపాయాల‌న్న‌వి 21వ శ‌తాబ్ద‌పు ప్ర‌పంచ పౌరుల‌ను సృష్టించాల‌న్న మ‌న కృషికి బ‌లాన్ని చేకూరుస్తుంద‌ని ఆయ‌న అన్నారు. 
వివిధ కేంద్ర విశ్వ‌విద్యాల‌యాలు, ఐఐఎస్ఇఆర్‌లు, ఐఐఎంలు, ఐఐఐటిలు, ఐఐటిల విద్యార్ధుల‌కు వృత్తిప‌ర‌మైన కార్య‌క‌లాపాల‌కు సౌక‌ర్యాలు, హ‌స్ట‌ళ్ళు, ప్ర‌యోగ‌శాల‌లు, నూత‌న విద్యా బ్లాకులు పూర్తి కానున్న‌ ఈ నూత‌న ప్రాజెక్టుల‌లో ఉన్నాయి. 

***


(రిలీజ్ ఐడి: 1925662) సందర్శకుల సూచీ సంఖ్య : : 183
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Odia , Tamil