యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముగ్గురు జాతీయ క్రీడ పురస్కార గ్రహీతలకు ప్రశంస పత్రాలు, ట్రోఫీలు అందజేసిన కేంద్ర క్రీడల మంత్రి

प्रविष्टि तिथि: 18 MAY 2023 5:01PM by PIB Hyderabad

వివిధ కారణాల వల్ల రాష్ట్రపతి నుంచి పురస్కారాలను అందుకోలేకపోయిన జాతీయ క్రీడల పురస్కార గ్రహీతలకు ఈ రోజు కేంద్ర క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. మంత్రి నివాసంలో ఈ పత్రాలను అందించారు.

ఈ రోజు జరిగిన చిన్నపాటి సమావేశంలో, భారత షూటర్ అంజుమ్ మౌద్గిల్ (అర్జున పురస్కారం), హాకీ శిక్షకుడు సర్పల్ సింగ్ (ద్రోణాచార్య పురస్కారం), దివంగత టెన్నిస్ శిక్షకుడు నరేష్ కుమార్ (ద్రోణాచార్య పురస్కారం) తరపున ఆయన కుటుంబ సభ్యులు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలను అందుకున్నారు.

అంజుమ్‌కు 2019 సంవత్సరం అర్జున అవార్డును, హాకీ శిక్షకుడు సర్పల్ సింగ్‌కు 2021 సంవత్సరం ద్రోణాచార్య పురస్కారాన్ని, దివంగత నరేష్ కుమార్ తరపున ఆయన మనవరాలు శివాని మిర్చందానీకి క్రీడల మంత్రి పురస్కారాలు అందజేశారు. నరేష్ కుమార్‌కు 2020 సంవత్సరం ద్రోణాచార్య అవార్డును ప్రకటించారు.

*****


(रिलीज़ आईडी: 1925317) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil