ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోసం వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళికను విడుదల చేసిన - కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


"సమర్థులైన శ్రామికశక్తి ద్వారా లక్ష్య సాధనకు, సామర్థ్య నిర్మాణ ప్రణాళికలు రహదారిగా పనిచేస్తాయి, సంస్థకు 'పని సంస్కృతి' ని అందిస్తాయి, భాగస్వామ్య లక్ష్యాలతో, దృష్టితో జట్టుగా పని చేయడానికి వ్యక్తుల ప్రయత్నాలను క్రమబద్దీకరిస్తాయి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


"భారతదేశంలో సమర్థతకు లోటు లేదు, అయితే, ఆశించిన ఫలితాలను సాధించడానికి, దానిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది"


నియమాల ఆధారిత వైపు నుండి పాత్ర-ఆధారిత పని సంస్కృతి, పాత్ర-ఆధారిత పర్యావరణం వైపు సంస్థలను మార్చడానికి, సామర్ధ్య నిర్మాణ కార్యకలాపాలు అనుమతిస్తాయి : డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 17 MAY 2023 6:09PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సివిల్ సర్వెంట్ల సామర్థ్యం పెంపుదల కోసం వార్షిక సామర్థ్య నిర్మాణ ప్రణాళిక ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు ఢిల్లీ లో  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సమర్థులైన శ్రామిక శక్తి ద్వారా లక్ష్య సాధనకు, సామర్థ్య నిర్మాణ ప్రణాళికలు రహదారిగా పనిచేస్తాయి, సంస్థకు 'పని సంస్కృతి' ని అందిస్తాయి, భాగస్వామ్య లక్ష్యాలతో, దృష్టితో జట్టుగా పని చేయడానికి వ్యక్తుల ప్రయత్నాలను క్రమబద్దీకరిస్తాయి." అని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. 

వివిధ ప్రభుత్వ సంస్థలను నిర్వహించే సివిల్ సర్వెంట్ల సామర్థ్యాలను మెరుగుపరచి, అభివృద్ధి చేయడం కోసం మిషన్ కర్మయోగిని ప్రారంభించిన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన స్ఫూర్తిని డాక్టర్ మాండవీయ గుర్తుచేసుకుంటూ, పునరుద్ఘాటిస్తూ, "భారతదేశంలో సామర్థ్యం తక్కువగా లేదు, కానీ ఆశించిన ఫలితాలు సాధించడం కోసం దానిని ఉపయోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది" అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, అంకిత భావం తో కూడిన భాగస్వాముల ప్రయత్నాలను ప్రశంసించారు , "ప్రభుత్వ సామర్థ్య నిర్మాణ వ్యవస్థను పునరుద్ధరించడానికి, పౌర సేవా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఈ కార్యక్రమం ఒక మార్గంగా భావించడం జరిగింది." అని పేర్కొన్నారు.  సామర్థ్య నిర్మాణం ప్రాముఖ్యత గురించి ఆయన నొక్కి చెబుతూ, అంతిమ ఫలితాల నాణ్యతను ఎలా పెంచాలనే దానిపై ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

వార్షిక సామర్ధ్య నిర్మాణ ప్రణాళిక  (ఏ.సి.బి.పి) అనేది వ్యక్తులు, మంత్రిత్వ శాఖ, విభాగాలు, సంస్థల (ఎం.డి.ఓ.ల) సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడేందుకు రూపొందించిన సమగ్ర వ్యూహాత్మక పత్రం.   ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ కర్మయోగి విభాగం, డిపార్ట్‌మెంట్‌ లోని మిగిలిన అన్ని విభాగాలతో సన్నిహిత సమన్వయం, సంప్రదింపులతో పాటు, ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. కోసం వివరణాత్మక శిక్షణా అవసరాల విశ్లేషణ (టి.ఎన్.ఏ.) తర్వాత. సామర్ధ్య నిర్మాణ కమీషన్ ఈ ప్రణాళికను అభివృద్ధి చేసింది. 

శిక్షణా సంస్థలు తమ అభ్యాసాలను ఇతరులకు అందించే ముందు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్ర మంత్రి ఉద్బోధించారు.  మెరుగైన సామర్థ్యంతో, వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని పొందడంతో పాటు, మెరుగైన ఫలితాలను సాధిస్తారని కూడా ఆయన నొక్కి చెప్పారు.

పౌర సేవల సిబ్బంది అందరూ ప్రజలకు ముఖ్యమైన సేవలను అందించడంలో పాలుపంచుకున్నప్పటికీ, అవసరమైన ఆరోగ్య సేవలు చివరి పౌరులకు చేరేలా ఆరోగ్య సేవల్లో వారి పాత్ర మరింత ముఖ్యమైనదని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ప్రముఖంగా పేర్కొన్నారు. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మంత్రిత్వ శాఖ కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు, ఆ ప్రణాళికను  అమలు పరచడంలో శిక్షణా సంస్థలు నాయకత్వ పాత్ర పోషించాలని, ఆయన కోరారు.  మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల అవసరాలకు అనుగుణంగా అధికారుల నైపుణ్యం, సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధానమైన ఉద్దేశ్యమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.   "దేశంలోని విస్తారమైన శిక్షణా సంస్థల నెట్‌-వర్క్ స్వతంత్ర ప్రాతిపదికన పనిచేయకుండా, అధికారులకు నైపుణ్యాలు, శిక్షణను అందించే నెట్‌-వర్క్‌ గా పనిచేస్తుంది." అని ఆయన తెలియజేశారు.  అవసరమైనప్పుడు ఈ ప్రణాళిక మెరుగుదలకు, సవరణలకు లోబడి ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు.

సామర్ధ్య నిర్మాణ కమీషన్ చైర్మన్ శ్రీ ఆదిల్ జెనుల్ భాయ్ మాట్లాడుతూ,  సివిల్ సర్వెంట్లను సామర్థ్యాల పెంపుదల కోసం వత్తిడి చేయడం గౌరవనీయులైన ప్రధానమంత్రి అభిప్రాయం కాదనీ, ప్రజలను వారి అత్యుత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉండేలా వెలికి తీయడం, ఆసక్తికరంగా మార్చడం, ఆయన ఉద్దేశ్యమని, పేర్కొన్నారు.   సామర్ధ్య నిర్మాణ ప్రణాళిక అనేది పని నాణ్యతను మెరుగుపరిచే ఒక ఆచరణాత్మక ప్రణాళిక అని, సివిల్ సర్వెంట్లు వారిలో జీవితకాల అభ్యాసాన్ని పెంపొందించడానికి సహాయపడతారని, ఆయన నొక్కి చెప్పారు. 

నేపథ్యం:

ఏ.సి.బి.పి. అనేది "యోగ్యతతో నడిచే శిక్షణ మరియు మానవ వనరుల నిర్వహణ" యొక్క పర్యావరణ వ్యవస్థను సృష్టించే విధానంపై ఆధారపడింది.

సాంకేతిక-అవగాహన ఉన్న, సమర్థులైన, శ్రద్ధగల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సివిల్ సర్వెంట్ల కొత్త శకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో, 2020 సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్.పి.సి.ఎస్.సి.బిఅనే  'మిషన్-కర్మయోగి' కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కోసం సామర్ధ్య నిర్మాణ ప్రణాళికలను (సి.బి.పి.లను) రూపొందించి, అభివృద్ధి చేయడంతో పాటు, పౌర సేవల శిక్షణా సంస్థల క్రియాత్మక పర్యవేక్షణ కోసం ఈ సామర్ధ్య నిర్మాణ కమిషన్ (సి.బి.సి) ని ఏర్పాటు చేయడం జరిగింది. 

సివిల్ సర్వెంట్స్ లో డొమైన్ సామర్థ్యాలు (రంగం, విభజన, సంబంధిత ఫోకస్ ప్రాంతాలకు సంబంధించిన జ్ఞానం, నైపుణ్యానికి సంబంధించినవి), ప్రవర్తనా సామర్థ్యాలు (ప్రవర్తన, సాఫ్ట్ స్కిల్స్‌ కు సంబంధించినవి) క్రియాత్మక సామర్థ్యాలు (ఫంక్షనల్‌ కు సంబంధించినది) యొక్క క్రమబద్ధమైన అభివృద్ధిని వార్షిక సామర్ధ్య నిర్మాణ ప్రణాళిక రూపొందించింది.   ఎం.డి.ఓ. ద్వారా ఎంపిక చేసిన ప్రముఖ శిక్షణా సంస్థలు చేపట్టే వార్షిక శిక్షణ ప్రణాళిక, విస్తృత కార్యక్రమ వివరాలు ఏ.సి.బి.పి. లో ఉంటాయి. 

 

 

*****



(Release ID: 1925119) Visitor Counter : 139


Read this release in: Urdu , English , Hindi , Tamil