శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'నిర్వహణీయ నీలి ఆర్థిక వ్యవస్థకు శాస్త్రీయ సవాళ్లు, అవకాశాలు' పై డయ్యు గురువారం జి20 పరిశోధన,
కొత్త కల్పనల ఉపక్రమణ కూటమి (ఆర్ఐఐజి) సమ్మేళనం జరుగుతుంది.
2023 జి20 అధ్యక్ష స్థానంలో ఇండియా ఉన్న సందర్భంలో ఆర్ఐఐజి చేపట్టిన ఇతివృత్తం
'న్యాయబద్ధ సమాజం కోసం పరిశోధన, కొత్త కల్పన'
Posted On:
17 MAY 2023 4:38PM by PIB Hyderabad
నిర్వహణీయ నీలి ఆర్థిక వ్యవస్థకు గల అవకాశాల గురించి డయ్యు లో జరిగే జి20 ఆర్ఐఐజి సమ్మేళనంలో చర్చిస్తారు.
జి20 సభ్య దేశాలు, ఆహ్వానిత అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు మరియు శాస్త్రీయ సమాజానికి చెందిన నిపుణులు
నిర్వహణీయ నీలి ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం తీసుకోవలసిన చర్యలు, మార్గాలను గురించి డయ్యు (డయ్యు, డామన్, నాగర్ హవేలీ)లో జరిగే జి20 ఆర్ఐఐజి సమ్మేళనంలో చర్చిస్తారు.
జి20 ఆర్ఐఐజి అధ్యక్షుడిగా ఉన్న భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తారు. భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఈ సమ్మేళనానికి సమన్వయకర్త. 35 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు నలభై మంది భారతీయ నిపుణులు, ప్రతినిధులు మరియు ఆహ్వానితులు సమ్మేళనంలో పాల్గొంటారు. భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ సమావేశాన్ని సమన్వయ పరుస్తారు.
2023 జి20 అధ్యక్ష స్థానంలో ఇండియా ఉన్న సందర్భంలో ఆర్ఐఐజి చేపట్టిన ఇతివృత్తం 'న్యాయబద్ధ సమాజం కోసం పరిశోధన, కొత్త కల్పన'. ఇండియా జి20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలో ఆర్ఐఐజి ప్రాధాన్యతా క్షేత్రాలు: i) నిర్వహణీయ ఇంధన పదార్థాలు ii) వృత్త జీవ ఆర్థిక వ్యవస్థ iii) ఇంధన పరివర్తన కోసం పర్యావరణ కొత్త కల్పనలు మరియు iv) నిర్వహణీయ నీలి ఆర్థిక వ్యవస్థకు శాస్త్రీయ సవాళ్లు మరియు అవకాశాలు. నిర్వహణీయ ఇంధన పదార్థాలు; వృత్త జీవ ఆర్థిక వ్యవస్థ; ఇంధన పరివర్తన కోసం పర్యావరణ కొత్త కల్పనలు క్షేత్రాల గురించి ఇదివరకే వరుసగా రాంచీ, డిబ్రూగర్, ధర్మశాలలో ఆర్ఐఐజి సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది.
నీలి ఆర్థిక వ్యవస్థపై డయ్యు జి20 ఆర్ఐఐజి సమ్మేళనం దిగువ పేర్కొన్న అనేక కీలక ఉప అంశాలపై సభ్య దేశాల మధ్య జ్ఞాన మార్పిడి మంచి అనుభవాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఎ) నీలి ఆర్ధికరంగం మరియు అవకాశాలు; బి) సముద్ర కాలుష్యం; సి) తీరప్రాంత మరియు సముద్ర పర్యావరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం; డి) పరిశీలనలు, దత్తాంశాలు మరియు సమాచార సర్వీసులు; ఈ) తీరప్రాంత మరియు సముద్ర ప్రదేశ ప్రణాళిక; ఎఫ్) సముద్ర లోతుల్లో అన్వేషణ, సముద్రం ఒడ్డున కొత్త మరియు అక్షయ ఇంధనం మరియు జి) నీలి ఆర్థిక వ్యవస్థ విధానాలు మరియు వ్యూహాలు.
<><><><><>
(Release ID: 1925114)
Visitor Counter : 226