కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అంతరిక్ష ఆధారిత సమాచార సేవల కోసం స్పెక్ట్రం కేటాయింపు అన్న అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ- ట్రాయ్) విడుదల చేసిన సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు/ ప్రతివ్యాఖ్యలను సమర్పించేందుకు ఆఖరు తేదీ పొడిగింపు
నాడు పోస్టు చేయడమైనది:
17 MAY 2023 1:55PM by PIB Hyderabad
అంతరిక్ష ఆధారిత సమాచార సేవల కోసం స్పెక్ట్రం కేటాయింపు అన్న అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ) 06 ఏప్రిల్, 2023న సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. సంప్రదింపుల పత్రంలో లేవనెత్తిన అంశాలపై వాటాదారుల/ భాగస్వాముల నుంచి లిఖితపూర్వక వ్యాఖ్యలను అందుకునేందుకు మొదట 04 మే 2023ను ఆఖరు తేదీగాను, ప్రతి వ్యాఖ్యలకు చివరి తేదీ 18 మే 2023గానూ నిర్ణయించారు. అయితే, భాగస్వాములు, పారిశ్రామిక అసోసియేషన్ల విజ్ఞప్తి మేరకు లిఖితపూర్వక వ్యాఖ్యలను, ప్రతి వ్యాఖ్యలను సమర్పించేందుకు ఆఖరితేదీలను 18 మే 2023, జూన్ 01, 2023గా నిర్ణయించారు.
భాగస్వాములు/ వాటాదారులు, పారిశ్రామిక అసోసియేషన్లు గడువును పొడిగించాల్సిందిగా చేసిన విజ్క్షప్తిని దృష్టిలో ఉంచుకుని, లిఖితపూర్వక వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలకు ఆఖరు తేదీలను 01 జూన్ 2023, జూన్ 15, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించారు. పొడిగింపు కోసం ఇకపై చేసే ఏ విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోరు.
తమ వ్యాఖ్యలను/ ప్రతివ్యాఖ్యలను ట్రాయ్ సలహాదారు (నెట్‌వర్క్స్, స్పెక్ట్రం అండ్ లైసెన్సింగ్) శ్రీ అఖిలేష్ కుమార్ కు, ప్రధానంగా ఎలక్ట్రానిక్ రూపంలో advmn@trai.gov.in అన్న చిరునామాకు పంపవచ్చు. స్పష్టీకరణలు/ సమాచారం కోసం +91-11-23210481 అన్న ఫోన్ నెంబర్‌పై ఆయనను సంప్రదించవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 1925017)
సందర్శకుల సూచీ సంఖ్య : : 180