మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ఒకటైన పీఎంఎంఎస్‌వై కింద ఏడు ప్రధాన క్షేత్ర అధ్యయనాలను నిర్వహించనున్న జాతీయ ఉత్పాదక మండలి


భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మత్స్య రంగం పరివర్తనాత్మక సహకారం: శ్రీ పర్షోత్తమ్ రూపాలా

రూ. 14659.12 కోట్ల విలువ గల ప్రాజెక్టులు మార్చి వరకు ప్రభుత్వం ఆమోదించింది: శ్రీ రూపాలా

Posted On: 16 MAY 2023 5:26PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద మంచి ఫలితాలు వచ్చేలా ప్రోత్సాహాన్ని అందించడం కోసం స్వయంప్రతిపత్త సంస్థ, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (ఎన్పిసి) ద్వారా ఏడు ప్రధాన క్షేత్ర అధ్యయనాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలోని ఎన్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో,  పీఎంఎంఎస్‌వై ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల మాట్లాడుతూ   పీఎంఎంఎస్‌వై   జీడీపీ లో మత్స్య రంగం సహకారాన్ని పెంపొందించడంలో పరివర్తనాత్మకంగా నిరూపితమైందని  అన్నారు.  వాటాదారులతో కలిసి భారత ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన, చురుకైన చర్యలు కొత్త నీలి విప్లవాన్ని తీసుకువస్తున్నాయని తెలిపారు. ఎన్పిసి కొత్త క్షేత్ర స్థాయి అధ్యాయం విభాగం మంచి ఫలితాలు ఇచ్చేలా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంలో సహాయపడతాయని చెప్పారు. 

ఏడు రంగాల్లో ప్రధాన క్షేత్ర అధ్యయనాలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు.. 
(i)ఆంధ్రప్రదేశ్ చేపల మార్కెటింగ్ వ్యవస్థలో ఉత్తమ పద్ధతులు, వర్క్‌షాప్ ద్వారా విస్తృత ప్రచారం కల్పించడం;
(ii) ఎగువ గంగానది మైదాన ప్రాంతంలో ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించడానికి వినూత్న ఫిషింగ్ పద్ధతుల వ్యవసాయ-వాతావరణ జోన్-నిర్దిష్ట మ్యాపింగ్;
(iii) విక్రేతల ద్వారా లోతట్టు, సముద్ర చేపల కోసం సరఫరా గొలుసులో ఉపయోగించే నిల్వ కంటైనర్లలో డిజైన్ మెరుగుదల;
(iv) ఘాజీపూర్, హౌరా చేపల మార్కెట్లలో చేపల మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం;
(v) ఆర్ఏఎస్, బయోఫ్లోక్ టెక్నాలజీల మూల్యాంకనం, వర్క్‌షాప్ ద్వారా వాటి వ్యాప్తి;
(vi) పీఎంఎంఎస్వై అమలుపర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం;

(vii) లోతట్టు, సముద్ర చేపల పెంపకంలో పంటకోత అనంతర నష్టాలను అంచనా వేయడం, ఈ నష్టాలను తగ్గించడానికి చర్యలను సూచించడం. 

ఎన్పిసి సుమారు తొమ్మిది నెలల్లో ఈ క్షేత్ర అధ్యయనాలను పూర్తి చేస్తుంది.

 

"ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యంతో,   పీఎంఎంఎస్‌వై   మత్స్యకారులు, చేపల పెంపకందారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారి ప్రయోజనాల కోసం విస్తృత శ్రేణి కార్యకలాపాలను అందిస్తోంది. ఈ పథకం క్లస్టర్ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరిచింది. మత్స్య రంగం పోటీతత్వం, వాటాదారులకు అధిక ఆదాయాన్ని అందించడం మొదలైనవి ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనవి. వ్యవస్థీకృత పద్ధతిలో రంగం వృద్ధి, విస్తరణను వేగవంతం చేస్తూ, పీఎంఎంఎస్వై వ్యవస్థాపకత అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్నికలిపించింది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ప్రభుత్వం ఫిషింగ్ పరిశ్రమలో నిమగ్నమై ఉన్న వ్యక్తులు, సమూహాలకు   పీఎంఎంఎస్‌వై    కింద ఆర్థిక సహాయం అందించిందని,  పరిశ్రమకు మద్దతుగా కీలకమైన మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసును అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. పీఎంఎంఎస్వై   రాష్ట్రాలు/యుటిలు ప్రాజెక్ట్‌ల నుండి అధిక స్పందనలను అందుకుంది.  2023 మర్చి 31 వరకు  రూ. 14659.12 కోట్ల విలువైన ప్రాజెక్టులకు  ప్రభుత్వం ఆమోదించింది.

 పీఎంఎంఎస్‌వైని కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక,  పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. పీఎంఎంఎస్‌వై అనేది దేశంలో మత్స్య రంగాన్ని సుస్థిరమైన, బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయడం ద్వారా నీలి విప్లవాన్ని తీసుకురావడానికి ఉద్దేశించిన రూ. 20,050 కోట్లు పెట్టుబడి రంగం.  పీఎంఎంఎస్‌వై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి అమలు జరుగుతోంది. ఇది చేపల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత నుండి సాంకేతికత, పంటకోత అనంతర మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ వరకు మత్స్య విలువ గొలుసులోని క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడానికి రూపొందించబడింది.

ఈ సందర్భంగా ఎన్‌పిసి డైరెక్టర్ జనరల్ సందీప్ నాయక్ మాట్లాడుతూ, భారతదేశం రెండవ అతిపెద్ద ఆక్వా-వనరులను ఉత్పత్తి చేసే దేశంగా ఉందని, చేపలను ఎగుమతి చేసే అగ్రదేశాలలో ఒకటిగా ఉందని అన్నారు. భారతదేశ వ్యవసాయ ఎగుమతుల్లో దాదాపు 17% చేపలు, చేపల ఉత్పత్తుల నుండి జరుగుతున్నాయి. మత్స్య రంగం ప్రాథమిక స్థాయిలో 2.8 కోట్ల కంటే ఎక్కువ మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులకు జీవనోపాధిని అందిస్తుంది. మత్స్య విలువ గొలుసుతో పాటు మరెన్నో మందికి జీవనోపాధిని అందిస్తుంది.  పీఎంఎంఎస్‌వై  మత్స్యకారులు, చేపల పెంపకందారులు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారి ప్రయోజనాల కోసం విస్తృత శ్రేణి కార్యకలాపాలను అందిస్తుంది. ఈ పథకం క్లస్టర్ డెవలప్‌మెంట్, ఫిషరీస్ రంగం పోటీతత్వాన్ని పెంపొందించడం, వాటాదారులకు అధిక ఆదాయాన్ని అందించడం వంటి కార్యక్రమాలను సులభతరం చేసింది. వ్యవస్థీకృత పద్ధతిలో రంగం వృద్ధి, విస్తరణను వేగవంతం చేస్తున్నప్పుడు,  పీఎంఎంఎస్‌వై  వ్యవస్థాపకత అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

1958లో ఏర్పాటైన నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (ఎన్పిసి) అనేది కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ విభాగం క్రింద ఒక స్వయంప్రతిపత్త సంస్థ. పథకం నుండి వాటాదారులకు విలువను పెంచడం కోసం   పీఎంఎంఎస్‌వై కింద ప్రధాన క్షేత్ర అధ్యయనాలనుఎన్పిసి కి అప్పగించారు. 

*****(Release ID: 1924687) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Tamil