ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప‌శ్చిమ బెంగాల్‌, అస్సాంలో సోదాలు నిర్వ‌హిస్తున్న‌ ఆదాయ‌పు ప‌న్ను శాఖ

Posted On: 16 MAY 2023 4:39PM by PIB Hyderabad

ప‌శ్చిమ బెంగాల్  రాష్ట్రంలోని ఉత్త‌ర బెంగాల్ ప్రాంతంలో ప్ర‌ధానంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ఒక బిజినెస్ గ్రూప్‌పై ఆదాయ‌పు ప‌న్నుశాఖ సోదా, స్వాధీనం ఆప‌రేష‌న్ల‌ను నిర్వహించింది. ఈ వ్యాపార స‌ముదాయాన్ని క్రియాశీల‌క‌మైన రాజకీయ నేప‌థ్య‌మున్న వ్య‌క్తి నియంత్రిస్తున్నారు. స‌న్నిహిత వ్యాపార స‌హ‌చ‌రుడిపై కూడా సోదాలు నిర్వ‌హించారు. రైస్ బ్రాన్ వంట‌నూనె, ఆవ నూనె, డీ-ఆయిల్డ్ రైస్ బ్రాన్ (డిఒఆర్‌బి- నూనె తీసిన త‌వుడు), వివిధ రకాలైన ర‌సాయ‌నాలు, రియ‌ల్ ఎస్టేట్ త‌దిత‌రాల ఉత్ప‌త్తి నుంచి విక్ర‌యాల వంటి వ్యాపారాల‌లో ఈ గ్రూప్ నిమ‌గ్న‌మై ఉంది. ప‌శ్చిమ బెంగాల్‌లోని ఉత్త‌ర్ దినాజ్‌పూర్‌, దక్షిణ్ దినాజ్‌పూర్‌, మాల్దా, కోల్‌కొత‌, సిలిగురి. అస్సాంలో గువాహ‌తి, చుట్టుప‌క్కల ప్రాంతాల‌లో గ‌ల మొత్తం 23 ఆవ‌ర‌ణ‌ల‌లో ఈ సోదాలు నిర్వ‌హించారు. 
త‌న దిగుబ‌డిని తొక్కి పెట్టి, వంట‌నూనెలు, డిఒఆర్‌బికి సంబంధించి లెక్క‌ల్లో చూప‌ని న‌గ‌దు అమ్మ‌కాలకు పాల్ప‌డుతున్న‌ట్టు సోదాల‌లో వెల్ల‌డైంది. సోదాల‌లో సాధార‌ణ ఖాతా పుస్త‌కాల్లో న‌మోదు చేయ‌ని అనేక న‌గ‌దు లావాదేవీలను గుర్తించారు.    చేతితో రాసిన నోట్స్‌, ప‌త్రాలు, న‌గ‌దు లావాదేవీల సారం ఉన్న డిజిట‌ల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.  స‌మాంత‌ర న‌గ‌దు పుస్త‌కాలు, ఖ‌ర్చుల‌కు సంబంధించిన బోగ‌స్ క్లెయిమ్‌ల‌ను కూడా క‌నుగొన్నారు. దాదాపు రూ. 40 కోట్ల‌కు పైగా లెక్క‌ల్లోకి రాని ఆదాయాన్ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో బ‌యిట‌ప‌డింది. అంతేకాక‌, ఉత్త‌ర బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ప్ర‌ముఖ ఎగుమ‌తిదారు అయిన  ప్ర‌ధాన వ్యాపార గ్రూపుకు స‌న్నిహిత వ్యాపార స‌హ‌చ‌రుడిపై నిర్వ‌హించిన సోదాల‌లో ,  నేరారోప‌ణ‌ను రుజువు చేసే దాదాపు రూ. 17 కోట్లు (సుమారుగా) విలువ క‌లిగిన భూసేక‌ర‌ణ‌కు సంబంధించిన న‌గ‌దు చెల్లింపు ప‌త్రాలు ల‌భ్యం అయ్యాయి.  దాదాపు రూ. 100 కోట్ల మేర‌కు లెక్క‌ల్లో చూప‌ని న‌గ‌దు ర‌సీదుల‌కు సంబంధించిన వివ‌రాలు ల‌భ్య‌మ‌య్యాయి. 
ఈ సోదాల్లో లెక్క‌ల్లోకి చూప‌ని రూ. 1.73 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటుగా లెక్క‌ల్లో చూప‌ని రూ. కోటి విలువైన ఆభ‌ర‌ణాలు స్వాధీనం చేసుకున్నారు. 
ద‌ర్యాప్తు ఇంకా కొన‌సాగుతోంది. 

***
 


(Release ID: 1924612) Visitor Counter : 173