ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జపాన్ వైద్య పరికరాల కంపెనీల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సంభాషించారు
వైద్య పరికరాల రంగం భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఒక ముఖ్యమైన అంతర్భాగం. వైద్య పరికరాలు మరియు డయాగ్నస్టిక్ కిట్‌లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ద్వారా కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశీయ మరియు ప్రపంచవ్యాప్త పోరాటానికి భారతదేశం మద్దతు ఇవ్వడంలో ఈ రంగం యొక్క సహకారం మరింత ప్రముఖమైంది: డాక్టర్ మాండవియా
"పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలు మరియు వృద్ధిని సులభతరం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతతో, భారతీయ వైద్య పరికరాల పరిశ్రమ రాబోయే 25 సంవత్సరాలలో తయారీ మరియు ఆవిష్కరణలలో ప్రపంచ నేత గా ఉద్భవించే శక్తిని కలిగి ఉంది"
“మేక్ ఇన్ ఇండియా”, “ఇన్నోవేట్ ఇన్ ఇండియా” మరియు “డిస్కవర్ ఇన్ ఇండియా” అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి జపాన్ వైద్య కంపెనీలను ఆహ్వానిస్తుంది
Posted On:
16 MAY 2023 2:44PM by PIB Hyderabad
“భారత ఆరోగ్య సంరక్షణ రంగంలో వైద్య పరికరాల రంగం ఒక ముఖ్యమైన అంతర్భాగం. వైద్య పరికరాలు మరియు డయాగ్నస్టిక్ కిట్‌లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ద్వారా కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా దేశీయ మరియు ప్రపంచవ్యాప్త పోరాటానికి భారతదేశం మద్దతు ఇవ్వడంతో ఈ రంగం యొక్క సహకారం మరింత ప్రముఖమైంది. టోక్యోలో జపనీస్ మెడికల్ డివైసెస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు.
"వైద్య పరికరాల రంగం దాని ప్రస్తుత పరిమాణం 11 బిలియన్ డాలర్ల నుండి 2030 నాటికి 4 రెట్లు పెరిగే అవకాశం ఉంది" అని డాక్టర్ మాండవ్య పేర్కొన్నారు. "పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలు మరియు వృద్ధిని సులభతరం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతతో, భారతీయ వైద్య పరికరాల పరిశ్రమ రాబోయే 25 సంవత్సరాలలో తయారీ మరియు ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామిగా ఎదగగల శక్తిని కలిగి ఉంది అలాగే దాని అభివృద్ధి మరియు పురోగతికి మేము కట్టుబడి ఉన్నాము. భారతదేశం యొక్క జీ 20 అధ్యక్ష హోదా మంత్రమైన 'ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు'కు అనుగుణంగా స్వీయ-ఆధారిత స్వావలంబన మరియు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ లక్ష్యం వైపు పయనానికి ఇది దోహదపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి, గ్రీన్‌ఫీల్డ్ మరియూ బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ల కోసం ఆటోమేటిక్ రూట్‌లో భారతదేశం 100% ఎఫ్‌డిఐని అనుమతిస్తోందని కేంద్ర మంత్రి తెలియ చేశారు. దేశీయ తయారీని పెంచడానికి, ప్రభుత్వం $400 మిలియన్ల విలువైన ఆర్థిక ప్రోత్సాహకాలతో వైద్య పరికరాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రారంభించింది. పెట్టుబిదారులకు మద్దతుగా, రాష్ట్రాలలో 4 మెడికల్ డివైజెస్ పార్కుల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కులు ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి, వనరులను వృద్ధి చేస్తాయి, భారీ స్థాయి ఆర్థిక వ్యవస్థలపై ఇవి నిర్మించబడతాయి, ప్రామాణిక పరీక్ష మరియు మౌలిక సదుపాయాల సౌకర్యాలను సులభంగా అందుబాటు చేస్తాయి.
వైద్య పరికరాల రంగం యొక్క క్రమమైన వృద్ధిని సులభతరం చేయడానికి మరియు ప్రాప్యత, లభ్యత, స్థోమత, నాణ్యత మరియు ఆవిష్కరణలు ప్రజారోగ్య లక్ష్యాలను చేరుకోవడానికి, భారతదేశం ఇటీవల తన మొదటి జాతీయ వైద్య పరికరాల విధానాన్ని ఆమోదించిందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. “ఈ రంగం యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మరియు భారతదేశం మరియు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చే పోటీతత్వ, స్వావలంబన, సామర్ధ్యం మరియు వినూత్న పరిశ్రమగా ఈ పరిశ్రమను బలోపేతం చేయడానికి మేము ఆరు వ్యూహాలను గుర్తించాము. మెడికల్ డివైజెస్ పాలసీతో పాటు, బలమైన సహకారాలు మరియు సంబంధిత పరిశోధనలను ప్రారంభించడానికి మేము భారతదేశంలోని ఫార్మా-మెడ్‌టెక్ సెక్టార్‌లో ఆర్ అండ్ డీ మరియు ఇన్నోవేషన్‌పై జాతీయ విధానాన్ని కూడా ప్రతిపాదిస్తున్నాము” అని ఆయన చెప్పారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి తన ప్రసంగం లో, "ఆవిష్కరణలో వేగవంతమైన పురోగతితో, భారతదేశం ఇప్పుడు వైద్య పరికరాలు మరియు సాంకేతికతల రంగంలో ప్రపంచ స్థాయిని చేరే ఒక ముఖ్యమైన ప్రయాణంలో ఉంది" . "మేక్ ఇన్ ఇండియా", "ఇన్నోవేట్ ఇన్ ఇండియా" మరియు "డిస్కవర్ ఇన్ ఇండియా" వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జపాన్ వైద్య పరికరాల కంపెనీలను ఆహ్వానించారు. శ్రీ విశాల్ చౌహాన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి; మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1924610)
Visitor Counter : 189