గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎం.ఓ.హెచ్.యు.ఏ. కి చెందిన భారీ ప్రచారం - 'మేరీ-లైఫ్, మేరా స్వచ్ఛ్-షెహర్' ప్రారంభించడం జరిగింది.


~వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఆర్.ఆర్.ఆర్. ని అమలుచేయాలి - తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైకిల్ చేయడం~

Posted On: 15 MAY 2023 3:50PM by PIB Hyderabad

"ఈ లైఫ్ పదం అంటే 'పర్యావరణానికి జీవనశైలి'.   రోజుమనమందరం ఏకతాటిపైకి వచ్చి పర్యావరణం కోసం జీవనశైలిని ఒక ప్రచారంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.  ఇది పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలి వైపు ఒక సామూహిక ఉద్యమంగా మారుతుంది."

 

సి..పి.26 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

 

 

ఎం.ఓ.హెచ్.యు.ఏ. కి చెందిన భారీ ప్రచారం - 'మేరీ-లైఫ్మేరా స్వచ్ఛ్-షెహర్' ని ఎం.ఓ.హెచ్.యు.ఏ. కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి తో పాటు ఎం.ఓ.హెచ్.యు.ఏ. మరియు ఎం.ఓ.ఈ.ఎఫ్.సి.సి. కి చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి,  ఈ రోజు ప్రారంభించారు.

 

 

సాధారణ గృహోపకరణాల పునర్వినియోగం, అప్‌-సైక్లింగ్ అనేవి, భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం.  ఈ భాగస్వామ్య అలవాటు నుండి ఒక సూచనను తీసుకుంటూ, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) కి చెందిన ప్రచార శీర్షిక – మేరీ-లైఫ్మేరా స్వచ్ఛ్-షెహర్ వ్యర్థాల నిర్వహణలో ఆర్.ఆర్.ఆర్. ని అమలుచేయాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడం జరిగింది - తగ్గించడంపునర్వినియోగం చేయడంరీసైకిల్ చేయడం.  పునర్వినియోగం కోసం పౌరులు చురుకుగా పునరుద్ధరించే పాత వస్తువులతో వ్యర్థాల నుంచి 'సంపద' ను తయారు చేసే సూత్రాలను భారతదేశంలోని పట్టణ ప్రాంతాలు ఎక్కువగా అవలంబిస్తున్నాయి.   స్వచ్ఛ్-భారత్-మిషన్-అర్బన్ 2.0 కింద మొత్తం వ్యర్ధ-రహిత పర్యావరణ వ్యవస్థకు ఇది ఊపునిస్తోంది.

 

 

మూడు 'ఆర్' లు "వ్యర్ధాల నుంచి సంపద" ను సృష్టించడానికి, వెన్నెముకగా నిలుస్తాయి.  అనేక మంది హస్తకళాకారులు, రీసైక్లర్లు, స్వయం సహాయ బృందాలు, వ్యవస్థాపకులు, అంకురసంస్థలు మొదలైన వాటికి వ్యర్థాలను రీసైకిల్ చేయడానికి ఇవి సాధికారత నిచ్చాయి.  గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  యొక్క మిషన్-లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి) అనే ఆదర్శ కార్యక్రమం అదే దిశగా వ్యక్తిగత మరియు సామూహిక చర్యను మరింత ప్రోత్సహిస్తుంది.  మిషన్-లైఫ్ పర్యావరణాన్ని రక్షించడం, సంరక్షించడంతో పాటు, రోజువారీ జీవితంలో వ్యక్తిగత చర్యల ద్వారా పర్యావరణానికి అనుకూలంగా ప్రవర్తనలో సమకూరే మార్పును తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుంది.

 

 

పౌరులు తమ పాత బట్టలు, బూట్లు, పుస్తకాలు, బొమ్మలు, ప్లాస్టిక్‌ వస్తువులను తిరిగి ఉపయోగించడం లేదా రీసైకిల్ చేయడం కోసం, 'తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైకిల్ చేయడం' (ఆర్.ఆర్.ఆర్) కేంద్రాలు, అన్నీ ఒకే చోట సేకరించే కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నగరాలపై దృష్టి కేంద్రీకరించడం ఈ దేశవ్యాప్త ప్రచారం లక్ష్యం.

 

 

ఈ మూడు వారాల ప్రచారం ఎస్.బి.ఎం-యు 2.0 కింద పౌరుల సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది.  తగ్గించడం, పునర్వినియోగం చేయడం, రీసైకిల్ చేయడంతో పాటు, స్థిరమైన రోజువారీ అలవాట్లను అవలంబించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు పరిరక్షణ కోసం సమిష్టి చర్య తీసుకోవాలనే మిషన్ లైఫ్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఇది కృషి చేస్తుంది. 

 

 

ఆర్.ఆర్.ఆర్. కేంద్రాలు 2023 మే నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయి.  పౌరులు, సంస్థలు, వాణిజ్య సంస్థలు తాము ఉపయోగించని లేదా ఉపయోగించిన ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు, బూట్లు, పాదరక్షలు, పుస్తకాలు, ఆటబొమ్మలు మొదలైనవాటిని సేకరించడానికి ఈ కేంద్రాలు ఏకైక పరిష్కారంగా పనిచేస్తాయి.   సేకరించిన తర్వాత, ఈ వస్తువులు వివిధ వాటాదారులకు పునర్వినియోగం కోసం పునరుద్ధరించడం జరుగుతుంది, లేదా కొత్త ఉత్పత్తులుగా తయారు చేయడం జరుగుతుంది. ఆ విధంగా, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభుత్వ దృష్టిని నిజంగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు అవుతుంది. 

 

 

ఆర్‌.ఆర్‌.ఆర్. ఇతివృత్తం పై గీతం పోటీని కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు.  పోటీదారులు ఇతివృత్తం పై గీతాన్ని రాయవచ్చు, సంగీతాన్ని సమకూర్చవచ్చు, పాడవచ్చు, సమర్పించవచ్చు, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవచ్చు.  ఈ పోటీ మై-గౌవ్ వేదిక పై 2023 మే నెల 20వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. 

 

 

మేరీ లైఫ్మేరా స్వచ్ఛ్-షెహర్ ప్రచారం 2023 జూన్, 5వ తేదీన జీవితం కోసం ప్రతిజ్ఞ తో ముగుస్తుంది.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టడంతోపాటు, అన్ని నగరాల్లో పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.  

 

 

పౌరులు జీవితం కోసం ప్రతిజ్ఞ లో పాల్గొనడానికి మై గౌ వెబ్-సైట్ https://pledge.mygov.in/life-movement/ క్లిక్ చేయవచ్చు. 

 

 

*****


(Release ID: 1924418) Visitor Counter : 293