రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరణ
Posted On:
15 MAY 2023 2:00PM by PIB Hyderabad
ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి, అతను 06 డిసెంబర్ 1986న ఫైటర్ స్ట్రీమ్‌లో నియమించబడ్డాడు. అశుతోష్ దీక్షిత్ స్టాఫ్ కోర్స్, బంగ్లాదేశ్ మరియు నేషనల్ డిఫెన్స్ కాలేజీ, న్యూఢిల్లీలో గ్రాడ్యుయేట్. ఎయిర్ మార్షల్ ఒక క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ మరియు ప్రయోగాత్మక టెస్ట్ పైలట్, ఫైటర్, ట్రైనర్ మరియు ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 3300 గంటలకు పైగా ప్రయాణించిన అనుభవం ఉంది. ఆపరేషన్ సఫేద్ సాగర్, రక్షక్‌లో పాల్గొన్నారు. ఎయిర్ మార్షల్ దీక్షిత్ మిరాజ్ 2000 స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించాడు, ఇది పాశ్చాత్య సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్ ఫైటర్ బేస్. అలాగే ప్రీమియర్ ఫైటర్ ట్రైనింగ్ బేస్. అశుతోష్ దీక్షిత్ ఇంతకు ముందు ప్రిన్సిపల్ డైరెక్టర్ ఎయిర్ స్టాఫ్ రిక్వైర్‌మెంట్, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్స్) & అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్లాన్స్) ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశాడు. ఎయిర్ ఆఫీసర్ సదరన్ ఎయిర్ కమాండ్ యొక్క ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా కూడా ఉన్నారు. ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా ఉన్నారు.
***
(Release ID: 1924415)
Visitor Counter : 173