వ్యవసాయ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ బయోలాజికల్ కంట్రోల్ లాబొరేటరీని ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి
Posted On:
15 MAY 2023 4:58PM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తెలంగాణాలోని ఇంటిగ్రేటెడ్ బయోలాజికల్ కంట్రోల్ లాబొరేటరీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్ ఐ పీ హెచ్ ఎమ్) హైదరాబాద్ ను, 15 మే 2023న ప్రారంభించారు.
ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ పంటల్లో మితిమీరిన పురుగుమందుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను అధిగమించడంతోపాటు సాగు ఖర్చు తగ్గేందుకు, రైతు ఆదాయాన్ని పెంచేందుకు చీడపీడల నివారణకు బయోకంట్రోల్ వినియోగం అవసరమని ఉద్ఘాటించారు. ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కనీస సమాచారాన్ని అందుబాటులో ఉన్న రైతులకు చేరవేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. తద్వారా ఈ సాంకేతికతల ప్రయోజనాల గురించి వారికి నమ్మకం కలిగించవచ్చన్నారు. దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా విదేశీ మార్కెట్‌కు ఎగుమతి అవుతున్న సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులలో ఎటువంటి పురుగుమందుల అవశేషాలు ఉండకూడదని ఆయన ఉద్ఘాటించారు. నూతన సమగ్ర బయోకంట్రోల్ ల్యాబొరేటరీ ఎన్‌ఐపిహెచ్‌ఎం సిబ్బంది మరియు అధికారులందరినీ అభినందించిన ఆయన, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు తమను తాము పునరంకితం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ) కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా ఐఏఎస్, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు ఐఏఎస్, డాక్టర్ ప్రమోద్ కుమార్ మెహర్దా ఐఏఎస్, డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ అదనపు కార్యదర్శి డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, డైరెక్టర్ జనరల్ ఎన్ ఐ పీ హెచ్ ఎమ్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి సీనియర్ అధికారులు, ఐకార్ సంస్థలు, ట్రైనీ అధికారులు మరియు విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
కొత్త ఇంటిగ్రేటెడ్ బయో కంట్రోల్ లాబొరేటరీ (బీ సీ ల్యాబ్) ఎన్ ఐ పీ హెచ్ ఎమ్లోని అత్యాధునిక ప్రయోగశాల. జీవ కీటక నాశనులు, ప్రెడేటర్స్ మరియు పారాసిటోయిడ్స్ వంటి బయోకంట్రోల్ ఏజెంట్లు, ఎంటోమోపాథోజెనిక్ ఫంగైస్, బయో ఫెర్టిలైజర్స్, ఎన్ పీ వీ, ఫెరోమోన్ మరియు బొటానికల్స్ కోసం ఉత్పత్తి పద్ధతులపై అనుభవాన్ని అందించడానికి సౌకర్యాలు ఉన్నాయి. బయో-నియంత్రణ ఏజెంట్లు, జీవ-పురుగుమందులు మరియు జీవ-ఎరువుల వాడకం రసాయన పురుగుమందులు మరియు ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, పర్యవసానంగా పర్యావరణం మరియు మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది మరియు నేల మరియు మొక్కల ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. బీ సీ ల్యాబ్‌లో వ్యవసాయపరంగా ముఖ్యమైన కీటకాలు మరియు కలుపు మొక్కల నమూనాలను ఉత్తమంగా సంరక్షించబడిన లేదా ప్రత్యక్ష రూపంలో ప్రదర్శించడానికి కీటకాల మ్యూజియం, కలుపు మ్యూజియం, ప్రదర్శనశాల హాల్, సహజ సాగు విభాగం మొదలైనవి కూడా ఉంటాయి.
కొత్త ఇంటిగ్రేటెడ్ బయోకంట్రోల్ లాబొరేటరీ అత్యాధునిక పరికరాలతో అమర్చబడి ఉంది మరియు ల్యాబ్‌లు అధిక విద్యార్హత కలిగిన అధ్యాపక సిబ్బందిని కలిగి ఉన్నాయి. ఎన్ ఐ పీ హెచ్ ఎమ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ఆగ్రో ఎకోసిస్టమ్ అనాలిసిస్ (AESA) మరియు ఎకోలాజికల్ ఇంజనీరింగ్ (EE) వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను వివిధ బయోలాజికల్ ఏజెంట్లు, జీవకీటక నాశనులు మరియు సేంద్రియఎరువుల మెరుగైన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఎన్ ఐ పీ హెచ్ ఎమ్ వివిధ పంటలలో కీటక తెగుళ్లు మరియు వ్యాధుల నిర్వహణ యొక్క వివిధ అంశాలపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శిక్షణా కార్యక్రమాలకు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కే వీ కే లు, ఐకార్ సంస్థలు, విద్యార్థులు, రైతులు, డీ పీ పీ క్యు ఎస్ మరియు ప్రైవేట్ సంస్థల శాస్త్రవేత్తలు/విద్యావేత్తలు హాజరవుతారు.
ఎన్ ఐ పీ హెచ్ ఎమ్ అందించే అనేక సామర్ధ్య నిర్మాణ శిక్షణ లో మొక్క ఆరోగ్య సంరక్షణ యాజమాన్యం కు సంబంధించిన ముఖ్యమైనవి: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (పీ జీ డీ పీ హెచ్ ఎం), సేంద్రీయ వ్యవసాయంలో మొక్కల ఆరోగ్య నిర్వహణపై సర్టిఫికేట్ కోర్సు, వివిధ పంటలకు మంచి వ్యవసాయ పద్ధతులు (జీ ఏ పీ), మొక్కల పరాన్నజీవి నెమటోడ్‌ల క్షేత్ర నిర్ధారణ మరియు నిర్వహణ, సహజమూల ఉత్పత్తుల వినయోగం, వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తి, సేంద్రియ ఎరవులు మరియూ జీవకీటక నాసనులు కోసం ఉత్పత్తి ప్రోటోకాల్, ప్రిడేటర్స్ & పారాసిటాయిడ్‌ల కోసం ఉత్పత్తి ప్రోటోకాల్ (కీటకాల తెగుళ్లకు సహజ శత్రువులు), ఎంటోమోపాథోజెనిక్‌ల నెమటోడ్‌ల ఉత్పత్తి ప్రోటోకాల్, మిడతల నిర్వహణలో అధునాతన కీటక నివారణ యాజమాన్యం ప్రోటోకాల్, లోకస్‌వోజెనిక్స్ కలుపు నిర్వహణలో, సూక్ష్మజీవుల జీవ పురుగు మందుల నాణ్యత నియంత్రణ, మొక్కల పరాన్నజీవి నెమటోడ్‌లు మొదలైనవి.
భారతదేశంలో రసాయన రహిత సుస్థిర వ్యవసాయం అభివృద్ధిలో ఈ సదుపాయం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ సదుపాయం వ్యవసాయ మరియు ఉద్యాన పంటలలో తెగుళ్ల నిర్వహణ లో రసాయనేతర ఉత్పత్తులను ప్రోత్సహించడానికి విస్తరణ కార్యకర్తలకు సహాయం చేస్తుంది. శిక్షణ పొందిన అధికారులు ఆయా ప్రాంతాల్లోని రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి మరియు తెగుళ్ల నిర్వహణ కోసం పర్యావరణ అనుకూల పద్ధతుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరింత శిక్షణ ఇస్తారు. ఈ సదుపాయం దేశంలోని భూసార ఆరోగ్య యాజమాన్యం, సేంద్రీయ వ్యవసాయం మరియు సహజ వ్యవసాయ రంగంలో వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు మరియు రైతుల పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడుతుంది.
***
(Release ID: 1924332)
Visitor Counter : 207