రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణలో ఆత్మనిర్భరతః 928 వ్యూహాత్మక ముఖ్య లైన్ రీప్లెస్ మెంట్ యూనిట్లు (ఎల్ఆర్‌యులు)/ ఉపవ్యవస్థలు/ విడి భాగాలు & భాగాల 4వ పాజిటివ్ ఇండిజెనైజేషన్ లిస్ట్ (పిఐఎల్ - సానుకూల దేశీయీకరణ జాబితా)కు ఆమోదాన్నితెలిపిన రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఒడి)
Posted On:
14 MAY 2023 9:16AM by PIB Hyderabad
రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ను ప్రోత్సహించేందుకు, రక్షణ ప్రభుత్వ రంగ సంస్థల (డిపిఎస్‌యు) దిగుమతులను కనీస స్థాయికి తగ్గించేందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ రూ. 715 కోట్ల విలువైన దిగుమతి ప్రత్యామ్నాయంగా 928 వ్యూహాత్మక ముఖ్య లైన్ రీప్లెస్ మెంట్ యూనిట్లు (ఎల్ఆర్‌యులు)/ ఉపవ్యవస్థలు/ విడి భాగాలు & భాగాల 4వ పాజిటివ్ ఇండిజెనైజేషన్ లిస్ట్ (పిఐఎల్ - సానుకూల దేశీయీకరణ జాబితా)కు ఆమోదాన్ని తెలిపారు. ఈ సామాగ్రి వివరాలు శ్రిజన్ పోర్టల్ (https://srijandefence.gov.in/) పై అందుబాటులో ఉంటాయి. జాబితాలో సూచించిన కాలక్రమాన్ని అనుసరించి వీటిని భారతీయ పరిశ్రమల నుంచి సేకరిస్తారు.
వరుసగా డిసెంబర్ 2021, మార్చి 2022, ఆగస్టు 2022న ప్రచురించిన ఎల్ ఆర్‌యులు/ ఉప- వ్యవస్థలు/ కూర్పులు/ ఉప- కూర్పులు/ విడి భాగాలు & భాగాలతో కూడిన గత మూడు పిఐఎల్‌లకు నాలుగవ జాబితా కొనసాగింపు మాత్రమే. ఈ జాబితాలలో ఇప్పటికే దేశీయీకరణ చేసిన 2,500 వస్తువులు, 1,238 (351+107+780) వస్తువులను ఇచ్చిన కాలక్రమాలకు అనుగుణంగా దేశీయకరిస్తారు. మొత్తం 1,238, 310 వస్తువులను (తొలి పిఐఎల్- 262, రెండవ పిఐఎల్-11, మూడవ పిఐఎల్ -37) ఇప్పటివరకూ దేశీయీకరించారు.
ఈ వస్తువుల దేశీయీకరణను మేక్ వర్గం కింద, ఎంఎస్ఎంఇలు, ప్రైవేటు భారతీయ పరిశ్రమల సామర్ధ్యాల ద్వారా అంతర్గతంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశీయీకరణను చేపట్టి, ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి ఊతాన్ని ఇస్తూ రక్షణలో పెట్టుబడులను పెంచి, దిగుమతులపై డిపిఎస్‌యులు ఆధారపడడాన్ని తగ్గిస్తాయి. ఇందుకు అదనంగా, ఇది విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలను కలుపుకకొని దేశీయ రక్షణ పరిశ్రమ రూపకల్పన సామర్ధ్యాలను పెంపొందిస్తుంది.
నోటిఫై చేసిన వస్తువను సేకరించేందుకు డిపిఎస్‌యులు త్వరలోనే చర్యలను ప్రారంభించనుంది. ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఇఒఐలు -ఆసక్తి వ్యక్తీకరణ)/ ప్రతిపాదన కోసం విజ్ఞప్తి (ఆర్ఎఫ్‌పి) కోసం పరిశ్రమ ప్రత్యేకంగా ఇందుకోసమే రూపొందించిన శ్రీజన్ పోర్టల్ డాష్‌బోర్డ్ (https://srijandefence.gov.in/DashboardForPublic)లో శోధించి, పాలుపంచుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావచ్చు.
***
(Release ID: 1924063)
Visitor Counter : 222