మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సౌదీ అరేబియా హజ్ 2023 యాత్ర కు అడ్మినిస్ట్రేటివ్ మరియు మెడికల్ డిప్యూటేషన్‌ల శిక్షణ

Posted On: 13 MAY 2023 2:37PM by PIB Hyderabad

హజ్ 2023 కోసం కే ఎస్ ఏ లో హాజీలకు సేవ చేయడానికి ఎంపికైన డిప్యూటేషన్‌ల అడ్మినిస్ట్రేటివ్ మరియు మెడికల్ బృందానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన శిక్షణను మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు ప్రారంభించారు. ఈ శిక్షణ స్కోప్ కాంప్లెక్స్ సెంటర్, లోధి రోడ్, న్యూ ఢిల్లీ  లో నిర్వహించబడుతోంది. 

 

ఈ సంవత్సరం ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రధాన అంశాలు మరియు కొత్త కార్యక్రమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

 భారతదేశం మరియు కే ఎస్ ఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం మొత్తం హాజీల సంఖ్య 1.75 లక్షలు.

 

 బకెట్లు, బెడ్‌షీట్, సూట్‌కేస్ మొదలైనవాటిని తప్పనిసరిగా కొనుగోలు చేయడం వల్ల కలిగే అనవసరమైన ఖర్చులను తొలగించడం ద్వారా హజ్ ప్యాకేజీలో ఖర్చు తగ్గింపు చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి హజ్ యాత్రికుడికి ఎస్ ఆర్ 2100 అందించడం మరియు వారికి సౌలభ్యం కల్పించడం వంటి తప్పనిసరి నిబంధనను తొలగించడం. వారి అవసరాలకు అనుగుణంగా సౌదీ రియాల్‌ను పొందుతున్నారు.

 

 యాత్రికులకు వాస్తవ అవసరాలకు అనుగుణంగా ఫారెక్స్ పొందడంలో మరియు మొత్తం వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో సౌలభ్యాన్ని నిర్ధారించడంతోపాటు మొదటి సారిగా ఎస్ బీ ఐ ద్వారా ఇష్టపూర్వకమైన యాత్రికులకు ఫారెక్స్ మరియు ఫారెక్స్ కార్డ్  అత్యంత పోటీ ధరలకు నేరుగా అందిస్తారు.

 

 యాత్రికులను యాత్ర నుసులభతరం చేయడానికి గరిష్ట  ఎంబార్కేషన్ పాయింట్లు

 

 భారతదేశంలోని యాత్రికుల మెడికల్ స్క్రీనింగ్ కోసం హజ్ సమయంలో కే ఎస్ ఎ లో  టీకాలు మరియు ఆసుపత్రులు/డిస్పెన్సరీ సేవలలో ఎం ఓ హెచ్ & ఎఫ్ డబ్ల్యు మరియు అనుబంధ ఏజెన్సీల ప్రత్యక్ష ప్రమేయం.

 

 సమ్మిళితలో భాగంగా దివ్యాంగులు మరియు వృద్ధ యాత్రికుల కోసం హజ్ పాలసీలో ప్రత్యేక నిబంధనలతో  తగిన జాగ్రత్తలు

 

 మెహ్రం లేని మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు ఒంటరి మహిళలను అనుమతించడం ద్వారా మహిళా సాధికారతను సులభతరం చేయడం- అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి (4314).

 

 డిప్యూటేషన్ల ఎంపిక:

 

 339 మంది వైద్య నిపుణులు (173 మంది వైద్యులు మరియు 166 మంది పారామెడిక్స్), 29 గ్రే ఏ అధికారులతో సహా 129 మంది అడ్మినిస్ట్రేటివ్ విధుల కోసం మొత్తం 468 మంది డిప్యూటేషన్లు ఎంపికయ్యారు.

 

 468 మంది డిప్యూటేషన్లలో 129 మంది మహిళలు.

 

  డెప్యుటేషనిస్టులు ఎడ్మిన్ సీ ఏ పీ ఎఫ్  నుండి మాత్రమే ఎంపిక (మెరుగైన వృత్తి నైపుణ్యం మరియు కే ఎస్ ఏ యాత్రికులకు సహాయం కోసం.

 

 మొదటిసారిగా, మెడికల్ డిప్యూటేషన్‌ని ఎంపిక చేయడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ పాలుపంచుకుంది.

 

 ప్రతి రాష్ట్రం నుండి వచ్చే యాత్రికుల భద్రత సంరక్షణ చూసేందుకు ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్ర స్థాయి సమన్వయకర్త.

 

 ఏ హెచ్ ఓ లు మరియు హెచ్ ఏ లు 300 నుండి 108 వరకు తగ్గించబడ్డాయి.  మరియు వారిలో 100% మంది ఐ పీ ఎస్ అధికారులు లేదా సీ ఏ పీ ఎఫ్ నుండి వచ్చినవారు.

 

 డిప్యూటేషన్ల కోసం మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడింది.

***



(Release ID: 1923990) Visitor Counter : 151