ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్థానికులకు మెరుగైన అనుభవాన్ని కల్పించేందుకు ఆధార్ ఆపరేటర్ల సామర్ధ్య నిర్మాణాన్ని పెంపొందిస్తున్న యుఐడిఎఐ
ఈ ఏడాదిలో 100కు పైగా వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు
Posted On:
11 MAY 2023 2:45PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది ఆధార్ ఆపరేటర్ల సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు సామర్ధ్య నిర్మాణ డ్రైవ్‌ను భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యుఐడిఎఐ) ప్రారంభించింది.
నమోదు, తాజాపరచడం, ధ్రువీకరణ ప్రక్రియల సందర్భంలో ఆపరేటర్ స్థాయిలో లోపాలను తగ్గించేందుకు ఆధార్ పర్యావరణ వ్యవస్థ విధానాలు/ పద్ధతులలో తెచ్చిన తాజా మార్పుల గురించి ఆపరేటర్లకు అవగాహనను కల్పించడం ద్వారా ఈ పర్యావరణ వ్యవస్థను ఈ ప్రయోగం బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా, ఇది స్థానికుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
గత కొద్దది నెలల్లో ఈశాన్య రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటికే దాదాపు రెండు డజన్ల శిక్షణా సెషన్లను ఈ చొరవలో భాగంగా యుఐడిఎఐ నిర్వహించింది. ఆపరేటర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ, నమోదు, తాజా పరచడం, ధ్రువీకరణలకు జవాబుదారీ కనుక వారికి ప్రక్రియలు, మార్గదర్శకాలు, విధానాల గురించి స్పష్టమైన అవగాహన ఉండడం తప్పనిసరి.
ఈ శిక్షణా సెషన్లు దాదాపు 3, 500 మంది ఆపరేటర్లు, మాస్టర్ ట్రైనర్లకు నమోదు, తాజా పరచడం, ధ్రువీకరణ ప్రక్రియల గురించి నవీన పరిజ్ఞానాన్ని కల్పించారు. వారు ఈ పరిజ్ఞాన వ్యాప్తి, తాము సంపాదించిన సమాచారాన్ని మరింత విస్తరించే ప్రక్రియను వారు ప్రారంభించగలరు.
అంతేకాకుండా, ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వ్యాప్తంగా 100కు పైగా అటువంటి పూర్తి రోజు సెషన్లను యుఐడిఎఐ నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా నమోదు/ తాజా పరిచే కేంద్రాలలో పౌరులు/ స్థానికులకు మరింత మెరుగైన, సౌహార్ద్రతతో కూడిన అనుభవాన్ని ఇచ్చేందుకు భాగస్వాములకు ఆధార్ పర్యావరణ వ్యవస్థ, ప్రవర్తనా మార్పుపై గల స్పష్టమైన పరిజ్ఞానం తోడ్పడుతుంది.
***
(Release ID: 1923439)
Visitor Counter : 175