విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పవర్ గ్రిడ్ ఆరా సబ్-స్టేషన్ సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర విద్యుత్, ఎన్ఆర్ఈ మంత్రి శ్రీ ఆర్.కే. సింగ్


నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడడానికి, బలమైన విద్యుత్ మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంతం ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడానికి సబ్-స్టేషన్‌ సామర్థ్యం పెంపు: శ్రీ ఆర్.కే. సింగ్

Posted On: 10 MAY 2023 4:17PM by PIB Hyderabad

గౌరవ కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కే. సింగ్ 220/132 కేవీ పవర్ గ్రిడ్ ఆరా సబ్ స్టేషన్ సామర్త్యాన్ని పెంచే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బీహార్ ఇంధన శాఖ మంత్రి శ్రీ బిజేంద్ర ప్రసాద్ యాదవ్, ఆరా ఎమ్మెల్యే శ్రీ అమరేంద్ర ప్రతాప్ సింగ్, బర్హరా ఎమ్మెల్యే శ్రీ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సందేశ్ ఎమ్మెల్యే శ్రీమతి కిరణ్ దేవి, ఎమ్మెల్సీ శ్రీ అవధేష్ నారాయణ్ సింగ్, ఆరా మేయర్ శ్రీమతి ఇందు దేవి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆరా డిప్యూటీ మేయర్ శ్రీమతి  పూనమ్ దేవి, పవర్‌గ్రిడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె. శ్రీకాంత్, సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. పవర్‌గ్రిడ్ ఆరా సబ్‌స్టేషన్‌ని పెంచడం వల్ల సబ్‌స్టేషన్ మొత్తం పరివర్తన సామర్థ్యాన్ని 560 ఎంవిఎకు పెంచుతుంది.

 

ఈ సందర్భంగా శ్రీ ఆర్.కె.సింగ్ మాట్లాడుతూ, ఈ చొరవ ఆరాలో అభివృద్ధి వేగాన్ని పెంచుతుందని, బలమైన విద్యుత్ మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఊతం ఇస్తుందని అన్నారు. “ఈ ప్రాజెక్టు వల్ల అరాలో రాబోయే 10 సంవత్సరాలకు విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి దోహదపడుతుంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా ప్రాంతం పారిశ్రామిక,  వాణిజ్య అభివృద్ధికి దారి తీస్తుంది. భోజ్‌పూర్, బక్సర్, రోహతాస్ జిల్లాల్లో విద్యుత్ లభ్యతను మెరుగుపరుస్తుంది. ఇది జాతీయ గ్రిడ్‌తో అరా కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తుంది” అని శ్రీ సింగ్ తెలిపారు.

భోజ్‌పూర్‌లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్నాన ఘాట్, పిసిసి రోడ్డు, కమ్యూనిటీ హాల్, కల్వర్టు, సరిహద్దు గోడ, రిటైనింగ్ వాల్ వంటి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ పనులు పవర్‌గ్రిడ్ ద్వారా చేపట్టారు. పాఠశాలల్లో బెంచ్‌ డెస్క్‌ ఏర్పాటు, హైమాస్ట్‌ లైట్‌, మరుగుదొడ్ల నిర్మాణం తదితరాలు కూడా సీఎస్‌ఆర్‌ కింద ఏర్పాటయ్యాయి. పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యాపారంతో పాటు భారత ప్రభుత్వానికి చెందిన ఒక మహారత్న పి ఎస్ యూ పవర్ గ్రిడ్ - ట్రాన్స్‌మిటింగ్ పవర్, ట్రాన్స్‌ఫార్మింగ్ లైవ్స్ అనే నినాదంతో బహుళ సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జీవితాలను ప్రభావితం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

 

*****


(Release ID: 1923289)