ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సాంస్కృతిక మంత్రిత్వశాఖ కొలాబరేషన్తో యువ ప్రతిభ–గాన ప్రతిభా పోటీలను నిర్వహిస్తున్న మైగవ్

Posted On: 09 MAY 2023 4:18PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా  వివిధ సంగీత విభాగాలలో
నూతన యువ ప్రతిభను గుర్తించి, జాతీయ స్థాయిలో భారతీయ సంగీతాన్ని క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు
మైగవ్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ సహకారంతో యువ ప్రతిభ పేరుతో 2023 మే 10 బుధవారం రోజున పాటల ప్రతిభా పోటీలను ప్రారంభిస్తోంది..

ఈ పోటీలలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఒకటిన్నర నెల రోజులు అవకాశం కల్పిస్తారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత తమ సంగీత ప్రతిభను నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు
ఈ గాన పోటీలు అద్భుత అవకాశాన్నిఅందించనున్నాయి. పాటలు పాడడంలో, సంగీతంలో గొప్ప కళాకారుడు
 కావాలనుకునే వారు అందరూ ఈ  యువప్రతిభ గాన , సంగీత ప్రతిభా పోటీలలో పాల్గొనవచ్చు. ఇందులో
జానపద గీతాలు
దేశభక్తి గీతాలు
సమకాలీన గీతాలు పాడవచ్చు.

ఎలా పాల్గొనాలి:
1. https://innovateindia.mygov.in/ లో లాగ్ ఇన్ కావాలి.
2. భారత దేశ పౌరులు ఈ పోటీలలో పాల్గొనేందుకు అర్హులు.
3.అన్ని ఎంట్రీలను మైగవ్ పోర్టల్ ద్వారా సమర్పించాలి. ఇతర విధాలుగా సమర్పించే ఎంట్రీలను పరిగణనలోకి తీసుకోరు.
ఇందులో పాల్గొనేవారు తాము పాడేటపుడు తీసిన వీడియో రికార్డును యూట్యూబ్ ద్వారా (అన్ లిస్టెడ్ లింక్), గూగుల్ డ్రైవ్, డ్రాప్బాక్స్ తదితరాల ద్వారా పంపాలి. ఈ లింక్ యాక్సెస్ అయ్యే విధంగా ఉండాలి.
4. యాక్సెస్ లేని ఎంట్రీలను అనర్హతగా పరిగణిస్తారు.
5. పోటీలు హిందీ, ఇంగ్లీషులో ఉంటాయి.
6.ఒకరు ఒక పోటీలోనే పాల్గొనాలి.
7. న్యూఢిల్లీలో జరిగే ఫైనల్ (ఫిజికల్ ఈవెంట్లో) అత్యంత ప్రతిభ కనబరిచిన ముగ్గురు విజేతల పేర్లను వెల్లడిస్తారు.

రివార్డు, గుర్తింపు:
ప్రథమ బహుమతి విజేతకు రూ 1,50,000+ ట్రోఫీ + సర్టిఫికేట్
ద్వితీయ బహుమతి విజేతకు రూ 1,00,000 + ట్రోఫీ + సర్టిఫికేట్
తృతీయ బహుమతి విజేతంకు రూ 50,000 + ట్రోఫీ + సర్టిఫికేట్ బహుకరిస్తారు.
తదుపరి 12 మంది విజేతలకు ఒక్కొక్కరికి  రూ 10,000 వంతున నగదు బహుమతి అందజేస్తారు.

మెంటార్షిప్ :  అత్యున్నత ప్రతిభ కనబరిచిన తొలి ముగ్గురు విజేతలకు నెల రోజులపాటు మెంటార్షిప్ స్టయిఫండ్ ఇస్తారు.
భారతదేశ పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పోటీలలో పాల్గొనాల్సిందిగా మై గవ్ ఆహ్వానిస్తోంది. ఈ పోటీలలో పాల్గొనడం ద్వారా  జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు పొందాల్సిందిగా కోరింది.
మరిన్ని వివరాలకు చూడండి Visit https://innovateindia.mygov.in/singing-challenge/(Release ID: 1923021) Visitor Counter : 136