సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
మాల్దీవులు, బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల సామర్థ్యాలను పెంచే 3 కార్యక్రమాలను ప్రారంభించిన ఎన్‌సిజిజి
బంగ్లాదేశ్‌లోని 1,800 మంది, మాల్దీవులకు చెందిన 1,000 మంది ప్రభుత్వాధికారులకు మిషన్ మోడ్‌లో శిక్షణ ఇస్తున్న ఎన్‌సిజిజి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వసుధైవ కుటుంబం’ , ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాలకు అనుగుణంగా ఎన్‌సిజిజి కార్యక్రమం
పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి సాంకేతికతను ఉపయోగించడం ద్వారా
వేగం, ఒక స్థాయితో పని చేయాలని అధికారులకు సూచించిన డీజీ శ్రీ భరత్ లాల్
లీకేజీలను నిరోధించడానికి, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక బలమైన పాలనా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడంలో అధికారులకు అవగాహన కల్పించిన ఎన్‌సిజిజి డీజీ
Posted On:
09 MAY 2023 1:23PM by PIB Hyderabad
నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి) స్కేల్-అప్ కార్యకలాపాలతో, బంగ్లాదేశ్ (45 మంది పాల్గొనే 59వ బ్యాచ్), మాల్దీవులు (50 మంది పాల్గొనేవారితో 22వ & 23వ బ్యాచ్) ప్రభుత్వోద్యోగుల కోసం మూడు కెపాసిటీ-బిల్డింగ్ ప్రోగ్రామ్‌లు (సీబీపీలు) ముస్సోరీ క్యాంపస్ లో ప్రారంభమయ్యాయి. దీని ముందు మే 6న బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్‌ల కోసం 58వ సీబీపీ విజయవంతంగా పూర్తయింది. దేశీయ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పౌర సేవకుల కోసం ఎన్ సి జి జి, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, పౌర-కేంద్రీకృత ప్రభుత్వ విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు. పాలన, చివరి వ్యక్తిని చేరుకోవడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచడానికి మెరుగైన సేవలను అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన ‘వసుధైవ కుటుంబం’ ఆలోచన విధానానికి అనుగుణంగా భారతదేశం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పౌర సేవకుల మధ్య సహకారాన్ని, అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి ఎన్‌సిజిజి అంకితం అయిందని అన్నారు. సంక్లిష్టమైన, సవాలుతో కూడిన సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన నైపుణ్యాలతో ఈ పౌర సేవకులను సన్నద్ధం చేయడం దీని లక్ష్యం. ఇంటెన్సివ్ 2-వారాల కార్యక్రమం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సాధనాలు, సుపరిపాలన ఉత్తమ అభ్యాసాలతో వారి పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను నవీకరించడానికి వారికి సహాయపడుతుంది.
తన ప్రారంభోపన్యాసంలో, ఎన్‌సిజిజి డైరెక్టర్ జనరల్ శ్రీ భరత్ లాల్, ప్రజలు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడంలో సహాయపడే వ్యక్తులుగా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. వేగంతో, స్థాయిలో పని చేయడం, పౌరులకు ప్రపంచ స్థాయి ప్రాథమిక సేవలను సకాలంలో అందించడంపై ఆయన నొక్కి చెప్పారు. ప్రాథమిక సేవలను అందజేస్తూనే, పౌరుల అవసరాలు, ప్రాధాన్యతలను అంచనా వేయడానికి, వినడానికి, స్వీకరించడానికి పౌర సేవకులు వ్యూహాత్మకంగా, వినూత్నంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
'వసుదైవ కుటుంబం' అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనా విధానాన్ని ప్రస్తావిస్తూ, సులభతర జీవన విధానాన్ని పెంపొందించడానికి కలిసి పనిచేయడం గురించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు వైద్య సామాగ్రి, వ్యాక్సిన్‌లతో భారతదేశం పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచంలోని చాలా పెద్ద సంఖ్యలో దేశాలకు సహాయం చేయడం ప్రధాని ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అదేవిధంగా, భారత పౌరులు కూడా నిమిషాల్లో ఉచిత టీకాను పొందగలిగారని, 7 - 8 నెలల్లో 2 బిలియన్ల కంటే ఎక్కువ మోతాదులను అందించగలిగామని ఆయన తెలిపారు. ఇది భారతదేశం సాంకేతిక పరాక్రమంతో సాధించిన గొప్ప విజయమని ఆయన తెలిపారు. భారతదేశం కూడా తన పౌరులకు సహాయం చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుందని చెప్పారు . ఆన్‌లైన్ రైల్వే టికెటింగ్ సిస్టమ్‌లు, పెన్షన్‌లు, స్కాలర్‌షిప్‌ల ఆన్‌లైన్ చెల్లింపు, పాస్‌పోర్ట్ సేవలు, సమయాన్ని ఆదా చేయడం, సామర్థ్యాన్ని తీసుకురావడం, అవినీతిని నిర్మూలించడంలో గేమ్ ఛేంజర్‌గా ఉన్న ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జిఈఎం) గొప్ప ఉదాహరణలని డీజీ పేర్కొన్నారు.
ప్రతి ప్రజాస్వామ్య దేశంలో తమ ప్రభుత్వాల నుండి పౌరుల అంచనాలు పెరుగుతున్నాయని, అందువల్ల వారి అంచనాలను అందుకోవడానికి ఒక వ్యవస్థను అభివృద్ధి చేయడం, సమర్థవంతమైన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను కోరారు. లీకేజీలు గత చరిత్రగా మారాయని, స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు, వేతనాలు మొదలైనవాటిని లీకేజీ లేకుండా కొన్ని నిమిషాల్లో ఎలా చెల్లిస్తారో ప్రసవిస్తూ, ఒక బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా 12 కోట్ల మందికి పైగా భారతీయ రైతుల బ్యాంకు ఖాతాలకు సబ్సిడీలను బదిలీ చేయడం గురించి కూడా ఆయన మాట్లాడారు.
అరమరికలు, అడ్డంకులు లేని పాలనా వ్యవస్థ గురించి మాట్లాడుతూ, 2019లో ప్రధానమంత్రి ప్రకటించిన జల్ జీవన్ మిషన్ ప్రణాళిక, అమలును కూడా ఉదహరించారు. ప్రతి గ్రామీణ ఇంటికి, అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు మొదలైన వాటికి స్వచ్ఛమైన కుళాయి నీటిని అందించడానికి ఐదేళ్లలో కృషి జరిగిందని తెలిపారు. పథకం ప్రకటించిన సమయంలో మొత్తం 194 మిలియన్ల కుటుంబాలలో 32 మిలియన్లకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. వేగవంతమైన ప్రక్రియను అమలు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు ఒక బృహత్తర స్థాయిలో పని చేయడంతో ఇప్పుడు 120 మిలియన్ల గ్రామీణ కుటుంబాలు తమ ఇళ్లలో స్వచ్ఛమైన కుళాయి నీటి సరఫరా అందగలిగిందని ఆయన వివరించారు. సాంకేతికత వినియోగంతో, ఉజ్వల కింద వంటగ్యాస్ 96 మిలియన్ల కుటుంబాలకు అందించగలిగామని, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 115 మిలియన్ల కుటుంబాలకు మరుగుదొడ్లు ఇవ్వగలిగామని తెలిపారు. ఇది ప్రజల జీవన నాణ్యతను శాశ్వతంగా మార్చివేస్తుంది చెప్పారు. ప్రజలకు సమర్ధవంతంగా సేవలందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఇరు దేశాల ప్రభుత్వ అధికారులకు ఆయన కోరారు. ఎన్‌సిజిజిలో వారి అభ్యాసాల ఆధారంగా వివిధ సమస్యలను చర్చించి, వారి దేశంలో అమలు చేయడానికి ఆలోచనలపై పని చేయాలని కూడా ఆయన పాల్గొనేవారికి సూచించారు.
ఎన్‌సిజిజిని 2014లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక అత్యున్నత స్థాయి సంస్థగా ఏర్పాటు చేసింది. ఎన్‌సిజిజి మాల్దీవుల సివిల్ సర్వీసెస్ కమిషన్‌తో 2024 నాటికి 1,000 మంది పౌర సేవకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, 2025 నాటికి 1,800 మంది పౌర సేవకుల కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు, మాల్దీవులకు చెందిన 685 మంది అధికారులు ఎన్‌సిజిజి లో శిక్షణ పొందారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) భాగస్వామ్యంతో ఎన్‌సిజిజి వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాల పౌర సేవకుల సామర్థ్యాలను పెంపొందించే బాధ్యతను చేపట్టింది. ఇప్పటివరకు, 15 దేశాల నుండి 3,500 మంది ప్రభుత్వ అధికారులకు శిక్షణనిచ్చింది. బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, భూటాన్, మయన్మార్, నేపాల్, కంబోడియా నుండి వీరు పాల్గొన్నారు. ఈ శిక్షణల్లో పాల్గొన్న వివిధ దేశాల అధికారులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే, ఎన్‌సిజిజి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంపొందించడంలో పాలుపంచుకుంది. ఈ ప్రోగ్రామ్‌ల కోసం ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుండడంతో ఎంఈఏ కోరుకున్నట్లుగా, డిమాండ్ పెరుగుతున్నందున మరిన్ని దేశాల నుండి అధిక సంఖ్యలో పౌర సేవకులకు వసతి కల్పించడానికి ఎన్‌సిజిజి తన సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. 2021-22లో, ఎన్‌సిజిజి 8 కార్యక్రమాలను నిర్వహించింది. 236 ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇది 2022-23లో మూడు రెట్లు పెరిగింది. ఎన్‌సిజిజి 23 కార్యక్రమాలను నిర్వహించింది. 736 మంది పౌర సేవకులు హాజరయ్యారు. 2023-24 సంవత్సరానికి, ఎన్‌సిజిజి ఈ కార్యక్రమాన్ని 3 రెట్లు పెంచడానికి ప్రణాళిక వేసింది. 2,130 మంది అధికారులకు అవకాశం కలిపించే వీలుగా ఇటువంటి 55 కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ శిక్షణ లో ఎన్‌సిజిజి దేశంలో పాలనలో నమూనాను మార్చడం, నదుల పునరుజ్జీవనం ముఖ్యంగా గంగా నది ప్రక్షాళన, డిజిటల్ సాంకేతికతను పెంచడం: మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ కేస్ స్టడీ వంటి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒక సాంకేతిక, చారిత్రక, సామాజిక, పర్యాటక ప్రాజెక్ట్, భారతదేశంలో విధాన రూపకల్పన, వికేంద్రీకరణ రాజ్యాంగ పునాది, పబ్లిక్ కాంట్రాక్ట్‌లు, విధానాలు, పబ్లిక్ పాలసీ అమలు, ఎన్నికల నిర్వహణ, ఆధార్: సుపరిపాలన సాధనం, డిజిటల్ గవర్నెన్స్: పాస్‌పోర్ట్ కేస్ స్టడీస్ సేవ & మడాద్, ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఇండియా ఉమంగ్, తీర ప్రాంతానికి ప్రత్యేక సూచనలతో విపత్తు నిర్వహణ, పరిపాలనలో నీతి, ప్రాజెక్ట్ ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ - జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకం: విజిలెన్స్ పరిపాలన, అవినీతి నిరోధక వ్యూహాలు తదితర అంశాలను ఈ శిక్షణలో కూలంకషంగా వివరించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని ప్రధానమంత్రి సంగ్రహాలయ, పార్లమెంట్ కు కూడా క్షేత్ర స్థాయి పరిశీలనకు తీసుకువెళతారు. శిక్షణ బృందంలోని ఇతర సభ్యులతో పాటు డాక్టర్ అశుతోష్ సింగ్, డా. బి. ఎస్. బిస్త్, డాక్టర్ సంజీవ్ శర్మతో సహా కోర్సు సమన్వయకర్తలు మొత్తం సీబీపీని పర్యవేక్షిస్తారు.
.
<><><><><>
(Release ID: 1923014)
Visitor Counter : 111