భారత ఎన్నికల సంఘం
ఎన్నికల వ్యయ నియంత్రణ పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి కర్ణాటక ఎన్నికల్లో భారీగా నగదు స్వాధీనం
నిఘా పెరగడంతో నాలుగు రెట్లు పెరిగిన స్వాధీనం చేసుకున్న నగదు
కర్ణాటక ఎన్నికల్లో ఇంతవరకు 375 కోట్ల రూపాయల నగదు స్వాధీనం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లోకి వచ్చిన తర్వాత 288 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు జప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
నిఘా, పర్యవేక్షణ కోసం 146 మంది వ్యయ పరిశీలకుల నియామకం
వ్యయపరంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాలు సున్నిత నియోజకవర్గాలుగా గుర్తింపు
Posted On:
09 MAY 2023 1:25PM by PIB Hyderabad
ప్రలోభాలకు తావు లేకుండా కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగేలా చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. గత కొన్ని శాసనసభ ఎన్నికల్లో ప్రారంభించిన చర్యలను ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల్లో కొనసాగిస్తోంది. ఎన్నికల సంఘం పర్యవేక్షణ పెరగడంతో 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే ప్రస్తుత ఎన్నికల్లో నాలుగు రెట్లు అధికంగా నగదు, మద్యం, ఆభరణాలు, మాదకద్రవ్యాల లాంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల సహకారం, వివిధ ప్రభుత్వ సంస్థలు సమన్వయం తో పని చేయడంతో కఠిన పర్యవేక్షణ సాగుతోంది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు ( 08.05.2023 నాటికి) కింది విధంగా ఉన్నాయి.
ఉన్నాయి:
నగదు
|
మద్యం
|
డ్రగ్స్
|
ఆభరణాలు
|
ఉచితాలు
|
స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు 08.05.2023 నాటికి
|
2018 అసెంబ్లీ ఎన్నికలలో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు
|
(రూ. కోట్లలో )
|
పరిమాణం (లీటర్లు)
|
విలువ (రూ. కోట్లలో )
|
విలువ (రూ. కోట్లలో )
|
విలువ (రూ. కోట్లలో )
|
విలువ (రూ. కోట్లలో )
|
(రూ. కోట్లలో )
|
(రూ. కోట్లలో )
|
147.46
|
2227045
|
83.66
|
23.67
|
96.60
|
24.21
|
375.61
|
83.93
|
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు ఎన్నికల సంఘం మార్చి నెల 2వ వారంలో కర్ణాటకలో పర్యటించింది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు సమీక్షించిన ఎన్నికల సంఘం అధికారులు వివిధ కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం సాధించడం సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలను చర్చించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడా చర్చలు జరిపారు. కర్ణాటక ఎన్నికల వివరాలు ప్రకటించిన సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓటర్లను ప్రలోభ పరచడానికి చర్యలు అమలు జరగకుండా చూస్తామన్నారు. ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు నిఘా, పర్యవేక్షణ పెంచుతామని శ్రీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. గతంలో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో అమలు చేసిన చర్యలను కర్ణాటకలో కూడా కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం కర్ణాటకలో అమలు చేస్తున్న ప్రణాళిక ఆశించిన ఫలితాలను ఇస్తోంది. నిఘా, పర్యవేక్షణ పెంచడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లోకి వచ్చిన అనంతరం కర్ణాటకలో ఓటర్లను లోబరుచుకోవడానికి సిద్ధం చేసిన 375. 61 కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికలతో పోల్చి చూస్తే స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. మార్చి 2వ వారంలో జరిగిన కమిషన్ పర్యటన నుంచి ఇంతవరకు నిఘా సంస్థలు 83.78 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 288 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేశాయి.
.
బెంగళూరులో స్వాధీనం చేసుకున్న మద్యం -కోలార్ జిల్లా బంగారుపేట ఏసీలో భారీగా స్వాధీనం చేసుకున్న నగదు
కోలార్ జిల్లాలోని బంగారుపేట ఏసీలో రూ. 4.04 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడం, హైదరాబాద్‌లోని ఆల్‌ప్రోజోలమ్‌ను అక్రమంగా తయారు చేస్తున్న ల్యాబ్‌పై ఇంటెలిజెన్స్ సేకరించిన దాడి మరియు ఎన్‌సీబీ ద్వారా ట్రయల్ మ్యాపింగ్ చేయడం వంటి ముఖ్యమైన మోసాలు ఉన్నాయి; బీదర్ జిల్లాలో 100 కిలోల గంజాయి స్వాధీనం; అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున మద్యం సీజ్‌లు జరిగాయి. ఖర్చుల పర్యవేక్షణ యొక్క మరొక అద్భుతమైన లక్షణం ఉచితాలను భారీగా స్వాధీనం చేసుకోవడం. కల్బుర్గి, చిమంగ్లూర్ తదితర జిల్లాల్లో చీరలు, ఆహారపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బైల్‌హొంగల్ మరియు కుణిగల్ మరియు ఇతర ఏసీల నుండి భారీ సంఖ్యలో ప్రెషర్ కుక్కర్లు మరియు వంటగది ఉపకరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
బీదర్ జిల్లాలోని గాంధీ గంజ్ పీఎస్ పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయి బెళగావి జిల్లా బైల్‌హోంగల్ ఏసీలో స్వాధీనం చేసుకున్న ప్రెషర్ కుక్కర్లు
సవదత్తి ఏసీలోని ఓ గోడౌన్‌లో స్వాధీనం చేసుకున్న 1000కు పైగా కుట్టు మిషన్లు
ఎన్నికల ప్రకటన వెలువడక ముందు నుంచే విస్తృతమైన పర్యవేక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు సమీక్షించిన ఎన్నికల సంఘం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, డీఈఓలు/ఎస్పీలు, అనుభవజ్ఞులైన అధికారులను వ్యయ పరిశీలకులు గా నియమించిన, సున్నిత నియోజకవర్గాలను గుర్తించి వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం సాధించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి అవసరమైన బృందాలను సిద్ధం చేసిన కమిషన్ 146 వ్యయ పరిశీలకులను నియమించింది. 81 అసెంబ్లీ నియోజకవర్గాలను కట్టుదిట్టమైన నిఘా కోసం వ్యయ సున్నిత నియోజకవర్గాలుగా గుర్తించింది.
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా శాంతిభద్రతల పరిస్థితి, అంతర్ రాష్ట్ర నిఘాను కూడా కమిషన్ మే 1, 2023న సమీక్షించింది. సమీక్షకు అన్ని సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల కార్యదర్శులు, డీజీపీ లు, ఎక్సైజ్ కమిషనర్లు, ప్రాంతీయ అధిపతులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈసీ శ్రీ రాజీవ్ కుమార్ సరిహద్దు జిల్లాల్లోని 185 చెక్‌పోస్టులలో సరైన నిర్వహణ, పర్యవేక్షణ ప్రాధాన్యత వివరించి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎన్నికల కమిషనర్ శ్రీ అనూప్ చంద్ర పాండే అక్రమ మద్యం స్వాధీనం చేసుకునే అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకుని , అక్రమ మద్యం నిల్వలు లేకుండా చూడాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిఘా ఉండాలని, జప్తు ఆపరేషన్ల తర్వాత నిబంధనలు పాటించాలని ఎన్నికల కమిషనర్ శ్రీ అరుణ్ గోయెల్ అధికారులను కోరారు. సరిహద్దు చెక్‌పోస్టుల నుండి దాదాపు 70 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, మద్యం, డ్రగ్స్, ఆభరణాలు, ఉచితంగా పంచి పెట్టడానికి తరలిస్తున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు నిరోధక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి. రాష్ట్ర పోలీస్, ఆదాయపు పన్ను, వాణిజ్య పన్ను, ఈడీ, ఆర్ఫీఎఫ్, జిఆర్ఫీ, సిఐఎస్ఎఫ్, ఎన్సీబి, సిఐఎఫ్ఎఫ్,డిఆర్ఐ సహా వివిధ సంస్థలు నిఘా, జప్తు కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఉచితాలు, ప్రలోభాలకు దూరంగా ఉండాలని ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి.
ఓటర్లు ఉచితాలను ఆమోదించడాన్ని నిరుత్సాహపరిచేందుకు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అవగాహన పోస్టర్
***
(Release ID: 1922834)
Visitor Counter : 216