శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఉన్నత స్థాయి సంయుక్త సమావేశం: అన్ని సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సంయుక్తంగా మే 11వ తేదీన జరుపుకోనున్న జాతీయ సాంకేతిక దినోత్సవం


కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ అజయ్ కుమార్ సూద్, సైన్స్ & టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సిఎస్ఐఆర్, ఎర్త్ సైన్సెస్, స్పేస్, అటామిక్ ఎనర్జీతో సహా ఆరు సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు

Posted On: 08 MAY 2023 12:13PM by PIB Hyderabad

సమిష్టి పని విధానాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ శాస్త్రీయ అంశాల ఆలోచనా పరంపరలను ఒకే తాటిపైకి తేవాలని కేంద్రం సంకల్పించింది. దీనిలో భాగంగానే ఆయా విభాగాల ఉమ్మడి సమావేశానికి  కేంద్ర సైన్స్ & టెక్నాలజీ (స్వతంత్ర బాధ్యత); ఎర్త్ సైన్సెస్; పీఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన సైన్స్, టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సిఎస్ఐఆర్, ఎర్త్ సైన్సెస్, స్పేస్, అటామిక్ ఎనర్జీతో సహా సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఉన్నత స్థాయి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సంవత్సరం అన్ని సైన్స్ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సంయుక్తంగా 2023 మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాయని కేంద్ర మంత్రి చెప్పారు.

ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన మొత్తం ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఉందని, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయడంపై ఎప్పటికప్పుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో మే 11న జరుపుకునే జాతీయ సాంకేతిక దినోత్సవంలో మన దేశంలో సాంకేతిక రంగంలో టెక్ దిగ్గజాలు, పరిశోధకులు, ఇంజనీర్ల విజయాలను ప్రముఖంగా ప్రస్తావన ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరం, జాతీయ సాంకేతిక దినోత్సవం ఇతి వృత్తం  “అటల్ టింకరింగ్ ల్యాబ్స్”, ఇది 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాఠశాల, బోధనా సంస్థల స్థాయిలో జోక్యం ద్వారా ఇన్నోవేషన్ స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను రూపొందించడానికి, ప్రోత్సహించడానికి చేపట్టిన మార్గనిర్దేశక కార్యక్రమం యువకులలో మరింత ఉత్సాహాన్ని నింపనున్నది.  

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన గొప్ప సంస్కరణల వల్ల గత 9 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పురోగతిలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని మంత్రి ఉద్ఘాటించారు. శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల కృషిని అభివృద్ధి చోదకులుగా గుర్తించడానికి జాతీయ సాంకేతిక దినోత్సవం సరైన సందర్భమని ఆయన అన్నారు.

మే 11న నిర్వహించనున్న జాతీయ సాంకేతిక దినోత్సవ సన్నాహాల సమీక్షతో పాటు, నేటి సమావేశంలో అజెండాగా అవార్డుల హేతుబద్ధీకరణ, సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ (ఎస్ఎంసిసి) ఏర్పాటుపై తాజా పరిస్థితి, ప్రాజెక్టులలో నియామకం కోసం సాంకేతిక సిబ్బంది వయస్సులో సడలింపుపై సమీక్ష జరిగింది. 

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ (ఎస్ఎంసిసి) అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశ వైజ్ఞానిక నైపుణ్యం గురించి అన్ని వాటాదారులకు సాధారణ అవగాహన కల్పించడానికి అన్ని విభాగాల విజయగాథలను సంకలనం చేసి సాధారణ ప్రజలకు ప్రచారం చేయాలన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ప్రాంతీయ భాషలలో సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, సృజనాత్మక కంటెంట్ రూపకల్పన, సైన్స్ & టెక్నాలజీకి సంబంధించిన రోజువారీ వార్తల బులెటిన్‌ల తయారీలో నిమగ్నమవ్వడానికి కలిసి పనిచేయాలని ఆయన ఆదేశించారు.

 

ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, సైన్స్, టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సిఎస్ఐఆర్, ఎర్త్ సైన్సెస్, స్పేస్, అటామిక్ ఎనర్జీతో సహా సైన్స్ విభాగాలు, డిపార్ట్‌మెంట్‌ల సెక్రటరీలు హాజరయ్యారు.

*****



(Release ID: 1922713) Visitor Counter : 105