వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాణిజ్యం, పెట్టుబడులపై జరగనున్న జరగనున్న 6వ భారత్- కెనడా మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొనడానికి కెనడా లో పర్యటించనున్న శ్రీ పీయూష్ గోయల్

Posted On: 08 MAY 2023 9:49AM by PIB Hyderabad

 వాణిజ్యం, పెట్టుబడులపై   ఈరోజు ఒట్టావా లో జరగనున్న 6వ  భారత్- కెనడా  మంత్రుల స్థాయి సమావేశానికి కెనడా అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతి ప్రోత్సాహం, చిన్న వ్యాపారం, ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి మేరీ ఎన్‌జి తో కలిసి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజా పంపిణీ,  జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌ సహ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో వాణిజ్యం , పెట్టుబడులకు సంబంధించిన వివిధ అంశాలు, రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలు చర్చకు రానున్నాయి. భారతదేశం, కెనడా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయడం, పెట్టుబడి ప్రోత్సాహం, సహకారం, హరిత ఇంధన వినియోగం, ముఖ్యమైన ఖనిజాలు లాంటి రంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత  పటిష్టం చేయడానికి చర్చలు, బి2బి సమావేశాలు నిర్వహించడం  సహా పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి.
భారత్-కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల  పురోగతిని కూడా మంత్రులు సమీక్షిస్తారు.  2022 మార్చిలో జరిగిన  మంత్రుల స్థాయి సమావేశంలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై రెండు దేశాల మంత్రుల మధ్య చర్చలు జరిగాయి.  రెండు దేశాల మధ్య మధ్యంతర ఒప్పందం లేదా EPTA (ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్) కుదిరే అవకాశంపై దృష్టి సారించారు. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య ఆరు సార్లు చర్చలు జరిగాయి.
2023 మే 9,10 తేదీల్లో శ్రీ గోయల్ టొరంటో లో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులపై శ్రీ గోయల్ వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. కెనడాకు చెందిన ప్రముఖ సంస్థల సీఈఓలు, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారతదేశం,కెనడా దేశాలకు చెందిన సంస్థల సీఈవోలు పాల్గొనే చర్చల్లో ఆర్థిక అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ఫిక్కీ కి చెందిన సీఈవోలు మంత్రితో కలిసి చర్చల్లో పాల్గొంటారు.
ఉత్తర అమెరికా లో అతిపెద్ద ఆహార ఆవిష్కరణ వాణిజ్య ప్రదర్శనగా గుర్తింపు పొందిన  SIAL CANADA-2023లో భారత పెవిలియన్‌ను మంత్రి ప్రారంభిస్తారు.ప్రదర్శనలో 50 దేశాలకు చెందిన 1000కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆహార రంగానికి సంబంధించి రిటైల్, ఫుడ్ సర్వీస్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అవసరాలు గుర్తించి  అభివృద్ధి సాధించడానికి అమలు చేయాల్సిన చర్యలను గుర్తిస్తారు.
శ్రీ గోయల్ పర్యటనతో భారతదేశం-కెనడా దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి రంగాల్లో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

***


(Release ID: 1922492) Visitor Counter : 186