పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
తుక్కు నుంచి సంపదః వ్యర్ధాల వినియోగాల కోసం వినూత్న పరిష్కారాలపై హాకెథాన్
వ్యర్ధాల నుంచి సంపద అవధారణ హాకెథాన్ అన్న అంశంపై 14 మే 2023న ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న సిపిసిబి
Posted On:
04 MAY 2023 4:05PM by PIB Hyderabad
మిషన్ లైఫ్, ఆవృత ఆర్థిక లక్ష్యాల సందేశ స్ఫూర్తితో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు 14 మే, 2023 (ఆదివారం)న వేస్ట్ టు వెల్త్ ఐడియేషన్ హాకెథాన్ (వ్యర్ధాల నుంచి సంపద అవధారణ హాకెతాన్)ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు నిర్వహిస్తోంది. ఇందుకు ప్రస్తుతం నమోదు జరుగుతోంది, ఆసక్తి కలవారు https://cpcb.nic.in/w2w-hackathon-cpcb/# అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా తమ వివరాలను సమర్పించవచ్చు.
ఇది దేశవ్యాప్తంగా ఉన్న కళాశాల విద్యార్ధులు వాస్తవ ప్రపంచంలో (ఎ) ప్లాస్టిక్ వ్యర్ధులు (బి) ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (సి) బ్యాటరీ వ్యర్ధాలు (డి) పంట వ్యర్ధాలు వంటి వ్యర్ధాల నిర్వహణలో సవాళ్ళను పరిష్కరించేందుకు వేదికను అందించేందుకు జరుగుతున్న దేశవ్యాప్త కార్యక్రమం. వ్యర్ధాల నిర్వహణ గురించి వారికున్న అవగాహనను మరింత పెంచుకునేందుకు మాత్రమే కాక వ్యర్ధాలను సంపదగా మార్చేందుకు ప్రస్తుత వినూత్న పరిష్కారాలను అందించేందుకు తోడ్పడుతుంది.
అన్ని వ్యర్ధాల స్రవంతుల వ్యాప్తంగా రూ. 3.6 లక్షల విలువైన నగదు బహుమతులను విద్యార్ధులకు అందించే ప్రత్యేక అవకాశం ఈ ఐడియేషన్ హాకెథాన్.
ఐడియేషన్ హాకెథాన్ జరిగే రోజున, అంటే మే 14, 2023 (ఆదివారం)నాడు నాలుగు వ్యర్ధాలకు సంబంధించిన వర్గాల నుంచి ఒక సమస్య ప్రతిపాదనను సిపిసిబి వెబ్‌సైట్‌లో ఉదయం 09ః00 గంటలకు పోస్ట్ చేస్తారు. విద్యార్ధులు ఇందుకు సంబంధించిన తమ మూల లేదా ప్రాథమిక ఆలోచనలకు సమాధానాలను సూచించిన టెంప్లేట్ లో నింపి సాయంత్రం 05ః00 గంటలకు w2w.cpcb[at]gov[dot]in అన్న ఐడికి ఇమెయిల్ చేయవలసి ఉంటుంది.
ప్రతి వర్గపు వ్యర్ధానికి సంబంధించిన ఉత్తమ మూల భావనలకు వరుసగా రూ. 50,000, రూ. 25,000, రూ. 15,000 నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. దీనితోపాటుగా, ఎంపిక చేసిన భావనలకు ఇన్‌క్యుబేషన్ మద్దతు, పరిశ్రమల పరిచయం, సిపిసిబిలోని ఉత్తమ శాస్త్రవేత్తల మార్గదర్శనం లభిస్తాయి. అర్హత, ప్రక్రియ, ముఖ్య తేదీలు, సమస్య పరిధికి సంబంధించిన వివరాలను https://cpcb.nic.in/w2w-hackathon-cpcb/ అన్న లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
నమోదు చేసుకునేందుకు ఆఖరు తేదీ 12 మే 2023 (శుక్రవారం),
***
(Release ID: 1922217)