పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ ఉద్గారాల భారీ తగ్గింపు, పునరుత్పాదక ఉత్పత్తుల విస్తరణకు ప్రపంచం కట్టుబడి ఉండాలనే లక్ష్యంపై పీటర్స్‌బర్గ్ క్లైమేట్ డైలాగ్ లో విస్త్రత ఏకీభిప్రాయం ఉందన్న శ్రీ భూపేంద్ర యాదవ్
Posted On:
04 MAY 2023 12:38PM by PIB Hyderabad
సిఒపి 28లో ఉమ్మడి నిర్ణయాలకు పునాదులు వేయడానికి ప్రతినిధుల కృషితో పీటర్స్‌బెర్గ్ క్లైమేట్ డైలాగ్ ( పర్యావరణ గోష్టి) బెర్లిన్‌లో ముగిసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ ఉద్గారాలలో భారీ తగ్గింపు, పునరుత్పాదక ఉత్పత్తుల విస్తరణకు ప్రపంచం కట్టుబడి ఉండాలనే లక్ష్యంపై విస్త్రత ఏకాభిప్రాయం ఉందని, ఆయన తన ట్వీట్ల పరంపరలో అన్నారు.
చర్చలలో భారత్ తనతరుఫు వాదాన్ని బలంగా ప్రతిపాదించిందని శ్రీ యాదవ్ అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఉద్ఘాటించినట్టుగా, ఎవరినీ వదలకుండా కలుపుకుపోవాలనే స్ఫూర్తితో న్యాయమైన, స్థోమత, సమ్మిళిత శక్తి పరివర్తనకు మద్దతు అవసరాన్ని గుర్తించడం చాలా కీలకమని ఈ కార్యక్రమంలో పునరుద్ఘాటించారు.
పర్యావరణ అనుకూల మార్గాన్ని అనుసరిస్తున్న క్రమంలో ప్రస్తుత ఇంధన వ్యవస్థలపై ఆధారపడిన స్థానిక ప్రజల ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పరిరక్షించేందుకు, ఆర్థిక వ్యవస్థను బహుముఖం చేయడంపై, అవసరానికి తగినట్టుగా నూతన ఉపాధులను సృష్టించడంపై దృష్టిపెట్టనున్నట్టు శ్రీ యాదవ్ తెలిపారు.
ఇంతకు ముందు, శ్రీ యాదవ్, స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ గ్లోబల్ స్టాక్ టేక్ అండ్ రోడ్ మాప్ ఫర్ గ్లోబల్ ట్రాన్సఫర్మేషన్ ( ప్రపంచ స్టాక్‌ల అంచనాపై వ్యూహాత్మక సంభాషణ & ప్రపంచ పరివర్తనకు మార్గం) అన్న సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచ స్టాక్ అంచనా ఫలితం అన్నది పర్యావరణ మార్పు ప్రభావాలు, చర్యలు, ప్రతిస్పందనలు అన్నీ పేదరిక నిర్మూలనతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి ప్రాధాన్యతలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే దానిపై దృష్టి పెట్టాలో కేంద్ర మంత్రి పట్టి చూపారు.
తొలి జిఎస్‌టి ఫలితం సుస్థిర జీవనశైలితో పాటు స్థిరమైన వినియోగంపై, మరింత అంతర్జాతీయ సహకారానికి సంబందించిన సందేశాన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ (ఎన్‌డిసి- జాతీయంగా నిర్ణయించిన తోడ్పాటు)తదుపరి రౌండ్‌లో వెల్లడించే యత్నం చేయాలని ఆయన అన్నారు.
***
(Release ID: 1921934)
Visitor Counter : 222