ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 100 ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఫుడ్ను స్త్రీట్స్ ని అభివృద్ధి చేసేందుకు ‘ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్’ను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్గదర్శకాల ప్రకారం ప్రామాణిక బ్రాండింగ్‌తో ఒక్కో ఫుడ్ స్ట్రీట్‌కు రూ. 1 కోటి ఆర్థిక సహాయం

గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం సంయుక్తంగా అమలు

Posted On: 04 MAY 2023 12:25PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ- భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సీనియర్ అధికారులతో దేశవ్యాప్తంగా 100 ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఫుడ్ స్త్రీట్స్ ను అభివృద్ధి చేయడానికి ‘ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్’ను సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఆహార వ్యాపారాలు, కమ్యూనిటీ సభ్యులలో సురక్షితమైన,  ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడం, తద్వారా ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను తగ్గించడం, మొత్తం ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం.

ఫుడ్ స్ట్రీట్ ను అమలు చేయడానికి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)  దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఇటువంటి 100 ఫుడ్ స్ట్రీట్‌లకు ప్రోత్సహించాడనికి  పైలట్ ప్రాజెక్ట్‌గా ఫుడ్ స్ట్రీట్‌కి 1 కోటి రూపాయలు చొప్పున ఇస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ  మార్గదర్శకాల ప్రకారం ఈ ఫుడ్ స్ట్రీట్‌ల బ్రాండింగ్ జరగాలనే షరతుతో, ఎన్హెచ్ఎం కింద గ్రాంట్ 60:40 లేదా 90:10 నిష్పత్తిలో ప్రణాళిక చేయడం అయింది. 

సురక్షితమైన తాగునీరు, చేతులు కడుక్కోవడం, టాయిలెట్ సౌకర్యాలు, సాధారణ ప్రాంతాలలో టైల్డ్ ఫ్లోరింగ్, తగిన ద్రవ, ఘన వ్యర్థాల తొలగింపు, డస్ట్‌బిన్‌ల ఏర్పాటు, బిల్‌బోర్డ్‌లను ఉపయోగించడం,  శాశ్వత స్వభావం సంకేతాలు వంటి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించడం జరుతుంది. 

ఎఫ్ఎస్ఏఐ సాంకేతిక మద్దతుతో పాటు గృహనిర్మాణ,  పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యుఏ)తో కలిసి ఎన్హెచ్ఎం ద్వారా ఈ కార్యక్రమం అమలు అవుతుంది. ఫుడ్ స్ట్రీట్ ల డిజైన్ లు,  ఎస్ఓపి రూపకల్పన, విపత్తు విశ్లేషణ, ప్రోటోకాల్ కింద శిక్షణ అందించడం సాంకేతిక సహాయంలో ఉంటాయి. 

ఫుడ్ స్ట్రీట్ భారతీయ ఆహార సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. భారతీయ ఆహార ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో అపారమైన పాత్రను పోషించింది. ఇది లక్షలాది  మంది భారతీయులకు సరసమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. వేగవంతమైన పట్టణీకరణతో, స్ట్రీట్ ఫుడ్ హబ్‌లు ఆహారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి దారితీశాయి. అయితే ఈ హబ్‌లలో ఆహార భద్రత, పరిశుభ్రత ఆందోళన కలిగించే అంశాలు. 

ఫుడ్ స్ట్రీట్ హబ్‌ల కోసం పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల ప్రోటోకాల్‌లను మెరుగుపరచడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమాలలో ఫుడ్ హ్యాండ్లర్‌లకు శిక్షణ, స్వతంత్ర థర్డ్-పార్టీ ఆడిట్‌లు, ఈట్ రైట్ ఇండియా ఉద్యమం క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ చొరవ కింద ధృవీకరణ ఉన్నాయి.

ఫుడ్ స్త్రీట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

క్రమ సంఖ్య 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 

 

ఫుడ్ స్ట్రీట్ ల సంఖ్య 

1

ఆంధ్రప్రదేశ్ 

4

       2

అస్సాం 

4

3

బీహార్ 

4

4

ఛత్తీస్గఢ్ 

4

5

ఢిల్లీ 

3

6

గోవా 

2

7

గుజరాత్ 

4

8

హర్యానా 

4

9

హిమాచల్ ప్రదేశ్ 

3

10

జమ్మూ కాశ్మీర్ 

3

11

ఝార్ఖండ్ 

4

12

కర్ణాటక 

4

13

కేరళ 

4

14

లడఖ్ 

1

15

మధ్యప్రదేశ్ 

4

16

మహారాష్ట్ర 

4

17

ఒడిశా 

4

18

పంజాబ్ 

4

19

రాజస్థాన్ 

4

20

తమిళనాడు 

4

21

తెలంగాణ 

4

22

ఉత్తరప్రదేశ్ 

4

23

ఉత్తరాఖండ్ 

4

24

పశ్చిమ బెంగాల్ 

4

25

అరుణాచల్ ప్రదేశ్ 

1

26

మణిపూర్ 

1

27

మేఘాలయ 

1

28

మిజోరాం 

1

29

నాగాలాండ్ 

1

30

సిక్కిం 

1

31

త్రిపుర 

1

32

అండమాన్ నికోబర్ దీవులు 

1

33

చండీగఢ్ 

1

34

దాద్రా నాగర్ హవేలీ ; డామన్ డయ్యు 

1

35

లక్షద్వీప్ 

1

36

పుదుచ్చేరి 

1

 

మొత్తం 

100

 

 

****



(Release ID: 1921930) Visitor Counter : 124