బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గత ఐదేళ్లలో దాదాపు 23 శాతం పెరిగిన దేశీయ బొగ్గు ఉత్పత్తి


స్థిరమైన మైనింగ్ మరియు మెరుగైన ఉత్పత్తిని నిర్ధారిస్తున్న బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 03 MAY 2023 3:44PM by PIB Hyderabad

భారతదేశ  మొత్తం బొగ్గు ఉత్పత్తి 2018-2019 ఆర్థిక సంవత్సరంలో జరిగిన 728.72 ఎంటీల ఉత్పత్తితో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 893.08 ఎంటీక అంటే దాదాపు 22.6% వృద్ధిని సాధించింది. ప్రత్యామ్నాయ బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడం మంత్రిత్వ శాఖ యొక్క ప్రాధాన్యత. గత 5 సంవత్సరాలలో కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఉత్పత్తి 15.9% వృద్ధితో 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 606.89 ఎంటీతో పోలిస్తే 703.21 ఎంటీ (మిలియన్ టన్నులు) పెరిగింది. ఎస్‌సిసిఎల్ 4.3% వృద్ధితో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 64.40 ఎంటీ నుండి 2022-23 ఆర్ధికసంవత్సరంలో 67.14 ఎంటీకు ఆకట్టుకునే వృద్ధిని నమోదు చేసింది. క్యాప్టివ్ మరియు ఇతర గనులు కూడా 113.7% వృద్ధితో 2018-19 ఆర్థిక సంవత్సరంలో 57.43 ఎంటీ ఉండగా2022-23 ఆర్థిక సంవత్సరంలో 122.72 ఎంటీ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి.

 

image.png

image.png


అన్ని రంగాల డిమాండ్‌ను తీర్చడానికి మరియు థర్మల్ పవర్ ప్లాంట్‌లలో తగినంత బొగ్గు నిల్వలను నిర్ధారించడానికి స్వయం ప్రతిపత్తిని సాధించడానికి దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ  అనేక చర్యలను ప్రారంభించింది. బొగ్గు ఉత్పత్తిలో అసాధారణ వృద్ధి దేశ ఇంధన భద్రతకు మార్గం సుగమం చేసింది. 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 1012 ఎంటీ.

అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వనరుల పరిరక్షణ, సామాజిక సంక్షేమం మరియు  అడవులు, జీవవైవిధ్యాన్ని సంరక్షించే చర్యలపై దృష్టి సారించడం ద్వారా బొగ్గు ఉత్పత్తితో కలిసి స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ చురుగ్గా పాల్గొంటుంది. బొగ్గు మంత్రిత్వ శాఖ గనులలో రోడ్డు రవాణాను తొలగించడానికి సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేయడానికి ఒక వ్యూహాన్ని రూపొందించింది మరియు 'ఫస్ట్ మైల్ కనెక్టివిటీ' ప్రాజెక్టుల క్రింద యాంత్రిక బొగ్గు రవాణా మరియు లోడింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు చేపట్టింది.


 

*****


(Release ID: 1921713) Visitor Counter : 213