రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మే 01వ తేదీ మధ్య మాల్దీవులలో పర్యటించనున్న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 30 APR 2023 10:09AM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మే 01-03, 2023 మధ్య మాల్దీవులలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో, భాగంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల రక్షణ మంత్రి మిస్ మరియా అహ్మద్ దీదీ మరియు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.   ఈ చర్చల సమయంలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల పూర్తి స్థాయిని సమీక్షించనున్నారు. రక్షా మంత్రి మాల్దీవుల అధ్యక్షుడు మిస్టర్ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్‌ను కూడా కలువనున్నారు.  ఈ ప్రాంతంలోని స్నేహపూర్వక దేశాలు మరియు భాగస్వాముల సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారతదేశం యొక్క నిబద్ధతకు అనుగుణంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల జాతీయ రక్షణ దళాలకు ఒక ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ షిప్ మరియు ల్యాండింగ్ క్రాఫ్ట్‌ను బహుమతిగా ఇవ్వనున్నారు. తన పర్యటనలో భాగంగా మంత్రి  దేశంలో కొనసాగుతున్న ప్రాజెక్ట్ సైట్‌లను కూడా సందర్శిస్తారు. ప్రవాస భారతీయులతోను సంభాషించనున్నారు. రెండు దేశాల మధ్య బలమైన స్నేహ బంధాలను పెంపొందించడంలో రక్షణ మంత్రి పర్యటన ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది.  సముద్ర భద్రత, తీవ్రవాదం, రాడికలైజేషన్, పైరసీ, అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు మరియు ప్రకృతి వైపరీత్యాలతో సహా భాగస్వామ్య సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి భారతదేశం మరియు మాల్దీవులు సన్నిహితంగా పనిచేస్తున్నాయి. సాగర్ (ప్రాంతంలోని అందరి భద్రత మరియు వృద్ధి) యొక్క భారతదేశ దృష్టి కోణన పాటు దాని ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానం అలాగే మాల్దీవుల ‘ఇండియా ఫస్ట్’ విధానం హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సామర్థ్యాలను సంయుక్తంగా అభివృద్ధి చేసుకోవడానికి  పనిచేయాలని కోరుతున్నాయి.

 ****



(Release ID: 1921532) Visitor Counter : 95